తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Electric Vehicles In India : ఈవీ @20లక్షలు.. భారతీయుల చూపు- ఎలక్ట్రిక్​ వాహనాలవైపు!

Electric vehicles in India : ఈవీ @20లక్షలు.. భారతీయుల చూపు- ఎలక్ట్రిక్​ వాహనాలవైపు!

03 February 2023, 11:34 IST

Electric vehicles in India : ఎలక్ట్రిక్​ వాహనాలపై భారతీయుల ఆసక్తి ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. ఆటో సంస్థల మధ్య నెలకొన్న పోటీతో ధరలు దిగొస్తుండటం కూడా ప్లస్​ పాయింట్​గా నిలుస్తోంది. 2021తో పోల్చుకుంటే 2022లో ఈవీ సెగ్మెంట్​ 200శాతం వృద్ధిని సాధించింది! దేశంలో ఈవీ సేల్స్​ 20లక్షల మైలురాయిని దాటినట్టు కేంద్ర విద్యుత్​శాఖ వెల్లడించింది. కేవలం 6ఏళ్లల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.

  • Electric vehicles in India : ఎలక్ట్రిక్​ వాహనాలపై భారతీయుల ఆసక్తి ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. ఆటో సంస్థల మధ్య నెలకొన్న పోటీతో ధరలు దిగొస్తుండటం కూడా ప్లస్​ పాయింట్​గా నిలుస్తోంది. 2021తో పోల్చుకుంటే 2022లో ఈవీ సెగ్మెంట్​ 200శాతం వృద్ధిని సాధించింది! దేశంలో ఈవీ సేల్స్​ 20లక్షల మైలురాయిని దాటినట్టు కేంద్ర విద్యుత్​శాఖ వెల్లడించింది. కేవలం 6ఏళ్లల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.
"ఈ-వాహన్​4 పోర్టల్​ ప్రకారం.. దేశంలో 2023 జనవరి 31 నాటికి దేశంలో 20,40,624 ఎలక్ట్రిక్​ వాహనాలు ఉన్నాయి," అని లోక్​సభ వేదికగా కేంద్ర విద్యుత్​శాఖ మంత్రి ఆర్​కే సింగ్​ ప్రకటించారు.
(1 / 7)
"ఈ-వాహన్​4 పోర్టల్​ ప్రకారం.. దేశంలో 2023 జనవరి 31 నాటికి దేశంలో 20,40,624 ఎలక్ట్రిక్​ వాహనాలు ఉన్నాయి," అని లోక్​సభ వేదికగా కేంద్ర విద్యుత్​శాఖ మంత్రి ఆర్​కే సింగ్​ ప్రకటించారు.(HT AUTO)
ఎలక్ట్రిక్​ వాహనాల వృద్ధిలో 3 వీలర్​దే అధిక వాటా! 2018లో 1.08 లక్షల యునిట్​లుగా ఉన్న 3 వీలర్​ ఈవీలు.. 2022 నాటికి 3.38లక్షలకు చేరాయి. ఇక ప్యాసింజర్​ వెహికిల్​ సెగ్మెంట్​లో.. 2 వీలర్​ ఈవీలు దూసుకెళుతున్నాయి. 2018లో కేవలం 16,943గా ఉన్న ఎలక్ట్రిక్​ బైక్స్​.. 2022లో 6.28లక్షలకు చేరాయి. పలు రాష్ట్రాల్లోని డేటాలు ఇంకా జోడించకుండానే నెంబర్లు ఈ రెంజ్​లో ఉండటం విశేషం.
(2 / 7)
ఎలక్ట్రిక్​ వాహనాల వృద్ధిలో 3 వీలర్​దే అధిక వాటా! 2018లో 1.08 లక్షల యునిట్​లుగా ఉన్న 3 వీలర్​ ఈవీలు.. 2022 నాటికి 3.38లక్షలకు చేరాయి. ఇక ప్యాసింజర్​ వెహికిల్​ సెగ్మెంట్​లో.. 2 వీలర్​ ఈవీలు దూసుకెళుతున్నాయి. 2018లో కేవలం 16,943గా ఉన్న ఎలక్ట్రిక్​ బైక్స్​.. 2022లో 6.28లక్షలకు చేరాయి. పలు రాష్ట్రాల్లోని డేటాలు ఇంకా జోడించకుండానే నెంబర్లు ఈ రెంజ్​లో ఉండటం విశేషం.(HT AUTO)
ఇక 2023 తొలి నెలలోనే.. 57,447 ఈవీల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తవడంతో.. ఈ ఏడాది ఈవీ వృద్ధి ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి.
(3 / 7)
ఇక 2023 తొలి నెలలోనే.. 57,447 ఈవీల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తవడంతో.. ఈ ఏడాది ఈవీ వృద్ధి ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి.(HT AUTO)
ఈవీ ప్యాసింజర్​ సెగ్మెంట్​లో టాటా మోటార్స్​ రారాజుగా కొనసాగుతోంది. ఇండియా ఈవీ మార్కెట్​ షేర్​లో ఈ సంస్థ వాటా 90శాతంగా ఉంది. 2 వీలర్​ ఈవీ సెగ్మెంట్​లో ఓలా ఎలక్ట్రిక్​ దూసుకెళుతోంది.
(4 / 7)
ఈవీ ప్యాసింజర్​ సెగ్మెంట్​లో టాటా మోటార్స్​ రారాజుగా కొనసాగుతోంది. ఇండియా ఈవీ మార్కెట్​ షేర్​లో ఈ సంస్థ వాటా 90శాతంగా ఉంది. 2 వీలర్​ ఈవీ సెగ్మెంట్​లో ఓలా ఎలక్ట్రిక్​ దూసుకెళుతోంది.(HT AUTO)
దేశంలో ఇప్పటికీ పెట్రోల్, డీజిల్​ వాహనాలనే ఎక్కవగా వినియోగిస్తున్నారు. కానీ ఈవీలకు ఈ రేంజ్​లో డిమాండ్​ లభిస్తుండటంతో భవిష్యత్తులో ఈవీలదే రాజ్యం అని ఆశలు చిగురిస్తున్నాయి.
(5 / 7)
దేశంలో ఇప్పటికీ పెట్రోల్, డీజిల్​ వాహనాలనే ఎక్కవగా వినియోగిస్తున్నారు. కానీ ఈవీలకు ఈ రేంజ్​లో డిమాండ్​ లభిస్తుండటంతో భవిష్యత్తులో ఈవీలదే రాజ్యం అని ఆశలు చిగురిస్తున్నాయి.(HT AUTO)
ఈవీ సెగ్మెంట్​పై ఆటో సంస్థలు కూడా దృష్టిసారించాయి. పోటీని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్​ను లాంచ్​ చేస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
(6 / 7)
ఈవీ సెగ్మెంట్​పై ఆటో సంస్థలు కూడా దృష్టిసారించాయి. పోటీని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్​ను లాంచ్​ చేస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.(HT AUTO)
ఈవీ సెగ్మెంట్​పై కేంద్రం కూడా దృష్టిపెట్టింది. బడ్జెట్​ 2023లో ఈవీలకు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేసింది. ఫలితంగా ఈవీల ధరలు ఇంకా దిగొచ్చే అవకాశాలు ఉన్నాయి.
(7 / 7)
ఈవీ సెగ్మెంట్​పై కేంద్రం కూడా దృష్టిపెట్టింది. బడ్జెట్​ 2023లో ఈవీలకు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేసింది. ఫలితంగా ఈవీల ధరలు ఇంకా దిగొచ్చే అవకాశాలు ఉన్నాయి.(HT AUTO)

    ఆర్టికల్ షేర్ చేయండి