Holy bath: సూర్యాస్తమయం తర్వాత పవిత్ర నదుల్లో పుణ్యస్నానం ఎందుకు ఆచరించకూడదు?
Holy bath: పవిత్ర నదుల్లో పుణ్య స్నానాలు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తారు. సూర్యోదయం తర్వాత పుణ్యస్నానం ఆచరించకూడదు అంటారు ఎందుకో తెలుసా?
Holy bath: పవిత్ర నదులలో స్నానం ఆచరించడం హిందువులకు ఉన్న పురాతన సంప్రదాయం. అమావాస్య, పౌర్ణమి, ముఖ్యమైన పండుగల సమయంలో పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ సూర్య భగవానుడికి నీటిని సమర్పిస్తారు. ముఖ్యంగా గంగా, యమునా, సరస్వతి నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
భక్తులకు నదులు అంటే కేవలం నీటి వనరులు మాత్రమే కాదు భగవంతుని స్వరూపంగా భావిస్తారు. అందుకే నదులకు ఎంతో గౌరవం ఉంది. కొన్ని శతాబ్దాలుగా ప్రజల ఈ పవిత్ర నదులలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తారు. పవిత్ర నదిలో పుణ్య స్నానం ఆచరించడం వల్ల మనసు శుద్ది అవుతుంది, పాపాలు కడగబడతాయని, చెడు తలంపులు తొలగిపోతాయని నమ్ముతారు.
గంగా స్నానం అత్యంత పవిత్రం
హరిద్వార్, రిశికేష్ లేదా ఇతర ప్రాంతాల్లో ప్రవహిస్తోన్న గంగా నదిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. ఇది కేవలం నదిగా మాత్రమే కాకుండా గంగామాతగా కొలుస్తారు. అన్నింటికంటే పవిత్రమైనది. గంగా నదిలో స్నానం చేయడం వల్ల ఆత్మ శుద్ధి అవుతుందని నమ్ముతారు. మోక్షానికి దారితీస్తుందని హిందువులు నమ్ముతారు. మకర సంక్రాంతి, కుంభ మేళా, గంగా దసరా వంటి పండుగలకు ఎల్లప్పుడూ లక్షలాది మంది ప్రజలు తమ పాపాలను గంగలో ప్రక్షాళన చేసి మంచి జీవితాన్ని గడపడానికి సుదూర ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు.
సూర్యాస్తమయం తర్వాత ఎందుకు చేయకూడదు?
పుణ్యస్నానం ఆచరించేందుకు సరైన సమయం ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు చేయకూడదని చెప్తారు. కానీ కొంతమంది మాత్రం సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి సమయంలో పవిత్ర నదులలో స్నానాలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమయంలో అయితే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటాయని, రద్దీ తక్కువగా ఉంటుందని ఇలా చేస్తున్నారు.
సూర్యా స్తమయం తర్వాత పవిత్ర నదులలో స్నానం చేయకూడదని చెబుతారు. ఇతిహాసాల ప్రకారం యక్షులు స్నానం చేసి పవిత్ర నదుల దగ్గర కూర్చునే సమయం రాత్రి వేళ. యక్షులు దుష్టాత్మలు కాదు కానీ నీరు, అడవులు, చెట్లు మొదలైన వాటితో ముడిపడి ఉన్న ప్రకృతి ఆత్మలు. ఈ జీవులు రాత్రి సమయంలో చురుగ్గా ఉంటాయని నమ్ముతారు. ఈ సమయంలో వారి ప్రాంతాల్లోకి ప్రవేశించడం అగౌరవంగా భావిస్తారు.
సరైన సమయం ఏది?
సాంప్రదాయకంగా పవిత్ర నదులలో స్నానం ఆచరించేందుకు సరైన సమయం ఉంటుంది. తెల్లవారుజామున లేదా బ్రహ్మ ముహూర్తంలో నది జలాలలో పవిత్ర స్నానం చేయడం మంచి సమయంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తి ఉచ్చస్థితిలో ఉంటుందని నమ్ముతారు. అందుకే పూజారులు కూడా బ్రహ్మ ముహూర్తంలోపే స్నానం చేయాలని ఆ తర్వాత కాదని అంటారు.
పవిత్ర నీటిలో ఉదయాన్నే మునక వేయడంతో రోజు ప్రారంభించడం మంచిదిగా భావిస్తారు. నీటి శుద్ధి స్వభావం వారి హృదయాల్లో ఉన్న పవిత్రమైన ఆలోచనలు పెరిగేలా చేస్తుంది. తెల్లవారుజాము మానవుల సమయంలో పరిగణిస్తారు . అర్థరాత్రులు, చీకటి వేళ ఆత్మలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమయం శుభం కాదని చెప్తారు.