COVID-19 Vaccine: విదేశాలకు వెళ్లేవారికి బూస్టర్ డోస్.. !
27 March 2022, 6:34 IST
- కొవిడ్ 19 బూస్టర్ డోస్ పై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. విద్య, ఉద్యోగం, క్రీడలు, అధికారిక క పర్యటనలకు వెళ్లే వారికి వెళ్లేవారికి బూస్టర్ డోసును ఇవ్వాలని చూస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
విదేశాలకు వెళ్లేవారికి టీకా బూస్టర్ డోసు
కొవిడ్ బూస్టర్ డోసు పరిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు విద్య, ఉద్యోగాలు, వ్యాపారం ఇతర కారణాలతో విదేశాలకు వెళ్లే వారికి అతి త్వరలోనే ముందస్తు టీకా పంపిణీని ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి.
కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉండటంతో ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు బూస్టర్ డోసును తప్పనిసరి చేస్తూ ఆంక్షలు విధించాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఈ దిశగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైందని ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
దేశంలో 60 ఏళ్లు దాటిన వారితోపాటు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఇప్పటికే బూస్టర్ డోసు ఇస్తున్నారు. ప్రస్తుత మార్గదర్శకాల మేరకు రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలి. కానీ పలు దేశాలు నిబంధనలను అమల్లోకి తీసుకువస్తున్న పరిస్థితుల్లో కేంద్రం విదేశాలకు వెళ్లే వరకు త్వరగా బూస్టర్ డోసులను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.