Double gaja kesari yogam: డబుల్ గజకేసరి యోగం.. ఈ మూడు రాశుల జాతకులకు రెట్టింపు లాభాలు-double gaja kesari yogam form in tula rashi these zodiac signs get bright future ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Double Gaja Kesari Yogam Form In Tula Rashi, These Zodiac Signs Get Bright Future

Double gaja kesari yogam: డబుల్ గజకేసరి యోగం.. ఈ మూడు రాశుల జాతకులకు రెట్టింపు లాభాలు

Gunti Soundarya HT Telugu
Mar 21, 2024 06:55 PM IST

Double gaja kesari yogam: హోలీ తర్వాత డబుల్ గజకేసరి యోగం ఏర్పడబోతుంది. దీని వల్ల మూడు రాశుల వారికి రెట్టింపు లాభాలు కలగబోతున్నాయి. ఈ యోగం వల్ల ఏయే రాశుల వాళ్ళు లాభాలు పొందుతారో చూద్దాం.

డబుల్ గజకేసరి యోగం
డబుల్ గజకేసరి యోగం (pixabay)

Double gaja kesari yogam: జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగం అత్యంత పవిత్రమైనది, శుభప్రదమైనదిగా భావిస్తారు. అటువంటి గజకేసరి యోగం జాతకంలో ఏర్పడితే ఏనుగు అంతటి సంపద లభిస్తుందని అంటారు. అయితే బృహస్పతి, చంద్రుడు కలయిక వల్ల ఈసారి డబుల్ గజకేసరి యోగం ఏర్పడబోతోంది. 

ట్రెండింగ్ వార్తలు

గజకేసరి యోగం ఉంటే అపారమైన శక్తి, జ్ఞానం, సంపద లభిస్తుంది. ఈ యోగం  ఉండటం వల్ల తెలివితేటలు, సంపద, కీర్తి పెరుగుతుంది. జాతకంలో డబుల్ గజకేసరి యోగానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇది ఆర్థిక శ్రేయస్సు, ఉన్నత విద్యను, నాయకత్వ లక్షణాలను మెరుగుపరుస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. హోలీ తర్వాత తులా రాశిలో డబుల్ గజకేసరి యోగం ఏర్పడబోతుంది. 

డబుల్ గజకేసరి యోగం అంటే ఏంటి?

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి రాశి చక్రం మారుస్తాడు. చల్లని చూపు చూసే చంద్రుడు శుభ ఫలితాలు ఇస్తాడు. ఒక రాశిలో రెండు గ్రహాలతో చంద్రుడు సంయోగం చెందినప్పుడు డబుల్ గజకేసరి యోగం ఏర్పడుతుంది.  

హోలీ రోజున చంద్రుడు కేతువుతో కలిసి కన్యా రాశిలో ఉంటాడు. ఈ రాశిలోనే  చంద్ర గ్రహణం కూడా ఏర్పడుతుంది. హోలీ తర్వాత మార్చి 27న చంద్రుడు తులా రాశిలోకి ప్రవేశించి గజకేసరి యోగాన్ని ఏర్పరుస్తాడు. తులా రాశిలో  గ్రహాల యువరాజు బుధుడు, బృహస్పతి నాలుగో ఇంట్లో సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో చంద్రుడు కూడా వారితో కలుస్తాడు. ఫలితంగా డబుల్ గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు, రెట్టింపు ఫలితాలు ఇవ్వబోతుంది. 

వృషభ రాశి

డబుల్ గజకేసరి యోగం వృషభ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. చంద్రుడు ఈ రాశి పన్నెండవ ఇంట్లో సంచరిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెడితే దాన్ని నుండి ప్రయోజనాలు పొందుతారు. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో గొప్ప లాభాలు పొందుతారు.

తులా రాశి

తులా రాశిలోనే చంద్రుడు, బృహస్పతి, బుధుడు కలయిక జరుగుతుంది. ఫలితంగా డబుల్ గజకేసరి యోగం ఏర్పడటం తులా రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఇస్తుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. శివయ్య అనుగ్రహంతో విజయాలు సొంతం చేసుకుంటారు. ఉన్నత చదువులు చదివేందుకు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఇది మంచి సమయం. వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. భార్యాభర్తల మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. 

మకర రాశి 

మకర రాశి వారికి డబుల్ గజకేసరి యోగం వల్ల ఆకస్మిక, ఊహించని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో, ఉద్యోగంలో చాలా లాభం ఉంటుంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు తారసపడతాయి.