Anumathi devi: సంతానం, సంపదనిచ్చే అనుమతి దేవి గురించి మీకు తెలుసా?
Anumathi devi: శ్రేయస్సు, సంపద, సంతానోత్పత్తిని ఇచ్చే దేవత అనుమతి దేవి. ఈమెను చంద్ర దేవత అని కూడ పిలుస్తారు.
Anumathi devi: పురాణాల ప్రకారం సరస్వతీ, లక్ష్మీదేవి.. ఇలా ఎంతో మంది దేవతల గురించి ఎక్కువగా అందరికీ తెలుసు. కానీ అనుమతీ దేవి గురించి తెలుసా..? శివారాధనలో ఆమె పేరు తప్పకుండా వస్తుంది. ఏదైనా కార్యం చేపట్టే ముందు దైవిక అనుమతి ఉండాలి అంటారు.
హిందువులు ఎక్కువగా నమ్మే మాట శివుని ఆజ్ఞ లేకుండా చీమైన కుట్టదు అంటారు. ఆ శివుని ఆజ్ఞలు తెలిపే అమ్మవారే ఈ అనుమతీ దేవి. ఎక్కువగా సంతానోత్పత్తి, ప్రయాణాలకు రక్షణగా అనుమతీ దేవి నిలుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ పురాణాలలో ఉన్న ఒక దేవత అనుమతి దేవి. చంద్రుడు, నక్షత్రాల దేవతగా పూజిస్తారు. ప్రధానంగా భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో అనుమతిదేవిని పూజిస్తారు.
సంతానోత్పత్తిని ఇచ్చే దేవత
సంతానోత్పత్తి, శ్రేయస్సు, సంపద, అదృష్టాన్ని ఇచ్చే దేవతగా విశ్వసిస్తారు. హిందూ పురాణాల ప్రకారం విష్ణువు సోదరి. సూర్యులలో ఒకరైన ధాత్రాదిత్యుని భార్య. అథర్వణ వేదం, రుగ్వేదం, మహా భారతంలోని అనుమతీదేవి గురించి ప్రస్తావించారు. పురాతన మత గ్రంథాలలో ఒకటైన రుగ్వేదంలో అనుమతి దక్షుని కుమార్తె అని పిలుస్తారు. చంద్రుడు, నక్షత్రాల దేవతగా పూజిస్తారు.
అనుమతీ దేవిని ఆరాధించడం వల్ల సంతానం కలుగుతుందని అంటారు. ఆరోగ్యకరమైన పిల్లలని ఇస్తుందని, శ్రేయస్సు ఇస్తుందని భక్తుల విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం దక్షుని కుమార్తెగా అనుమతి జన్మించిందని చెప్తారు. అనుమతి దేవి, అనుమతి మా, అనుమతి దేవత వంటి అనేక పేర్లతో పిలుస్తారు. యముడు, యమునా నది తల్లి అనుమతి దేవి అని అంటారు. చంద్ర దేవత అని పిలుస్తారు.
మశూచి దేవత మరో పేరు
ప్రకాశవంతమైన ముఖ చిత్రం కలిగి ఉంది చిరునవ్వుతో అందమైన దేవతగా చెప్తారు. అనుమతీ దేవి చంద్రుడు, నక్షత్రాలని సూచించే రెండు గుర్రాలు రథాన్ని స్వారీ చేస్తున్నట్టుగా చూపిస్తారు. అనుమతి దేవి వాహనం కృష్ణ జింక. భక్తులు శ్రేయస్సు, అదృష్టం, సంతానోత్పత్తి కోసం అనుమతీదేవిని పూజిస్తారు. ప్రయాణాలు చేసే వారికి రక్షకురాలిగా ఉంటుందని అంటారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అనుమతి దేవిని మశూచి దేవతగా కూడా పూజిస్తారు. వ్యాధులని దూరం చేసేందుకు అనుమతి దేవి ఆశీర్వాదం కోసం పూజలు చేస్తారు.
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో అనుమతి దేవిని ఎక్కువగా పూజిస్తారు. ప్రతినెల పౌర్ణమి రోజున అమ్మవారిని పూజిస్తే ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. అనుమతి ఆశీర్వాదం, రక్షణ కోసం కొవ్వొత్తులు, ధుపాలు వెలిగిస్తారు. సున్నితమైన దయగల స్వభావం కలిగిన దేవతగా పరిగణిస్తారు. సంతానోత్పత్తి దేవతగా ఎక్కువ మంది నమ్ముతారు. యజ్ఞయాగాది కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అనుమతిదేవిని స్మరించుకుంటే వాళ్ళు అనుకున్నది జరుగుతుందని అంటారు.