Reliance Jio 5G: 11 నగరాలకు జియో న్యూఇయర్ గిఫ్ట్.. 5జీ సర్వీసులు లాంచ్ : ఫుల్ లిస్ట్ ఇదే
Reliance Jio 5G network: దేశంలోని మరో 11 సిటీల్లో 5జీ నెట్‍వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది రిలయన్స్ జియో. ఒకేసారి ఈ నగరాల్లో 5జీని రోల్అవుట్ చేసింది. పూర్తి వివరాలు ఇవే.
Jio 5G launched in Another 11 Cities: దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) దూకుడు చూపిస్తోంది. 5జీ నెట్‍వర్క్ (5G Network)ను వేగంగా విస్తరిస్తోంది. తాజాగా మరో 11 నగరాల్లో 5జీ సర్వీసులను లాంచ్ చేసింది జియో. న్యూఇయర్ ముంగిట ఈ సిటీలకు 5జీని బహుమతిగా ఇచ్చింది. ఆ సిటీల్లోనూ జియో వెల్కమ్ ఆఫర్ ఉండనుంది. వివరాలు ఇవే..
ఆ నగరాలు ఇవే..
లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలీ, పంచకుల, జిక్రాపూర్, ఖరార్, డేరాబస్సి సిటీల్లో తాజాగా 5జీ నెట్‍వర్క్‌ను జియో రోల్అవుట్ చేసింది. కొత్తతరం హైస్పీడ్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. “ఈ సిటీలు ముఖ్యమైన పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషన్ హబ్‍లుగానూ ఉన్నాయి. జియో ట్రూ 5జీతో వేగవంతమైన టెలికం సర్వీసులే కాకుండా చాలా రంగాల్లో ఎంతో ఉపయోగపడుతుంది” అని జియో పేర్కొంది. ఆ 11 నగరాల్లో 5జీ ఫోన్లలో జియో వాడుతున్న వారికి వెల్కమ్ ఆఫర్ ఇవ్వనుంది. దీని కింద ఇన్వెట్ అందుకునే కస్టమర్లు 1జీబీపీఎస్ వేగంతో అన్‍లిమిటెడ్ డేటాను ఉచితంగా వాడుకోవచ్చు.
కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్‍లోనూ 5జీ నెట్‍వర్క్‌ను జియో లాంచ్ చేసింది. తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో 5జీ సర్వీస్‍లను రోల్అవుట్ చేసింది. వెల్కమ్ ఆఫర్‍ను అందుబాటులోకి తెచ్చింది. 2023 చివరి కల్లా దేశమంతా 5జీని విస్తరించాలని ముకేశ్ అంబానీ కంపెనీ జియో లక్ష్యంగా పెట్టుకుంది.
5జీ సర్వీసులను వినియోగించుకోవాలంటే సిమ్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం వినియోగిస్తున్న 4జీ సిమ్ 5జీ నెట్‍వర్క్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే 5జీకి సపోర్ట్ చేసే మొబైల్ ఉండాలి. దాదాపు ఇప్పటికే 5జీకి ఎనేబుల్ చేస్తూ అన్ని మొబైల్ తయారీ సంస్థలు 5జీ ఫోన్లకు అప్‍డేట్లను రిలీజ్ చేశాయి. గూగుల్ పిక్సెల్ మొబైళ్లకు మాత్రం అప్‍డేట్ రావాల్సి ఉంది.
ఇప్పటి వరకు జియో 5జీ అందుబాటులోకి వచ్చిన నగరాల లిస్ట్
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్, నోయిడా, ముంబై, కోల్‌కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, నత్‍ద్వారా, కొచ్చి, లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, చండీగఢ్, ఔరంగాబాద్, జికాపూర్, పంచకుల, మొబాలీ, ఖరార్, డేరబస్సి సిటీలతో పాటు గుజరాత్‍లోని 33 జిల్లా కేంద్రాల్లో ఇప్పటి వరకు జియో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. 2023 చివరి కల్లా దేశమంతా 5జీ సర్వీసుల లాంచ్ చేస్తామని జియో చెబుతోంది.