తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Safety Tips | విహారయాత్రలకు వెళ్తున్నారా? ఆరోగ్యంగా తిరిగి రావాలంటే చిట్కాలు..

Safety Tips | విహారయాత్రలకు వెళ్తున్నారా? ఆరోగ్యంగా తిరిగి రావాలంటే చిట్కాలు..

25 May 2022, 16:55 IST

యాత్రలకు వెళ్లేటపుడు ఉత్సాహంగా అనిపిస్తుంది కానీ తిరిగి వచ్చేటపుడు నీరసంగా, చికాకుగా ఉండవచ్చు లేదా ఏదైనా అనారోగ్యం బారిన కూడా పడవచ్చు. ప్రయాణాలు చేసి ఆరోగ్యంగా తిరిగి రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని వైద్యులు అంటున్నారు.

యాత్రలకు వెళ్లేటపుడు ఉత్సాహంగా అనిపిస్తుంది కానీ తిరిగి వచ్చేటపుడు నీరసంగా, చికాకుగా ఉండవచ్చు లేదా ఏదైనా అనారోగ్యం బారిన కూడా పడవచ్చు. ప్రయాణాలు చేసి ఆరోగ్యంగా తిరిగి రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని వైద్యులు అంటున్నారు.

పిల్లలకు వేసవి సెలవులు రావడం, రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో తల్లిదండ్రులకు ఇప్పుడు మళ్లీ పెద్ద టాస్క్ వచ్చి పడింది. అందరూ కలిసి ఆనందంగా విహారయాత్రలకు వెళ్లడమే కాదు, ఆరోగ్యంగా తిరిగి రావాలి. ప్రయాణాలలో ఆరోగ్య సంరక్షణ గురించి చర్చిస్తూ డాక్టర్ మంగేష్ తివాస్కర్ కొన్ని చిట్కాలను అందించారు.
(1 / 6)
పిల్లలకు వేసవి సెలవులు రావడం, రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో తల్లిదండ్రులకు ఇప్పుడు మళ్లీ పెద్ద టాస్క్ వచ్చి పడింది. అందరూ కలిసి ఆనందంగా విహారయాత్రలకు వెళ్లడమే కాదు, ఆరోగ్యంగా తిరిగి రావాలి. ప్రయాణాలలో ఆరోగ్య సంరక్షణ గురించి చర్చిస్తూ డాక్టర్ మంగేష్ తివాస్కర్ కొన్ని చిట్కాలను అందించారు.(Photo by Mika Baumeister on Unsplash)
మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లాలనిర్ణయించుకున్నపుడు ముందుగా అక్కడ కోవిడి పరిస్థితిని తెలుసుకోండి. ఆ ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్ రేటు ఎంత ఉంది అనేది ముఖ్యం. మీరు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువ ఉన్న చోటుకు వెళ్తే మీరు కూడా ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదం ఉందని గ్రహించాలి.
(2 / 6)
మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లాలనిర్ణయించుకున్నపుడు ముందుగా అక్కడ కోవిడి పరిస్థితిని తెలుసుకోండి. ఆ ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్ రేటు ఎంత ఉంది అనేది ముఖ్యం. మీరు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువ ఉన్న చోటుకు వెళ్తే మీరు కూడా ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదం ఉందని గ్రహించాలి.(Image by Mohamed Hassan from Pixabay )
మీ బ్యాగ్‌లో భాగంగా రాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ కిట్‌ని కూడా తీసుకెళ్లండి. 'సేఫ్టీ ఫస్ట్' అనే మంత్రాన్ని పాటించాలి. Panbio Covid-19 యాంటిజెన్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్‌లు ఫార్మసీలో అందుబాటులో ఉంటాయి. ఇవి 15 నిమిషాల్లో ఫలితాన్ని అందిస్తాయి. మీకు అనుమానం కలిగితే వెంటనే టెస్టింగ్ చేసుకొని చికిత్స తీసుకోవడం మీకూ, మీ పిల్లలకు మంచిది.
(3 / 6)
మీ బ్యాగ్‌లో భాగంగా రాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ కిట్‌ని కూడా తీసుకెళ్లండి. 'సేఫ్టీ ఫస్ట్' అనే మంత్రాన్ని పాటించాలి. Panbio Covid-19 యాంటిజెన్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్‌లు ఫార్మసీలో అందుబాటులో ఉంటాయి. ఇవి 15 నిమిషాల్లో ఫలితాన్ని అందిస్తాయి. మీకు అనుమానం కలిగితే వెంటనే టెస్టింగ్ చేసుకొని చికిత్స తీసుకోవడం మీకూ, మీ పిల్లలకు మంచిది.(Photo by Cedrik Wesche on Unsplash)
కిక్కిరిసిన ప్రదేశాలకు వెళ్లడం, ఇండోర్ లలోనే ఉండిపోవడం నివారించండి. కరోకే కేఫ్‌ల నుంచి ఇండోర్ రైడ్‌లతో కూడిన థీమ్ పార్క్‌ల వరకు మీకు ఇష్టమైనవి చాలా ఉండవచ్చు. సాధ్యమైనంతవరకు స్వచ్ఛమైన గాలి వీచే ప్రాంతాల్లో ఉండటం ఉత్తమం.
(4 / 6)
కిక్కిరిసిన ప్రదేశాలకు వెళ్లడం, ఇండోర్ లలోనే ఉండిపోవడం నివారించండి. కరోకే కేఫ్‌ల నుంచి ఇండోర్ రైడ్‌లతో కూడిన థీమ్ పార్క్‌ల వరకు మీకు ఇష్టమైనవి చాలా ఉండవచ్చు. సాధ్యమైనంతవరకు స్వచ్ఛమైన గాలి వీచే ప్రాంతాల్లో ఉండటం ఉత్తమం.(Image by Tasos Lekkas from Pixabay )
బిజీబిజీగా గడపకండి. మనం వెళ్లినది విహారయాత్రకే అయినా విరామం, విశ్రాంతి కూడా అవసరమే అని గుర్తుంచుకోవాలి. తగినంత విశ్రాంతి ఉంటేనే ఒత్తిడి లేకుండా సెలవులను ఆస్వాదించగలుగుతారు.
(5 / 6)
బిజీబిజీగా గడపకండి. మనం వెళ్లినది విహారయాత్రకే అయినా విరామం, విశ్రాంతి కూడా అవసరమే అని గుర్తుంచుకోవాలి. తగినంత విశ్రాంతి ఉంటేనే ఒత్తిడి లేకుండా సెలవులను ఆస్వాదించగలుగుతారు.(Photo by Jonathan Forage on Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి