తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Instagram Tricks, Share Your Stories Only To Close Friends List, Here Is How

Instagram Tricks । ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ట్రిక్స్ తెలుసా? మీ ప్రైవసీని ఇలా కాపాడుకోండి!

23 October 2022, 13:05 IST

Instagram Tricks: మీరు ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అయి ఉండి, మీ ఫోటోలను, వీడియోలను అందరితో పంచుకోవటం గురించి అసౌకర్యంగా ఫీలవుతున్నారా? అయితే మీకు నచ్చిన కొందరితో మాత్రమే పంచుకునే ఫీచర్లు కూడా ఉన్నాయి. అదెలాగో చూడండి.

Instagram Tricks: మీరు ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అయి ఉండి, మీ ఫోటోలను, వీడియోలను అందరితో పంచుకోవటం గురించి అసౌకర్యంగా ఫీలవుతున్నారా? అయితే మీకు నచ్చిన కొందరితో మాత్రమే పంచుకునే ఫీచర్లు కూడా ఉన్నాయి. అదెలాగో చూడండి.
ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు తమ క్లోజ్ ఫ్రెండ్స్ కు కనిపించేలా మాత్రమే తమ స్టోరీలు, ఫోటోలను, వీడియోలను షేర్ చేయవచ్చు. క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్‌ ఎలా చేయాలి? ఎలా కొందరికి మాత్రమే మీ కంటెంట్ షేర్ చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
(1 / 6)
ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు తమ క్లోజ్ ఫ్రెండ్స్ కు కనిపించేలా మాత్రమే తమ స్టోరీలు, ఫోటోలను, వీడియోలను షేర్ చేయవచ్చు. క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్‌ ఎలా చేయాలి? ఎలా కొందరికి మాత్రమే మీ కంటెంట్ షేర్ చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి.(Pixabay)
క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్‌ను సిద్ధం చేసుకోవడం ద్వారా, ప్రత్యేకంగా  ఆ జాబితాలో ఉన్నవారికి మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ చేయవచ్చు, మిగతా యూజర్లు చూడకుండా అడ్డుకోవచ్చు.
(2 / 6)
క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్‌ను సిద్ధం చేసుకోవడం ద్వారా, ప్రత్యేకంగా ఆ జాబితాలో ఉన్నవారికి మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ చేయవచ్చు, మిగతా యూజర్లు చూడకుండా అడ్డుకోవచ్చు. (AP)
మిమ్మల్ని ఎవరైనా వారి క్లోజ్ ఫ్రెండ్ లిస్టులో చేర్చినపుడు, వారి స్టోరీలను వీక్షిస్తున్నప్పుడు ఆకుపచ్చ బ్యాడ్జ్,  వారి ప్రొఫైల్ ఫోటో చుట్టూ ఆకుపచ్చ రింగ్‌ని చూస్తారు. అలా సెట్ చేసుకోవటానికి మీరు అనుసరించాల్సిన దశలు ఇక్కడ ఉన్నాయి:
(3 / 6)
మిమ్మల్ని ఎవరైనా వారి క్లోజ్ ఫ్రెండ్ లిస్టులో చేర్చినపుడు, వారి స్టోరీలను వీక్షిస్తున్నప్పుడు ఆకుపచ్చ బ్యాడ్జ్, వారి ప్రొఫైల్ ఫోటో చుట్టూ ఆకుపచ్చ రింగ్‌ని చూస్తారు. అలా సెట్ చేసుకోవటానికి మీరు అనుసరించాల్సిన దశలు ఇక్కడ ఉన్నాయి:(Pexels)
మీ క్లోజ్ ఫ్రెండ్ లిస్టు సిద్ధం చేయటానికి.. ముందుగా మీ ప్రొఫైల్‌కు దిగువ కుడివైపున ఉన్న ప్రొఫైల్ లేదా మీ ప్రొఫైల్ పిక్చర్ను నొక్కండి. ఆపై ఎగువ కుడి వైపున క్లిక్ చేసి, ఆపై క్లోజ్ ఫ్రెండ్స్ ఆప్షన్ మీద నొక్కండి. అక్కడ ఇచ్చిన సూచనల మేరకు పైకి లేదా క్రిందికి స్క్రోల్ చేయండి. అందరి ఫాలోవర్ల లిస్ట్ వస్తుంది.  అందులో క్లోజ్ ఫ్రెండ్ లిస్ట్ చేయాలనుకునే యాడ్ ఆప్షన్ నొక్కండి. మీ లిస్టులో యాడ్ అవుతారు. మీరు సెర్చ్ చేసి కూడా మీకు కావలసిన వారిని లిస్టులో చేర్చొచ్చు.
(4 / 6)
మీ క్లోజ్ ఫ్రెండ్ లిస్టు సిద్ధం చేయటానికి.. ముందుగా మీ ప్రొఫైల్‌కు దిగువ కుడివైపున ఉన్న ప్రొఫైల్ లేదా మీ ప్రొఫైల్ పిక్చర్ను నొక్కండి. ఆపై ఎగువ కుడి వైపున క్లిక్ చేసి, ఆపై క్లోజ్ ఫ్రెండ్స్ ఆప్షన్ మీద నొక్కండి. అక్కడ ఇచ్చిన సూచనల మేరకు పైకి లేదా క్రిందికి స్క్రోల్ చేయండి. అందరి ఫాలోవర్ల లిస్ట్ వస్తుంది. అందులో క్లోజ్ ఫ్రెండ్ లిస్ట్ చేయాలనుకునే యాడ్ ఆప్షన్ నొక్కండి. మీ లిస్టులో యాడ్ అవుతారు. మీరు సెర్చ్ చేసి కూడా మీకు కావలసిన వారిని లిస్టులో చేర్చొచ్చు. (Pixabay)
క్లోజ్ ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవారికి మాత్రమే కనిపించేలా పోస్ట్ చేసేందుకు.. ఫీడ్‌లో ఎక్కడైనా కుడివైపుకి స్వైప్ చేయండి లేదా ఎగువన ప్లస్ ఆప్షన్ నొక్కండి. ఆపై ఫోటో తీయడానికి స్క్రీన్ దిగువన క్లిక్ చేయండి లేదా వీడియోను రికార్డ్ చేయడానికి నొక్కి పట్టుకోండి. లేదా మీ ఫోన్ లైబ్రరీ, గ్యాలరీ నుండి ఫోటోను ఎంచుకోవడానికి స్క్రీన్‌పై ఎక్కడైనా పైకి స్వైప్ చేయండి. మీరు పోస్ట్ లేదా షేర్ చేసే సమయంలో దిగువ ఎడమవైపు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఆప్షన్ మీద నొక్కండి. అంతే, అది వారికి మాత్రమే కనిపిస్తుంది.
(5 / 6)
క్లోజ్ ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవారికి మాత్రమే కనిపించేలా పోస్ట్ చేసేందుకు.. ఫీడ్‌లో ఎక్కడైనా కుడివైపుకి స్వైప్ చేయండి లేదా ఎగువన ప్లస్ ఆప్షన్ నొక్కండి. ఆపై ఫోటో తీయడానికి స్క్రీన్ దిగువన క్లిక్ చేయండి లేదా వీడియోను రికార్డ్ చేయడానికి నొక్కి పట్టుకోండి. లేదా మీ ఫోన్ లైబ్రరీ, గ్యాలరీ నుండి ఫోటోను ఎంచుకోవడానికి స్క్రీన్‌పై ఎక్కడైనా పైకి స్వైప్ చేయండి. మీరు పోస్ట్ లేదా షేర్ చేసే సమయంలో దిగువ ఎడమవైపు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఆప్షన్ మీద నొక్కండి. అంతే, అది వారికి మాత్రమే కనిపిస్తుంది. (REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి