Mercury- venus conjunction: కొత్త సంవత్సరం 4 శుభయోగాలు.. ఈ రాశుల వారి దశ తిరిగినట్టే
Mercury- venus conjunction: బుధ శుక్రుల కలయిక 2024 సంవత్సరంలో నాలుగు శుభ యోగాలకు నాంది పలికింది. గ్రహాల గమనం కొత్త ఏడాది కొన్ని రాశుల అదృష్టం తెచ్చిపెట్టింది.
Mercury venus transit: గ్రహాల గమనానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొత్త సంవత్సరంలో కొన్ని కీలకమైన గ్రహాలు ఒక రాశి చక్రం నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ స్థానం మార్చుకుంటున్నాయి. గ్రహాల మార్పు 12 రాశి చక్రాల వారిని ప్రభావితం చేస్తుంది.
నవగ్రహాల యువరాజు బుధుడు. ప్రస్తుతం వక్ర గమనంలో ప్రయాణిస్తున్నాడు. కొత్త సంవత్సరం బుధుడు తన మార్గాన్ని మార్చుకుంటున్నాడు. బుధుడు, శుక్రుల కలయిక ఎంతో శుభదాయకం. గత నెల శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. జనవరి 2 నుంచి బుధుడు వృశ్చిక రాశిలో ప్రత్యక్ష మార్గంలో పయనించనున్నాడు. దీని వల్ల కొత్త సంవత్సరంలో నాలుగు శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి.
వృశ్చికంలో బుధుడు, శుక్రుడు కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది జనవరి 7 వరకు ఉంటుంది. లక్ష్మీ నారాయణ యోగంతో పాటు గజకేసరి యోగం, ఆదిత్య యోగం, ఆయుష్మాన్ యోగం వరించనున్నాయి. బుధుడు జ్ఞానం, మేధస్సు, వ్యాపారం, తెలివితేటలు, ఆలోచనలకి కారకుడిగా భావిస్తారు. శుక్రుడు ప్రేమ, వివాహం, భోగం, వాహనం వంటి ఇతర విషయాలకు కారకుడిగా భావిస్తారు. ఇవి రెండు శుభ గ్రహాలుగా చెప్తారు. బుధ, శుక్ర సంయోగం వల్ల సంపద, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. నాలుగు శుభ యోగాల ఫలితంగా కొన్ని రాశుల వాళ్ళు అదృష్టం పొందబోతున్నారు. ఆ రాశుల జాబితాలో మీ రాశి ఉందేమో చూసుకోండి.
తులా రాశి
కొత్త సంవత్సరం తులా రాశి వాళ్ళు ధనవంతులు కాబోతున్నారు. పారిశ్రామిక వేత్తలకు ఇది మంచి సమయం. పెట్టుబడులు పెడితే ఈ సమయంలో మంచి లాభాలు గడిస్తారు. ధనం సంపాదిస్తారు. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంతో కలిసి సరదాగా విహార యాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. పెట్టుబడులకి అనుకూలమైన సమయం.
సింహ రాశి
శుభ యోగాల ప్రభావం వల్ల కొత్త సంవత్సరం సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రహాల శుభ ప్రభావం వల్ల వ్యాపారులకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు క్రమంగా తొలగిపోయి సంతోషకరమైన జీవితం రాబోతుంది. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. ఒత్తిడి లేకుండా ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
వృశ్చిక రాశి
2024 వృశ్చిక రాశి వాళ్ళు సరికొత్త జీవితం చూడబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు చేసే వారి పరిస్థితులు బాగుంటాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం దైవారాధనలో నిమగ్నమవడం మంచిది.