Ganga saptami 2024: గంగా సప్తమి రోజున ఇవి దానం చేస్తే అదృష్టం, గౌరవం పెరుగుతాయి!-ganga saptami 2024 donate these things to get more luck and goddess lakshmi blessings ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ganga Saptami 2024: గంగా సప్తమి రోజున ఇవి దానం చేస్తే అదృష్టం, గౌరవం పెరుగుతాయి!

Ganga saptami 2024: గంగా సప్తమి రోజున ఇవి దానం చేస్తే అదృష్టం, గౌరవం పెరుగుతాయి!

May 13, 2024, 10:31 PM IST Chatakonda Krishna Prakash
May 13, 2024, 10:25 PM , IST

Ganga saptami 2024: గంగా సప్తమి పర్వదినం మే 14వ తేదీన వచ్చింది. ఈ విశిష్టమైన రోజున కొన్ని దానం ఇవ్వడం వల్ల అదృష్టం పెరుగుతుంది. మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.  

గంగా సప్తమిని రేపు (మే 14) జరుపుకోనున్నాం. దీన్ని గంగా జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున గంగా దేవీ ఆరాధనకు అంకితంగా భావిస్తారు. 

(1 / 8)

గంగా సప్తమి రోజున గంగా నదిలో స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు దక్కుతాయి. ఈ పర్వదినం రోజున నదీ స్నానం వల్ల బాధలు, రోగాలు తగ్గి.. అనేక శుభాలు కలుగుతాయనే నమ్మకం ఉంది. అలాగే, గంగా సప్తమి రోజున అవసరార్థులకు కొన్ని రకాల వస్తువులను దానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. 

(2 / 8)

జ్యోతిష శాస్త్రం ప్రకారం, గంగా సప్తమి రోజున గంగను పూజించడం వల్ల అశుభ ప్రభావాలు తగ్గుతాయి. ఈ రోజున చేసే దానాల ఫలాలు అనేక జన్మల్లో సద్గుణాల రూపంలో దక్కుతాయి. 

(3 / 8)

గంగా సప్తమి రోజున నదీ స్నానం చేసిన తర్వాత గోధుమలను దానం చేయాలి. దీనివల్ల వ్యక్తి కీర్తి, గౌరవం పెరగటంతో పాటు సంతోషాన్ని పొందుతారనే విశ్వాసం ఉంది. 

(4 / 8)

గంగా సప్తమి రోజున నదీ స్నానం చేసిన తర్వాత గోధుమలను దానం చేయాలి. దీనివల్ల వ్యక్తి కీర్తి, గౌరవం పెరగటంతో పాటు సంతోషాన్ని పొందుతారనే విశ్వాసం ఉంది. (HT_PRINT)

గంగా సప్తమి రోజున జలదానం చేయడం చాలా మంచిది. ఈరోజున అవసరమైన వారికి నీటిని ఇవ్వడం వల్ల పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. అభివృద్ధికి ఉన్న ఆటంకాలు, గ్రహాల అశుభ ప్రభావాలు తగ్గుతాయి. 

(5 / 8)

గంగా సప్తమి రోజున జలదానం చేయడం చాలా మంచిది. ఈరోజున అవసరమైన వారికి నీటిని ఇవ్వడం వల్ల పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. అభివృద్ధికి ఉన్న ఆటంకాలు, గ్రహాల అశుభ ప్రభావాలు తగ్గుతాయి. (PTI)

గంగా సప్తమి రోజున మహిళలకు కుంకుమ, గోరింటాకు, గాజులు, దుస్తులు, ఆభరణాలు లాంటి అలంకరణ వస్తువులు దానం చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందనే విశ్వాసం ఉంది. అలాగే, చాలా అదృష్టం కలిసి వస్తుంది. 

(6 / 8)

గంగా సప్తమి రోజు సాధారణంగా మండు వేసవిలో వస్తుంది. అందుకే మనుషులకు చలువ చేసేందుకు ఉపయోగపడే పప్పు ధాన్యాల పిండిని అవసరార్థులకు దానం చేయడం శుభప్రదంగా ఉంటుంది. దీనివల్ల వ్యక్తి రాశిచక్రంలో సూర్యుడి స్థానం బలపడుతుందనే నమ్మకం ఉంది. 

(7 / 8)

గంగా సప్తమి రోజున మామిడి పండ్లు, పుచ్చకాయలు లాంటి పండ్లను దానం చేయాలి. దీనివల్ల కోల్పోయిన సంపద, ప్రతిష్ట, సంతోషం తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు