తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Jio 5g Services : 75 నగరాలకు విస్తరించిన జియో 5జీ సేవలు..

Jio 5G services : 75 నగరాలకు విస్తరించిన జియో 5జీ సేవలు..

08 January 2023, 8:02 IST

Jio 5g services : 5జీ సేవలను విస్తరించే విషయంలో టెలికాం సంస్థలు పోటీపడుతున్నాయి. కాగా.. ఈ పోటీలో రిలయన్స్​ జియో ముందున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 75 ప్రాంతాల్లో 5జీ సేవలను ప్రారంభించింది జియో.

  • Jio 5g services : 5జీ సేవలను విస్తరించే విషయంలో టెలికాం సంస్థలు పోటీపడుతున్నాయి. కాగా.. ఈ పోటీలో రిలయన్స్​ జియో ముందున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 75 ప్రాంతాల్లో 5జీ సేవలను ప్రారంభించింది జియో.
2022 అక్టోబర్​లో తొలిసారిగా 5జీ సేవలను ప్రారంభించింది రిలయన్స్​ జియో. తొలుత ఢిల్లీ, ముంబై, వారణాసి, కోల్​కతా, చెన్నైల్లో ఈ సేవలను మొదలుపెట్టింది.
(1 / 6)

నవంబర్​లో.. బెంగళూరు, హైదరాబాద్​, గురుగ్రామ్​, నోయిడా, ఘాజియాబాద్​, ఫరీదాబాద్​, పుణెలకు జియో 5జీ సేవలు విస్తరించాయి.
(2 / 6)

నవంబర్​ 25 నాటికి.. గుజరాత్​లోని 33 జిల్లాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. అన్ని జిల్లాల్లోని 5జీ సేవలు లభిస్తున్న రాష్ట్రంగా గుజరాత్​ నిలిచింది.
(3 / 6)

ఉజ్జెయిని ఆలయం, కొచ్చి, గురువాయూర్​ ఆలయం, తిరుమల, విజయవాడ, విశాఖపట్నం, గుంటూర్​, లక్నో, త్రివేండ్రం, మైసూర్​, నాసిక్​, ఔరంగాబాద్​, చంఢీగఢ్​, మోహాలీ, పంచ్​కుల, జిరాక్​పూర్​, ఖరార్​, డేరాబస్సి, భోపాల్​, ఇండోర్​లో డిసెంబర్​ నాటికి జియో 5జీ సేవలు మొదలయ్యాయి.
(4 / 6)

2023 జనవరి మొదటి వారంలో.. భువనేశ్వర్​, కటక్​, జబల్​పూర్​, గ్వాలియర్​, లుథియానా, సిలిగురిలకు జియో 5జీ సేవలు విస్తరించాయి.
(5 / 6)

ఇక శనివారం.. రాజస్థాన్​లోని మూడు ప్రాంతాల్లో జియో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా ఇప్పడు వరకు 5జీని జియో అందిస్తున్న నగరాల సంఖ్య 75కు పెరిగింది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి