తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Relationship | ఒకరితో రిలేషన్‌లో ఉన్నపుడు ఈ తప్పులు చేయొద్దు!

Relationship | ఒకరితో రిలేషన్‌లో ఉన్నపుడు ఈ తప్పులు చేయొద్దు!

05 April 2022, 19:59 IST

కొన్నిసార్లు బంధం తెగిపోయే సందర్భంలో వ్యక్తులు ఆ సంబంధాన్ని బలోపేతం చేయడానికి బదులుగా హాని కలిగించే పనులను తెలియకుండానే చేస్తారు. సంబంధ, బాంధవ్యాల గురించి మానసిక నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకోండి.

  • కొన్నిసార్లు బంధం తెగిపోయే సందర్భంలో వ్యక్తులు ఆ సంబంధాన్ని బలోపేతం చేయడానికి బదులుగా హాని కలిగించే పనులను తెలియకుండానే చేస్తారు. సంబంధ, బాంధవ్యాల గురించి మానసిక నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకోండి.
మీ బంధాన్ని తేలికగా తీసుకోవద్దు. చాలా కాలం పాటు అలగటం, మాట్లాడకపోవడం చేస్తే బంధం బలహీనపడుతుంది. మీ భాగస్వామిపై ఆవాస్తవమైన ధోరణిని కలిగి ఉండటం, వారిని గౌరవించకపోవడం ఇలా వరుస తప్పులు చేస్తూ చివరికి పశ్చాత్తాపపడినా కొన్నిసార్లు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని మానసిక వైద్యురాలు సారా కుబురిక్ తెలిపారు.
(1 / 8)
మీ బంధాన్ని తేలికగా తీసుకోవద్దు. చాలా కాలం పాటు అలగటం, మాట్లాడకపోవడం చేస్తే బంధం బలహీనపడుతుంది. మీ భాగస్వామిపై ఆవాస్తవమైన ధోరణిని కలిగి ఉండటం, వారిని గౌరవించకపోవడం ఇలా వరుస తప్పులు చేస్తూ చివరికి పశ్చాత్తాపపడినా కొన్నిసార్లు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని మానసిక వైద్యురాలు సారా కుబురిక్ తెలిపారు.(Pixabay)
అవతలి వ్యక్తి ఏమనుకుంటున్నారో, ఎలా ఆలోచిస్తున్నారనే అనే దానిపై ఊహాజనితంగా మాట్లాడుతూ తగవులు పెట్టుకోవడం లేదా దూరం పెట్టడం అపార్థాలకు దారితీస్తుంది.
(2 / 8)
అవతలి వ్యక్తి ఏమనుకుంటున్నారో, ఎలా ఆలోచిస్తున్నారనే అనే దానిపై ఊహాజనితంగా మాట్లాడుతూ తగవులు పెట్టుకోవడం లేదా దూరం పెట్టడం అపార్థాలకు దారితీస్తుంది.(Pixabay)
ఆలుమగల మధ్య శృంగారం వారిని మరింత దగ్గర చేస్తుంది. చాలాకాలం పాటు మీ భాగస్వామిని దూరం పెడితే వారు మీతో మానసిక బంధం తెంచుకొని మరొకరి వైపు చూసే ప్రమాదం ఉంటుంది.
(3 / 8)
ఆలుమగల మధ్య శృంగారం వారిని మరింత దగ్గర చేస్తుంది. చాలాకాలం పాటు మీ భాగస్వామిని దూరం పెడితే వారు మీతో మానసిక బంధం తెంచుకొని మరొకరి వైపు చూసే ప్రమాదం ఉంటుంది.(Pixabay)
ఇద్దరి మధ్య స్నేహబంధం అల్లుకున్నప్పుడే వారి మధ్య ప్రేమ వికసిస్తుంది.
(4 / 8)
ఇద్దరి మధ్య స్నేహబంధం అల్లుకున్నప్పుడే వారి మధ్య ప్రేమ వికసిస్తుంది.(Unsplash)
తరచూ గొడవలు ఇద్దరి మధ్య అఘాథాన్ని సృష్టిస్తాయి. సర్దుకుపోయే గుణం ఉండాలి. ఇద్దరిలో ఒక్కరికైనా ఓర్పు, సహనం ఉండాలి.
(5 / 8)
తరచూ గొడవలు ఇద్దరి మధ్య అఘాథాన్ని సృష్టిస్తాయి. సర్దుకుపోయే గుణం ఉండాలి. ఇద్దరిలో ఒక్కరికైనా ఓర్పు, సహనం ఉండాలి.(Pixabay)
చెప్పకున్నా అర్థం చేసుకోవాలి అని ఒకరు అనుకుంటే ఎదుటి వ్యక్తికి ఆ సామర్థ్యం ఉండకపోవచ్చు. ఇలాంటివి ఇద్దరి మధ్య అపార్థాలకు దారితీస్తాయి.
(6 / 8)
చెప్పకున్నా అర్థం చేసుకోవాలి అని ఒకరు అనుకుంటే ఎదుటి వ్యక్తికి ఆ సామర్థ్యం ఉండకపోవచ్చు. ఇలాంటివి ఇద్దరి మధ్య అపార్థాలకు దారితీస్తాయి.(Pixabay)
నమ్మకం, నిజాయితీలే ఎలాంటి బంధానికైనా బలమైన పునాదులుగా నిలుస్తాయి. పక్కచూపులతో బంధం పక్కదారిపడుతుంది.
(7 / 8)
నమ్మకం, నిజాయితీలే ఎలాంటి బంధానికైనా బలమైన పునాదులుగా నిలుస్తాయి. పక్కచూపులతో బంధం పక్కదారిపడుతుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి