Holi 2024: హోలీ రోజు ఈ వస్తువులు దానం చేశారంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే-donating these things on holi or holika dahan you will face difficulties ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Holi 2024: హోలీ రోజు ఈ వస్తువులు దానం చేశారంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే

Holi 2024: హోలీ రోజు ఈ వస్తువులు దానం చేశారంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే

Gunti Soundarya HT Telugu
Mar 19, 2024 07:00 PM IST

Holi 2024: సాధారణంగా పండుగ సమయంలో దాన ధర్మాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. కానీ హోలీ సమయంలో కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది.

హోలీ రోజు ఈ వస్తువులు దానం చేయకూడదు
హోలీ రోజు ఈ వస్తువులు దానం చేయకూడదు (unsplash)

Holi 2024: ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున హోలికా దహనం నిర్వహించి మరుసటి రోజున రంగుల పండుగ హోలీ జరుపుకుంటారు. సనాతన ధర్మంలో ప్రధాన పండుగలలో హోలీ ఒకటి. కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగ హోలీ.

సంపద, సంతోషం, సౌభాగ్యాలు పొందడం కోసం ఈ రోజున దానధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే హోలీ లేదా హోలికా దహనం రోజున కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల కోరి కష్టాన్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఎలాంటి వస్తువులు దానం చేయకూడదంటే..

మేకప్ సామాన్లు

హోలీ రోజున పసుపు, కుంకుమ, బొట్టు, గాజులు సహా16 మేకప్ సామాన్లు దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. స్త్రీ సౌభాగ్యానికి సూచికగా పసుపు, కుంకుమలు ఉంటాయి. అటువంటి వాటిని ఇతరులకు ఇవ్వడం భర్తకి క్షేమం కాదు. అందుకే వాటిని ఎవరికీ దానం చేయొద్దు.

డబ్బులు ఇవ్వకూడదు

హోలీ రోజున డబ్బులు విరాళంగా ఇవ్వకూడదు. ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మిగతా రోజుల్లోడబ్బు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

వస్త్ర దానం

హోలికా దహన్ రోజున వస్త్రాలు దానం చేయకూడదు. చిరిగినా లేదా పాతవి లేదా కొత్తవి ఏవైనా వస్త్రాలు దానం చేయడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందని విశ్వసిస్తారు. కుటుంబ జీవితంలో అశాంతి నెలకొంటుందని నమ్ముతారు. సిరి సంపదలు దూరమవుతాయి.

ఇనుము వస్తువులు దానం చేయకూడదు

హోలికా దహనం రోజు ఇనుము, ఉక్కు వంటి శనికి సంబంధించిన వస్తువులు దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆవ నూనె

హోలికా దహనం రోజున ఆవ నూనె దానం చేయకూడదు. హోలీ రోజున ఆవ నూనె దానం చేయడం వల్ల శని దేవుడికి కోపం వస్తుందని నమ్ముతారు. ఏదైనా ఇతర రోజుల్లో ఈ నూనె దానం చేయడం వల్ల శని ఆశీస్సులు లభిస్తాయి.

గాజు వస్తువులు

సాధారణంగా బహుమతులు ఇవ్వాలంటే గాజు వస్తువులు ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. కానీ హోలీ రోజున మీరు బహుమతులుగా ఇవ్వాలని అనుకున్నట్లయితే గాజు వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు, వాటిని దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్వసిస్తారు.

తెల్లని వస్తువులు వద్దు

హోలీ రంగుల పండుగ రోజు పాలు, పెరుగు, పంచదార వంటి తెల్లని వస్తువులు ఏవి దానం చేయకూడదు. ఇది అశుభంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల జాతకంలో శుక్రుడు స్థానం బలహీన పడుతుంది. శుక్ర దోషం ఏర్పడే అవకాశం ఉంది. సుఖ సంతోషాల మీద ప్రభావం చూపుతుంది.

పసుపు రంగు దుస్తులు ధరించాలి

పాజిటివిటీ, శ్రేయస్సుకి చిహ్నంగా భావించే పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. పసుపు రంగు నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. సానుకూల శక్తి ప్రసరించేలా చేసేందుకు ఆరోజు ఇల్లు, కార్యాలయం మొత్తం పసుపు రంగు పూలతో అందంగా అలంకరించుకుంటే మంచిది.

WhatsApp channel