XE variant | భారత్​లోకి ప్రవేశించిన కొత్త వేరియంట్​.. కేసులు మళ్లీ పెరుగుతాయా?-xe variant in india first case traced in mumbai ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Xe Variant | భారత్​లోకి ప్రవేశించిన కొత్త వేరియంట్​.. కేసులు మళ్లీ పెరుగుతాయా?

XE variant | భారత్​లోకి ప్రవేశించిన కొత్త వేరియంట్​.. కేసులు మళ్లీ పెరుగుతాయా?

HT Telugu Desk HT Telugu
Apr 06, 2022 05:56 PM IST

బ్రిటన్​లో కరోనా కొత్త వేరియంట్​ XE ని ఇటీవలే కనుగొన్నారు. తాజాగా.. ముంబైలో ఎక్స్​ఈ వేరియంట్​కు సంబంధించి ఒక కేసు నమోదైంది.

<p>కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు</p>
కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు (HT/file)

XE variant in india | దేశంలోకి కొత్త కొవిడ్​ వేరియంట్​ XE ప్రవేశించింది. మహారాష్ట్రలోని ముంబైలో బుధవారం ఎక్స్​ఈ వేరియంట్​కు సంబంధించిన తొలి కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సేకరించిన 376 నమూనాల్లో.. ఒకరికి ఎక్స్​ఈ వేరియంట్​ సోకినట్టు నిర్ధరణ అయ్యింది.

ఈ 376మందిలో 230మంది ముంబైకి చెందినవారే ఉన్నారు. వారిలో 228మందికి ఒమిక్రాన్​ సోకినట్టు తేలిసింది. కాగా.. ఒకరికి కప్పా వేరియంట్​, మరొకరికి ఎక్స్​ఈ వేరియంట్​ సోకినట్టు పరీక్షల్లో నిర్ధరణ అయ్యింది. అయితే ఎక్స్​ఈ వేరియంట్​ సోకిన వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నట్టు.. ఎలాంటి తీవ్ర లక్షణాలు లేవని బృహన్​ముంబై మున్సిపల్​ కార్పొరేషన్​ వెల్లడించింది.

ఈ 230మందిలో 21మంది ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో 12మంది టీకా తీసుకోలేదు, మరో తొమ్మిది మందికి రెండు డోసులు తీసుకున్నా వైరస్​ సోకింది.

ప్రమాదరకమా?

XE variant covid | కాగా.. ఈ ఎక్స్​ఈ వేరియంట్​ను బ్రిటన్​లో ఇటీవలే ట్రేస్​ చేశారు. ఒమిక్రాన్​లోని రెండు ఉప వేరియంట్​లు బీఏ1. బీఏ2ల కలయికతో ఈ వేరియంట్​ ఉద్భవించిందని అక్కడి వైద్యులు వెల్లడించారు. ఇది ఒమిక్రాన్​ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్