తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid | ఆ కరోనా​ రోగులకు రూ. కోటి రీఫండ్​..

Covid | ఆ కరోనా​ రోగులకు రూ. కోటి రీఫండ్​..

HT Telugu Desk HT Telugu

03 April 2022, 18:30 IST

google News
    • కొవిడ్​ పేరుతో అనేక ప్రైవేటు ఆసుపత్రులు.. ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచేశాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కన్నా ఎన్నో రెట్లు ఎక్కవగా బిల్లులు చూపించాయి. తాజాగా ఈ వ్యవహారంపై మహారాష్ట్ర పుణెలోని అధికారులు స్పందించారు. తమ ప్రాంతంలో అధికంగా వసూలు చేసిన ఆసుపత్రుల నుంచి రూ. కోటి సేకరించి.. దాదాపు 140 మంది కొవిడ్​ రోగులకు రీఫండ్​ చేశారు.
కొవిడ్​ రోగులకు రూ. కోటి రీఫండ్​
కొవిడ్​ రోగులకు రూ. కోటి రీఫండ్​ (HT)

కొవిడ్​ రోగులకు రూ. కోటి రీఫండ్​

Covid patients refund | కొవిడ్​ పేరుతో దేశవ్యాప్తంగా అనేక ప్రైవేటు ఆసుపత్రులు.. రోగులను దోచుకున్నాయి. కష్టకాలంలో అధిక ఫీజులతో తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. మహారాష్ట్ర పుణెలో సైతం ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా.. ఆయా కంపెనీలపై పుణె స్థానిక యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. అధికంగా వసూలు చేసిన డబ్బులను సేకరించి.. రోగులకు రీఫండ్​ చేసింది. మొత్తం మీద ఇప్పటివరకు 142మందికి రూ. 1కోటిని రీఫండ్​ చేయగలిగింది.

కొవిడ్​ చికిత్స కోసం వెళితే.. ఆసుపత్రులు తమని దోచుకుంటున్నాయని రోగులు, వారి కుటుంబాలు అధికారులకు విన్నవించుకున్నాయి. అప్రమత్తమైన యంత్రాంగం.. ఆయా ఆసుపత్రులకు నోటీసుల జారీ చేసింది. కొవిడ్​ చికిత్సకు సంబంధించిన బిల్లులను సైతం ఆడిటింగ్​ చేయించింది. కొన్నింట్లో అవకతవకలు కనిపించాయని పీఎంసీ(పూణె మున్సిపల్​ కార్పొరేషన్​) అధికారులు వెల్లడించారు.

Pune covid news | "మార్చ్​ 28 వరకు.. 142మంది రోగులకు కోటి రూపాయలను రీఫండ్​ చేయగలిగాము. కొవిడ్​ రెండో దశ నుంచి పరిస్థితులను మేము సమీక్షిస్తున్నాము. ప్రైవేటు ఆసుపత్రులకు ఇదే విషయంపై నోటీసులు కూడా పంపించాము. పరిస్థితుల్లో మార్పులేనందును షోకాజ్​ నోటీసులు కూడా జారీ చేశాము. స్పందించకపోతే ఆరు నెలల పాటు ఆసుపత్రి లైసెన్స్​ను సీజ్​ చేస్తామని చెప్పాము," అని ఓ అధికారి పేర్కొన్నారు.

పుణెలోని 20 ఆసుప్రతులు.. ప్రజల నుంచి అధికంగా దోచుకుంటున్నట్టు తేలింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను పక్కనపెట్టి.. వాటి ఇష్టానుసారంగా ప్రజల నుంచి డబ్బులు పోగుచేసుకున్నాయి. ఇలా కొన్ని ఆసుపత్రులు.. బిల్లులను ఏకంగా రూ. 5.9కోట్లుగా చూపించాయి. వాస్తవానికి అవి రూ. 4.95కోట్లుగా ఉండాలి. అందువల్ల ఆ కోటి రూపాయలను.. కొవిడ్​ రోగులకు రీఫండ్​ చేశారు అధికారులు.

టాపిక్

తదుపరి వ్యాసం