Phalguna pournami: ఫాల్గుణ పౌర్ణమికి, లక్ష్మీదేవికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఏడాది అదృష్టమైన రోజు ఇదే-what is the connection between phalguna pournami goddess lakshmi devi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Phalguna Pournami: ఫాల్గుణ పౌర్ణమికి, లక్ష్మీదేవికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఏడాది అదృష్టమైన రోజు ఇదే

Phalguna pournami: ఫాల్గుణ పౌర్ణమికి, లక్ష్మీదేవికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ఏడాది అదృష్టమైన రోజు ఇదే

Gunti Soundarya HT Telugu
Mar 22, 2024 11:36 AM IST

Phalguna pournami: హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ పౌర్ణమి రోజునే లక్ష్మీ జయంతి జరుపుకుంటారు. ఆరోజు అమ్మవారిని పూజిస్తే సకల సంపదలు లభిస్తాయి.

లక్ష్మీ జయంతి
లక్ష్మీ జయంతి

Phalguna pournami: హిందూమతంలో పౌర్ణమి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అందులోనూ ఫాల్గుణ పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది హిందూ సంవత్సరంలో వచ్చే చివరి పౌర్ణమి. ఆరోజే సంపదలకు అది దేవత అయిన లక్ష్మీదేవి జయంతి కూడా జరుపుతారు. అందుకే ఫాల్గుణ పౌర్ణమిని సంవత్సరంలోనే అదృష్టమైన రోజుగా పరిగణిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే సంతోషం, శ్రేయస్సు, సంపద లభిస్తుంది. పౌర్ణమి రోజు చేసే పూజలకు, దానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది.

హోలికా దహన్

ఫాల్గుణ పౌర్ణమి రోజు హోలికా దహన్ నిర్వహిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఇది జరుపుకుంటారు. పవిత్ర నదులలో స్నానం చేసి ఆచారాల ప్రకారం హోలికా దహనం చేస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలోని సమస్యలన్నీ హోలికా దాహనంలోని మంటల్లో ఆహుతి అవుతాయని నమ్ముతారు. ఈ ఏడాది ఫాల్గుణ పౌర్ణమి మార్చి 24 ఆదివారం వచ్చింది. ఆరోజే లక్ష్మీ జయంతి కూడా కావడంతో ఈ ఏడాదిలో అదృష్టమైన రోజుగా మారింది.

పౌర్ణమి ప్రాముఖ్యత

ఫాల్గుణ పౌర్ణమి రోజు ఉపవాసం పాటించడం వల్ల విష్ణువు, చంద్రుడు అనుగ్రహాన్ని పొందుతారు. లక్ష్మీజయంతి సందర్భంగా ఫాల్గుణ పౌర్ణమి నాడు ఆచారాల ప్రకారం అమ్మవారిని పూజించాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఖీర్ సమర్పించాలి. ఎరుపు రంగు చునారి పూజలో తప్పకుండా అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగి సంపదతో నిండిపోతుంది. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఆ ఇల్లు సుఖసంతోషాలతో నిండిపోతుంది.

ఫాల్గుణ పౌర్ణమి అదృష్ట రోజు అని ఎందుకంటారు?

హిందూ క్యాలెండర్ ప్రకారం చివరి నెల ఫాల్గుణ మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి సంవత్సరంలో చివరిదిగా పరిగణిస్తారు. ఫాల్గుణ పౌర్ణమిని లక్ష్మీ జయంతి అంటారు. దీని తర్వాత హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంతో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేస్తే అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు.

జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం పన్నెండు రాశులు ఉండగా వాటిలో నాలుగు రాశులు మాత్రం లక్ష్మీదేవిని అత్యంత ఇష్టమైనది. వీరికి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఆ రాశులు ఏవంటే..

వృషభం

లక్ష్మీదేవికి ఇష్టమైన మొదటి రాశి వృషభం. ఈ రాశికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. సంపద, కీర్తి, భౌతిక ఆనందం విలాసానికి శుక్రుడు ప్రసిద్ధి. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు సంపదకు ఎటువంటి లోటు ఉండదు. అలాగే వారికే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వృషభ రాశి వారు చాలా తక్కువగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

కర్కాటకం

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. చంద్రుడిని చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రాశి జాతకులు కష్టపడి పని చేసే మనస్తత్వం, అంకితభావంతో ఉంటారు. ఈ లక్షణాల కారణంగా కర్కాటక రాశి వారు ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు. చంద్రుడి అనుగ్రహం కలిగిన వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆర్థికంగా సంపన్నులు అవుతారు. డబ్బు కొరత ఎదుర్కోరు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. అన్ని గ్రహాలకు అధిపతిగా పిలుస్తారు. ఏ పని అప్పగించిన మనస్పూర్తిగా, బాధ్యతాయుతంగా పనిచేస్తారు. అందువల్ల వృశ్చిక రాశి వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. సుఖసంతోషాలతో గడుపుతారు.

సింహ రాశి

సింహ రాశి వారికి ప్రతి కష్టాన్ని అధిగమించే సామర్థ్యం ఉంటుంది. సూర్య భగవానుడు లక్ష్మీదేవి ఆశీస్సులు వల్ల సింహ రాశి వారు అన్ని రకాల ఇబ్బందులు, అడ్డంకుల నుంచి బయటపడగలుగుతారు. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఆర్థికంగా సంపూర్ణంగా జీవితం జీవిస్తారు. సమాజంలో వీరికి గౌరవం కూడా లభిస్తుంది. డబ్బు విజయం రెండింటిని సాధించగలుగుతారు.