Power Mudra: ప్రపంచంలోనే శక్తివంతమైనది పవర్ ముద్ర, ప్రతిరోజూ ఈ శక్తి ముద్రను పాటిస్తే విజయం మీదే-power mudra is the most powerful in the world success is yours if you practice this power mudra daily ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Power Mudra Is The Most Powerful In The World, Success Is Yours If You Practice This Power Mudra Daily

Power Mudra: ప్రపంచంలోనే శక్తివంతమైనది పవర్ ముద్ర, ప్రతిరోజూ ఈ శక్తి ముద్రను పాటిస్తే విజయం మీదే

Haritha Chappa HT Telugu
Mar 16, 2024 01:30 PM IST

Power Mudra: ఆధునిక కాలంలో యోగా, ధ్యానంతో అంతర్గత శక్తిని, మానసిక ఆనందాన్ని పొందుతున్న వారు ఎంతోమంది. వీరిలో కొంతమంది ప్రతిరోజు పదర్ ముద్రను అభ్యసిస్తారు. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

పవర్ ముద్ర ఎలా వేయాలి?
పవర్ ముద్ర ఎలా వేయాలి?

Power Mudra: ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి ఎక్కువైపోయింది. ఒత్తిడి కారణంగా పరధ్యానంగా ఉంటున్నవారి సంఖ్య ఎక్కువే. ఈ పరధ్యానం కారణంగా విజయానికి దూరమవుతున్న వారి సంఖ్య ఎక్కువే. ప్రతిరోజూ యోగా, ధ్యానంలో భాగంగా కొంతసేపు పవర్ ముద్రను వేస్తే ఎంతో మంచిది. ఇది మీ శరీరంలోని ప్రతి అవయవానికీ శక్తిని ప్రసారం చేస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని చురుగ్గా మారుస్తుంది.

పవర్ ముద్రతో ఉపయోగాలు

ఫోటోలో చూపించిన విధంగా పవర్ ముద్రను వేయాలి. పద్మాసనం చేసి కూర్చుని ఇలా పవర్ ముద్రను వేస్తే మనసుకు శరీరానికి కూడా మేలు జరుగుతుంది. పవర్ ముద్రను... శక్తి ముద్ర అని పిలుస్తారు. ఇది శరీరం అంతటా శక్తి ప్రవాహాన్ని జరిగేలా చేస్తుంది. మిమ్మల్ని లోపల నుండి శక్తివంతంగా మారుస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ఉపశమనం లభిస్తుంది. జీవితం పై మీకు స్పష్టత పెరుగుతుంది. పవర్ ముద్రను క్రమం తప్పకుండా సాధన చేస్తే రోగనిరోధక శక్తి కూడా బలంగా మారుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.

పవర్ ముద్ర ఎలా వేయాలి?

ప్రతిరోజూ ఈ శక్తి ముద్రను వేయడం మీ దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఇది శక్తివంతమైన అభ్యాసం. మీ వెన్నుముకను నిటారుగా ఉంచి, మీ భుజాలను రిలాక్స్ మోడ్ లో ఉంచండి. నేలపై కూర్చుని పద్మాసనం తెలుసుకోండి. లేదా కుర్చీలో సౌకర్యవంతంగా కూర్చొని కూడా ఈ శక్తి ముద్ర వేయొచ్చు. మీ చేతులను, మోకాళ్లపై పెట్టి ఫోటోలో చూపించిన విధంగా ముద్రను వేయాలి. ఇది వేళ్ళ ద్వారా మీ శరీరంలోకి శక్తిని పంపిస్తుంది. మీరు ఆ శక్తి ప్రవాహాన్ని అనుభూతి చెందుతారు. ఈ శరీరం అంతా శక్తి తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి.

మీలో ఎంతో శక్తి ఉంటుంది కానీ చుట్టూ జరిగే విషయాల వల్ల ఆ శక్తి క్షీణిస్తూ ఉంటుంది. అలా క్షీణించిన శక్తిని పెంచుకోవడానికి పవర్ ముద్ర అవసరం.

ప్రపంచంలో కొంతమంది సెలబ్రిటీలు ప్రతిరోజూ పవర్ ముద్రను ఆచరిస్తూ ఉంటారు. ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో పవర్ ముద్రలో కూర్చొని కనిపిస్తూ ఉంటాడు. ఎలన్ మస్క్ కూడా ఈ పవర్ ముద్రను ప్రాక్టీస్ చేస్తుంటారు. శక్తి ముద్ర చాలా బలమైనదే అయినప్పటికీ ధ్యానంతో పాటు దీన్ని పాటిస్తే మరిన్ని ప్రయోజనాలు వస్తాయి. ధ్యానంతో పాటు మీరు శక్తి ముద్రను వేయడం వల్ల మీకు మరింత లోతుగా ప్రశాంతత లభిస్తుంది. ప్రతిరోజూ కేవలం 10 నిమిషాల పాటు ఈ శక్తి ముద్రను వేసి ధ్యానం చేయండి చాలు. మీరే మార్పును గమనిస్తారు.

WhatsApp channel

టాపిక్