జూన్ 2, నేటి రాశి ఫలాలు.. ప్రలోభాలకు లొంగవద్దు ప్రకటనలు నమ్మవద్దు-today june 2nd rasi phalalu in telugu check zodiac wise results in daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 2, నేటి రాశి ఫలాలు.. ప్రలోభాలకు లొంగవద్దు ప్రకటనలు నమ్మవద్దు

జూన్ 2, నేటి రాశి ఫలాలు.. ప్రలోభాలకు లొంగవద్దు ప్రకటనలు నమ్మవద్దు

HT Telugu Desk HT Telugu
Jun 02, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ02.06.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూన్ 2 వ తేదీ నేటి రాశి ఫలాలు
జూన్ 2 వ తేదీ నేటి రాశి ఫలాలు (pinterest )

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 02.06.2024

వారం: ఆదివారం, తిథి : ఏకాదశి

నక్షత్రం : రేవతి, మాసం : వైశాఖము,

సంవత్సరం: శ్రీ కోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. అనుకున్న పనులు ముందుకు సాగవు. మానసికంగా స్థిమితపడతారు. ప్రలోభాలకు లొంగవద్దు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. పిల్లల విషయంలో శుభం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలతో సతమతమవుతారు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య నమస్కారం వంటివి చేయటం వలన శుభఫలితాలు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఉత్సాహంగా ప్రయత్నాలు చేయండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. అప్తులతో కాలక్షేపం చేయండి. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులుంటాయి. చెల్లింపులతో ఆలస్యం తగదు. నోటీసులు అందుకుంటారు. పనుల్లో ఒత్తిడి అధికం. కీలక పత్రాలు జాగ్రత్త. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గృహమార్పు తప్పనిసరి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి. నవగ్రహ జపం చేయటం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. రావలసిన ధనం అందుతుంది. కొంత మొత్తం పొదుపు చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరాదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అరుణం పారాయణం చేయడం మంచిది. సూర్యభగవానుడికి తర్పణాలు వదలండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఒప్పందాలకు అనుకూల సమయం. ఏకపక్ష నిర్ణయాలు పనికిరావు. సన్నిహితుల సలహా పాటించండి. స్థిరాస్తి మూలధనం అందుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రయాణాలుంటాయి. కర్కాటక రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్యనారాయణమూర్తిని పూజించండి. చంద్రశేఖరాష్టకం పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. మొత్తం ధనసహాయం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దమణుగుతుంది. ఫోన్‌ సందేశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. కీలక విషయాలపై దృష్టి పెడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. సింహ రాశి వారికి మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. సూర్యాష్టకాన్ని పరించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. రావలసిన ధనం అందుతుంది. విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అంచనాలు ఫలిస్తాయి. పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు. సామరస్యంగా మెలగండి. సన్నిహితులతో సంభాషిస్తారు. పిల్లలకు మంచి జరుగుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. నోటీసులు అందుకుంటారు. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యభగవానుడిని పూజించి బెల్లం, పరమాన్నాన్ని నివేదించడం మంచిది. ఆలయాలను దర్శించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ధనలాభముంది. ఖర్చులు అధికమగును. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. సంతానపరంగా అనుకూలం. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనులు అటంకాలతో సాగుతాయి. వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ఆరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. సూర్య నమస్కారాలు చేయాలి.

వృశ్చిక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సన్నిహితుల సలహా పాటించండి. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులుంటాయి. కీలక అంశాలపై దృష్టి పెడతారు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆరోగ్యం అనుకూలించును. వృశ్చిక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఉత్సాహంగా గడుపుతారు. మీ లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల కొందరికి స్పూర్తినిస్తుంది. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. గృహ మరమ్మత్తులు చేపడతారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రకటనలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. సాయం ఆశించవద్దు. అంచనాలు ఫలిస్తాయి. పన్ను చెల్లింపులలో అలస్యం తగదు. కార్యక్రమాలు ముందుకు సాగవు. అరోగ్యం అనుకూలించును. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కొన్ని విషయాలు మీరు అనుకున్నట్లే జరుగుతాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలసివస్తాయి. మీ నమ్మకం వమ్ము కాదు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. విమర్శలు పట్టించుకోవద్దు. పిల్లలకు మంచి జరుగుతుంది. దైవదర్శనాలు ఆనందాన్నిస్తాయి. పరిచయస్తుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. కుంభ రాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పరించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వేడుకలకు సన్నాహాలు చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఒక సమాచారం ఉల్లాన్నిస్తుంది. మీ జోక్యం అనివార్యం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel