తెలుగు న్యూస్  /  ఫోటో  /  Covid Xe Variant | ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ లక్షణాలివే.. మీకు తెలుసా?

Covid XE Variant | ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ లక్షణాలివే.. మీకు తెలుసా?

07 April 2022, 12:30 IST

భారత్​లో ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ ప్రవేశించింది. కరోనాకు చెందిన అన్ని వేరియంట్​లలో.. ఎక్స్​ఈ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  వెల్లడించింది. మరి దీని లక్షణాలు, దీనిపై వ్యాక్సిన్ ప్రభావం వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • భారత్​లో ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ ప్రవేశించింది. కరోనాకు చెందిన అన్ని వేరియంట్​లలో.. ఎక్స్​ఈ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  వెల్లడించింది. మరి దీని లక్షణాలు, దీనిపై వ్యాక్సిన్ ప్రభావం వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా భారతదేశంలోని మహారాష్ట్రలో ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ కేసును గుర్తించారు. దక్షిణాఫ్రికాకు చెందిన 50 ఏళ్ల మహిళగా గుర్తించారు. ఫిబ్రవరి 10వ తేదీన ఆమె భారత్​కు వచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
(1 / 9)
తాజాగా భారతదేశంలోని మహారాష్ట్రలో ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ కేసును గుర్తించారు. దక్షిణాఫ్రికాకు చెందిన 50 ఏళ్ల మహిళగా గుర్తించారు. ఫిబ్రవరి 10వ తేదీన ఆమె భారత్​కు వచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. (AFP)
ఫిబ్రవరి 27వ తేదీన ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆమె ల్యాబ్ శాంపిల్​ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం కస్తూర్బా హాస్పిటల్ సెంట్రల్ లాబొరేటరీకి రెఫర్ చేశారు.
(2 / 9)
ఫిబ్రవరి 27వ తేదీన ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆమె ల్యాబ్ శాంపిల్​ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం కస్తూర్బా హాస్పిటల్ సెంట్రల్ లాబొరేటరీకి రెఫర్ చేశారు.(Representative Image)
" కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్​ఈ అనేది ఓమిక్రాన్​కు చెందిన బీఏ.1, బీఏ.2 జాతుల కలయిక" అని ఆరోగ్య శాఖ తెలిపింది.
(3 / 9)
" కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్​ఈ అనేది ఓమిక్రాన్​కు చెందిన బీఏ.1, బీఏ.2 జాతుల కలయిక" అని ఆరోగ్య శాఖ తెలిపింది.(Representative Image)
"వైరస్‌ల సహజ జీవన గమనంలో భాగంగా.. జెనోమిక్ స్ట్రక్చర్‌లో తరచు మార్పులు జరగుతాయి. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి" అని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 
(4 / 9)
"వైరస్‌ల సహజ జీవన గమనంలో భాగంగా.. జెనోమిక్ స్ట్రక్చర్‌లో తరచు మార్పులు జరగుతాయి. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి" అని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. (AFP)
ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్​ను జనవరి 19వ తేదీన మొదటిసారి యూకేలో కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
(5 / 9)
ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్​ను జనవరి 19వ తేదీన మొదటిసారి యూకేలో కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.(AFP)
మునపటి కరోనా వైరస్ జాతులకంటే.. ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్.. ఎక్కువగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. 
(6 / 9)
మునపటి కరోనా వైరస్ జాతులకంటే.. ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్.. ఎక్కువగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. (AFP)
జ్వరం, గొంతునొప్పి, దగ్గు, జలుబు, చర్మం చికాకు, రంగు మారడం, జీర్ణకోశ బాధ మొదలైనవి ఈ వేరియంట్ లక్షణాలుగా తెలిపారు. 
(7 / 9)
జ్వరం, గొంతునొప్పి, దగ్గు, జలుబు, చర్మం చికాకు, రంగు మారడం, జీర్ణకోశ బాధ మొదలైనవి ఈ వేరియంట్ లక్షణాలుగా తెలిపారు. (AFP)
వేరియంట్ తీవ్రత, దానిపై టీకా ప్రభావం గురించి త్వరలోనే వెల్లడిస్తామని ఆరోగ్య శాఖ తెలిపింది. 
(8 / 9)
వేరియంట్ తీవ్రత, దానిపై టీకా ప్రభావం గురించి త్వరలోనే వెల్లడిస్తామని ఆరోగ్య శాఖ తెలిపింది. (AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి