తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maharashtra Wine Policy | 'వైన్​ అంటే మద్యం కాదు.. రైతుల కోసమే ఆ నిర్ణయం'

Maharashtra wine policy | 'వైన్​ అంటే మద్యం కాదు.. రైతుల కోసమే ఆ నిర్ణయం'

HT Telugu Desk HT Telugu

28 January 2022, 16:40 IST

google News
    • Sanjay Raut news today | సూపర్​మార్కెట్లలో వైన్​ విక్రయానికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన శివసేన నేత సంజయ్​ రౌత్​.. ‘వైన్​ అంటే మద్యం కాదు.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాము,’ అని వివరించారు.
వైన్​ అంటే మద్యం కాదు: సంజయ్​ రౌత్​
వైన్​ అంటే మద్యం కాదు: సంజయ్​ రౌత్​ (PTI)

వైన్​ అంటే మద్యం కాదు: సంజయ్​ రౌత్​

 Maharashtra wine news | సూపర్​మార్కెట్లలో వైన్​ను విక్రయించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని శివసేన అగ్రనేత సంజయ్​ రౌత్​ సమర్థించారు. వైన్​ అంటే మద్యం కాదని, ఈ విషయంపై విపక్షాలు అనవసరమైన హడావుడి చేస్తున్నాయని మండిపడ్డారు. మహారాష్ట్రను 'మద్యం'రాష్ట్రగా మారనివ్వమని బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్​ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సంజయ్​ రౌత్​ ఈ విధంగా స్పందించారు.

"వైన్​ అంటే మద్యం కాదు. రాష్ట్రంలో వైన్​ అమ్మకాలు పెరిగితే.. రైతులకే లాభం. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము. ప్రతి విషయాన్ని అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఆ పార్టీకి రైతుల సంక్షేమం అనవసరం," అని సంజయ్​ రౌత్​ అన్నారు.

కేబినెట్​ ఆమోదంతో..

సూపర్​మార్కెట్లు, వాక్​-ఇన్​ స్టోర్​లలో వైన్​ను విక్రయించే ప్రతిపాదనకు మహారాష్ట్ర కేబినెట్​ గురువారం ఆమోద ముద్ర వేసింది. రూ. 5వేల వార్షిక లెసెన్స్​ రుసుముతో ఆయా దుకాణాలకు అనుమతులు మంజూరు చేసింది. వైన్​ ప్రియులకు సులభంగా అందుబాటులో ఉండేందుకు, పరిశ్రమ మెరుగుపడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 

ఇదే విషయంపై దేవంద్ర ఫడణవీస్​ మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రజల సమస్యల కన్నా వైన్​ వ్యవహారమే ముఖ్యమని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రను 'మద్య'రాష్ట్రగా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, తాము కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.

తదుపరి వ్యాసం