Gaja kesari yogam: నేడు గజకేసరి యోగం.. ఈ రాశుల వారి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది-today jupiter and moon conjunction in meena rashi will create gaja kesari yogam these zodiac signs get wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Jupiter And Moon Conjunction In Meena Rashi Will Create Gaja Kesari Yogam, These Zodiac Signs Get Wealth

Gaja kesari yogam: నేడు గజకేసరి యోగం.. ఈ రాశుల వారి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది

Gunti Soundarya HT Telugu
Mar 13, 2024 10:26 AM IST

Gaja kesari yogam: దేవ గురువు బృహస్పతి, చంద్రుడి కలయిక వల్ల మార్చి 13న గజకేసరి యోగం ఏర్పడింది. ఫలితంగా కొన్ని రాశుల వారి జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

గురు చంద్రుల్ కలయికతో గజకేసరి యోగం
గురు చంద్రుల్ కలయికతో గజకేసరి యోగం

Gaja kesari yogam: జ్యోతిష లెక్కల ప్రకారం గ్రహాలు నిర్ణీత విరామం తర్వాత రాశి చక్రాన్ని మార్చుకుంటాయి. 2024 సంవత్సరంలో దేవగురువు బృహస్పతి మే 1వ తేదీ వరకు మేష రాశిలో సంచరిస్తాడు. మార్చి 13న చంద్రుడు మేష రాశిలో సంచరిస్తాడు. దీని వల్ల గురు, చంద్రుల కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రాజయోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం ప్రభావం వల్ల జీవితంలోని ప్రతి పనిలో అదృష్టం వెన్నంటే ఉంటుంది. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

జాతకంలో గజకేసరి యోగం ఉన్నట్లయితే వారికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఆకస్మికంగా ధన లాభం పొందుతారు. సంపద పెరుగుతుంది. జీవితం శ్రేయస్సుతో నిండిపోతుంది. దీర్ఘాయువు లభిస్తుంది. గజకేసరియోగం ఏ ఏ రాశులకు మేలు చేస్తుందో చూద్దాం.

మేష రాశి

మేష రాశిలోనే గురు చంద్రులు కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ రాశి వారికి మేలు జరుగుతుంది. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. వ్యాపార పరిస్థితిలో మార్పులు చోటు చేసుకుంటాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ వ్యక్తిత్వం చూసి ఇతరులు మిమ్మల్ని ప్రశంసిస్తారు.

మిథునం

గజకేసరి యోగంతో మిథున రాశి వారికి చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. జీవిత భాగస్వామి మీకు అండగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. పని కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి కొనసాగుతున్న వివాదాల నుంచి బయటపడతారు.

సింహ రాశి

గజకేసరి యోగం సింహ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతికి ఆస్కారం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పునః ప్రారంభమవుతాయి. వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. దాంపత్య జీవితం రొమాన్స్‌తో నిండిపోతుంది.

తులా రాశి

ఉద్యోగ, వ్యాపారాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గజకేసరి యోగం ప్రభావంతో ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహకారం మీకు ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. సంపద రెట్టింపు అవుతుంది. ఆస్తి నుంచి ప్రయోజనాలు పొందుతారు.

ధనుస్సు రాశి

శుభకరమైన ఈ యోగం ప్రభావంతో ధనుస్సు రాశి జాతకులు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి.

మకర రాశి

మీ సంపద పెరుగుతుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సౌకర్యంతమైన జీవితాన్ని గడుపుతారు. శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

కుంభ రాశి

వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజు. కుటుంబ సభ్యుల సహకారంతో పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. జీవితంలో సుఖసంతోషాలు సౌభాగ్యాలు ఉంటాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు కలుగుతాయి.