Travel Skincare Tips | ఈ టిప్స్ ఫాలో అయితే ప్రయాణాల్లో అలిసిపోరు.. మెరిసిపోతారు!-take care of your skin while travelling tips to follow ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Travel Skincare Tips | ఈ టిప్స్ ఫాలో అయితే ప్రయాణాల్లో అలిసిపోరు.. మెరిసిపోతారు!

Travel Skincare Tips | ఈ టిప్స్ ఫాలో అయితే ప్రయాణాల్లో అలిసిపోరు.. మెరిసిపోతారు!

May 24, 2022, 10:21 PM IST HT Telugu Desk
May 24, 2022, 10:21 PM , IST

  • ప్రయాణాలు చేస్తున్నపుడు చర్మ సంరక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. నిర్లక్ష్యం చేస్తే ముఖంపై మొటిమలు,పగుళ్లు, పొక్కులు లేదా టాన్ లైన్‌లు ఏర్పడతాయి. కళా విహీనంగా మారిపోతుంది. కాబట్టి ట్రావెలింగ్ చేసేవారికి డెర్మటాలజిస్టులు చిట్కాలను అందిస్తున్నారు. అవి ఇక్కడ తెలుసుకోండి..

కోవిడ్ ఆంక్షలు తొలగించిన తర్వాత ప్రయాణాలు ఊపందుకున్నాయి. చాలామంది దేశవిదేశాలకు యాత్రలు చేస్తూ సెలవు రోజులను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో చర్మ సంరక్షణను మర్చిపోతే రూపం మారిపోతుందని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. 'ది ఎస్తెటిక్ క్లినిక్స్' లో కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్, డెర్మాటో-సర్జన్ అయిన డాక్టర్ రింకీ కపూర్ కొన్ని చిట్కాలను అందించారు. ప్రయాణాలు చేసేటపుడు వాటిని పాటించాలని సూచించారు.

(1 / 10)

కోవిడ్ ఆంక్షలు తొలగించిన తర్వాత ప్రయాణాలు ఊపందుకున్నాయి. చాలామంది దేశవిదేశాలకు యాత్రలు చేస్తూ సెలవు రోజులను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో చర్మ సంరక్షణను మర్చిపోతే రూపం మారిపోతుందని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. 'ది ఎస్తెటిక్ క్లినిక్స్' లో కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్, డెర్మాటో-సర్జన్ అయిన డాక్టర్ రింకీ కపూర్ కొన్ని చిట్కాలను అందించారు. ప్రయాణాలు చేసేటపుడు వాటిని పాటించాలని సూచించారు.(Pixabay)

ప్రత్యేకమైన ప్రయాణాలు కాకుండా ఎప్పుడూ చేసే ప్రయాణాలు చేస్తుంటే మీరు మామూలు సంరక్షణ తీసుకుంటే సరిపోతుంది. బయటకు వెళ్లేటపుడు ఎలా అయితే రెడీ అవుతారో అదే రొటీన్ ఫాలో అవ్వొచ్చు. ఎండకు రక్షణగా సన్ స్క్రీన్ క్రీమ్ లోషన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది.

(2 / 10)

ప్రత్యేకమైన ప్రయాణాలు కాకుండా ఎప్పుడూ చేసే ప్రయాణాలు చేస్తుంటే మీరు మామూలు సంరక్షణ తీసుకుంటే సరిపోతుంది. బయటకు వెళ్లేటపుడు ఎలా అయితే రెడీ అవుతారో అదే రొటీన్ ఫాలో అవ్వొచ్చు. ఎండకు రక్షణగా సన్ స్క్రీన్ క్రీమ్ లోషన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది.(Pixabay)

ప్రత్యేక ప్రయాణాలు చేసేటపుడు ఇంట్లో ఉండే అన్ని ఉత్పత్తులు తీసుకెళ్లాల్సిన పనిలేకపోయినా క్లెన్సర్, టోనర్, డే అండ్ నైట్ మాయిశ్చరైజర్, SPF తీసుకెళ్లాలి. చర్మ సంబంధ ఔషధాలు ఏవైనా వాడుతుంటే వాటిని మరిచిపోవద్దు.

(3 / 10)

ప్రత్యేక ప్రయాణాలు చేసేటపుడు ఇంట్లో ఉండే అన్ని ఉత్పత్తులు తీసుకెళ్లాల్సిన పనిలేకపోయినా క్లెన్సర్, టోనర్, డే అండ్ నైట్ మాయిశ్చరైజర్, SPF తీసుకెళ్లాలి. చర్మ సంబంధ ఔషధాలు ఏవైనా వాడుతుంటే వాటిని మరిచిపోవద్దు.(Pexels)

హోటల్ బుక్ చేసుకున్నపుడు అక్కడే ఇచ్చే వాటిపై ఆధారపడవద్దు. ఎందుకంటే హోటల్ ఇచ్చే ఉత్పత్తులు చాలా ఎక్కువ నాణ్యతతో ఉంటాయి. అందరి చర్మ రకానికి అవి సరిపోవు. మీకు సున్నితమైన చర్మం ఉన్నట్లయితే కొత్త ఉత్పత్తులను ప్రయత్నించడం మంచిది కాదు.

(4 / 10)

హోటల్ బుక్ చేసుకున్నపుడు అక్కడే ఇచ్చే వాటిపై ఆధారపడవద్దు. ఎందుకంటే హోటల్ ఇచ్చే ఉత్పత్తులు చాలా ఎక్కువ నాణ్యతతో ఉంటాయి. అందరి చర్మ రకానికి అవి సరిపోవు. మీకు సున్నితమైన చర్మం ఉన్నట్లయితే కొత్త ఉత్పత్తులను ప్రయత్నించడం మంచిది కాదు.(Pexels)

ప్రయాణాల్లో ఉన్నపుడు ఫేషియల్ మాయిశ్చరైజర్ ఉపయోగించండి. ప్రయాణం సుదీర్ఘంగా ఉంటే, హైడ్రేటింగ్ షీట్ మాస్క్‌లను ధరించడం మంచిది. హైలురోనిక్ యాసిడ్ ఇంకా విటమిన్ సి గుణాలు కలిగిన హైడ్రేటింగ్ పదార్థాలను ఉపయోగించండి.

(5 / 10)

ప్రయాణాల్లో ఉన్నపుడు ఫేషియల్ మాయిశ్చరైజర్ ఉపయోగించండి. ప్రయాణం సుదీర్ఘంగా ఉంటే, హైడ్రేటింగ్ షీట్ మాస్క్‌లను ధరించడం మంచిది. హైలురోనిక్ యాసిడ్ ఇంకా విటమిన్ సి గుణాలు కలిగిన హైడ్రేటింగ్ పదార్థాలను ఉపయోగించండి.(Pexels)

ప్రయాణంలో చర్మం మురికి, కాలుష్యం, మలినాలకు గురవుతుంది. అందువల్ల చర్మాన్ని శుభ్రపరచడం, టోనింగ్ చేస్తూ ఉండాలి. మీ ట్రావెల్ బ్యాగ్‌లో హైడ్రేటింగ్ మిస్ట్ టోనర్ తీసుకెళ్లడం తప్పనిసరి.

(6 / 10)

ప్రయాణంలో చర్మం మురికి, కాలుష్యం, మలినాలకు గురవుతుంది. అందువల్ల చర్మాన్ని శుభ్రపరచడం, టోనింగ్ చేస్తూ ఉండాలి. మీ ట్రావెల్ బ్యాగ్‌లో హైడ్రేటింగ్ మిస్ట్ టోనర్ తీసుకెళ్లడం తప్పనిసరి.(Pixabay)

శుభ్రమైన డిస్పోజబుల్ ఫేస్ మాస్క్‌లను వాడండి. సమూహంలో తిరిగినపుడు వాడినవే మళ్లీ వాడకుండా ప్రతి 4 గంటలకు వాటిని మార్చండి. మీ ముఖాన్ని తరచుగా కడుక్కోండి, మాయిశ్చరైజ్ చేయండి.

(7 / 10)

శుభ్రమైన డిస్పోజబుల్ ఫేస్ మాస్క్‌లను వాడండి. సమూహంలో తిరిగినపుడు వాడినవే మళ్లీ వాడకుండా ప్రతి 4 గంటలకు వాటిని మార్చండి. మీ ముఖాన్ని తరచుగా కడుక్కోండి, మాయిశ్చరైజ్ చేయండి.(Pixabay)

అక్కడాఇక్కడా ప్రదేశాలను తాకుతూ మళ్లీ అవే చేతులతో మీ ముఖాన్ని తాకకండి. అలా చేస్తే మురికి, క్రిములు మీ ముఖానికి అంటిచుకున్నట్లే. ముఖ్యంగా చిన్నపిల్లలను అస్సలు ముట్టుకోకండి. చేతులు బాగా శుభ్రంచేసుకున్నాకే తాకండి.

(8 / 10)

అక్కడాఇక్కడా ప్రదేశాలను తాకుతూ మళ్లీ అవే చేతులతో మీ ముఖాన్ని తాకకండి. అలా చేస్తే మురికి, క్రిములు మీ ముఖానికి అంటిచుకున్నట్లే. ముఖ్యంగా చిన్నపిల్లలను అస్సలు ముట్టుకోకండి. చేతులు బాగా శుభ్రంచేసుకున్నాకే తాకండి.(Pexels)

SPF (Sun Protection Factor ) మీ బెస్ట్ ఫ్రెండ్. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా సన్‌స్క్రీన్‌ని అప్లై చేసుకోవాలి. విమానంలో కూడా మీకు ఇది అవసరం. 30+++ కంటే ఎక్కువ ఉన్న SPFని ఉపయోగించండి. ప్రతి 3-4 గంటలకు అప్లై చేసుకుంటూ ఉండాలి.

(9 / 10)

SPF (Sun Protection Factor ) మీ బెస్ట్ ఫ్రెండ్. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా సన్‌స్క్రీన్‌ని అప్లై చేసుకోవాలి. విమానంలో కూడా మీకు ఇది అవసరం. 30+++ కంటే ఎక్కువ ఉన్న SPFని ఉపయోగించండి. ప్రతి 3-4 గంటలకు అప్లై చేసుకుంటూ ఉండాలి.(Pexels)

సంబంధిత కథనం

10. Paris: పారిస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఒక ప్రేమ నగరం. ఏళ్లుగా నిల్వచేసిన వైన్, తాజా జున్ను రుచులను ఆస్వాదించాలంటే ఫ్రాన్స్ ది బెస్ట్.సమ్మర్ ఫ్యాషన్Summer Vacationsదుబాయ్‌ వెళ్లి వచ్చిన వారికి అక్కడి అద్దాల మేడలు, లగ్జరీ హోటళ్ల గురించి బాగా తెలుసు. అదొక కాస్ట్‌లీ సిటీ. అయితే అక్కడ తక్కువ బడ్జెట్‌తో ఎంజాయ్‌ చేసేవి కూడా ఉన్నాయి. అలాంటివే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.Summer Holiday Destinationsఈవెంట్ మేనేజ్మెంట్ గణాంకాల ప్రకారం ఏప్రిల్-జూలై మధ్య కాలంలో భారతదేశవ్యాప్తంగా దాదాపు 40 లక్షల వివాహాలు జరగనున్నట్లు అంచనా. అయితే మరి ఇంత మంది ఉన్నప్పుడు వివాహానికి సిద్ధమవుతున్న వారు వారి వివాహ వేదికకు సంబంధించి ముందస్తు ప్లాన్ వేసుకోవడం ఎంతైనా మంచిది. మీరు చల్లని ప్రదేశాల్లో వివాహం చేసుకోవాలనుకుంటే ఈ ప్రదేశాల్లో చేసుకోండి. మీకు జీవితాంతం గుర్తిండిపోతుంది.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు