Holi colors: మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తూ హోలీ ఆడండి.. మీ జీవితం రంగులమయం అవుతుంది-holi festival 2024 select these colors as per your zodiac signs for prosperous and happy ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Holi Colors: మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తూ హోలీ ఆడండి.. మీ జీవితం రంగులమయం అవుతుంది

Holi colors: మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తూ హోలీ ఆడండి.. మీ జీవితం రంగులమయం అవుతుంది

Gunti Soundarya HT Telugu
Mar 21, 2024 10:13 AM IST

Holi colors: హోలీ రోజు మీ రాశి ప్రకారం కొన్ని పరిహారాలు పాటిస్తూ కొన్ని ప్రత్యేక రంగులతో సంబరాలు చేసుకోండి. మీ జీవితం రంగులమయం అవుతుంది.

మీ రాశి ప్రకారం ఈ రంగులతో హోలీ ఆడండి
మీ రాశి ప్రకారం ఈ రంగులతో హోలీ ఆడండి (pexels)

Holi colors: ఈ సంవత్సరం హోలీని మార్చి 25న జరుపుకుంటారు. అంతకు ముందు రోజు మార్చి 24న హోలికా దహనం నిర్వహిస్తారు. ఈ ఏడాది సర్వార్థ సిద్ది యోగం, రవి యోగం, గండి యోగం, బుధాదిత్య యోగం కలయికతో హోలీ జరుగుతుంది. ఈ శుభయోగాల వల్ల ఆనందం, శ్రేయస్సు, పురోగతి లభిస్తుంది. హోలికా దహనం సమయంలో మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తూ హోలీ వేడుకలు చేసుకోండి. సంతోషం, అదృష్టం రెట్టింపు అవుతుంది. హోలీ ఆడేందుకు మీ రాశి ప్రకారం ఈ రంగులు ఉపయోగించండి. మీ జీవితం రంగులమయమవుతుంది.

మేష రాశి

హోలికా దహనం సమయంలో ఖైరు చెట్టు చెక్కతో కొద్దిగా బెల్లం సమర్పించండి. ఎరుపు, మెరూన్, పసుపు రంగులతో హోలీ ఆడండి. అలాగే నలుపు, గోధుమరంగు, ముదురు ఆకుపచ్చ రంగులకు దూరంగా ఉండాలి.

వృషభ రాశి

గులార్ చెట్టు చెక్కతో పంచదార కలిపి హోలికా దహనం మంటల్లో సమర్పించండి. ఆకుపచ్చ, ఊదా, గులాబీ రంగులతో హోలీని ఆస్వాదించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎరుపు, కుంకుమ, ఆరెంజ్ కలర్స్ తగవు.

మిథున రాశి

హోలికా దహనం సమయంలో వెదురు లేదా మర్రి చెట్టు చెక్కతో కర్పూరాన్ని సమర్పించాలి. మానసిక ఉత్సాహం కోసం ఆకుపచ్చ, నీలం రంగులు ఉపయోగించండి. నలుపు, ఎరుపు రంగులు తగవు. లేదంటే అవి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి.

కర్కాటక రాశి

హోలికా దహన సమయంలో పలాస చెట్టు చెక్కతో లోబన్ సమర్పించండి. హోలీ రోజున కుంకుమ, లేత పసుపు, తెలుపు రంగులు ఉపయోగించండి. దీనివల్ల శాంతి, చురుకుదనం లభిస్తాయి. నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగులకు దూరంగా ఉండాలి.

సింహ రాశి

మర్రి చెట్టు చెక్కతో బెల్లం సమర్పించండి. కుంకుమ, ఎరుపు, నారింజ, పసుపు రంగులతో హోలీని ఆస్వాదించండి. నీలం, నలుపు రంగులకి దూరంగా ఉండాలి. ఇవి ఉపయోగించడం వల్ల ఒంటరితనంగా అనిపిస్తుంది.

కన్యా రాశి

జామ చెట్టు చెక్కతో కర్పూరాన్ని సమర్పించండి. ఆకుపచ్చ, నీలం రంగులతో హోలీ ఆడండి. ఇలా చేయడం వల్ల స్నేహం, ప్రేమ పెరుగుతుంది. పసుపు, ఎరుపు రంగులు మాత్రం ఉపయోగించొద్దు.

తులా రాశి

గులార్ చెట్టు చెక్కతో నువ్వులు సమర్పించండి. ఆకుపచ్చ, నీలం రంగులతో హోలీ ఆడండి. ఎరుపు, పసుపు, ఆరెంజ్ కలర్ లకు దూరంగా ఉండాలి. ఇవి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి.

వృశ్చికం

వేప చెట్టు చెక్కతో బెల్లం సమర్పించాలి. అలాగే ఎరుపు, మెరూన్ రంగులతో హోలీ ఆడాలి. ఆకుపచ్చ, నీలం రంగులు నివారించాలి. ఇవి ఆందోళన, అహంకారాన్ని పెంచుతాయి.

ధనుస్సు రాశి

కదంబ చెట్టు చెక్కతో శనగలు నైవేద్యంగా సమర్పించాలి. పసుపు, ఆకుపచ్చ, గులాబీ రంగులతో హోలీ ఆడితే మంచిది. ఎరుపు, ఆరెంజ్ కలర్స్ కి దూరంగా ఉండాలి.

మకరం

శమీ చెట్టు చెక్కతో నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. ఆధ్యాత్మిక ధోరణి ప్రోత్సహించేందుకు హోలీని ఆకుపచ్చ, నీలం రంగులతో ఆడాలి. ఎరుపు, పసుపు రంగులు తగవు.

కుంభం

శమీ చెట్టు చెక్కతో నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. సంతోషం, ఐశ్వర్యం మెరుగుపరిచేందుకు హోలీ రోజు నీలం, ఆకుపచ్చ రంగులు ఉపయోగించాలి. పసుపు, ఆరంజ్, ఎరుపు రంగులు నివారించాలి. ఇవి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. అలాగే నీలం, ఊదా రంగులు కూడా నివారించడం ఉత్తమం.

మీన రాశి

వేప చెట్టు కలపతో బార్లీని నైవేద్యంగా పెట్టాలి. ఆనందం, ఉత్సాహాన్ని పెంచుకోవడం కోసం పసుపు, ఎరుపు, గులాబీ రంగులతో హోలీ ఆడాలి. ముదురు నీలం, ఆకుపచ్చ, నలుపు రంగులు తగవు.

 

 

Whats_app_banner