తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: All Facts You Need To Know About Budget Speeches Ahead Of Union Budget 2023

Union Budget 2023 : కేంద్ర బడ్జెట్​ను కేవలం 800 పదాల్లో ముగించేశారు!

14 January 2023, 7:20 IST

Union Budget 2023 : ఫిబ్రవరి 1న బడ్జెట్​ను ప్రవేశపెట్టనుంది కేంద్రం. నిర్మలా సీతారామన్​ ప్రసంగంపై భారతీయులు కోటి ఆశలు పెట్టుకున్నారు! ఈ క్రమంలో బడ్జెట్​ విషయంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాము.

Union Budget 2023 : ఫిబ్రవరి 1న బడ్జెట్​ను ప్రవేశపెట్టనుంది కేంద్రం. నిర్మలా సీతారామన్​ ప్రసంగంపై భారతీయులు కోటి ఆశలు పెట్టుకున్నారు! ఈ క్రమంలో బడ్జెట్​ విషయంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాము.
దేశాభివృద్ధి, రాజకీయాల్లో మరో కీలక ఘట్టం! ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీజేపీకి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్​ కానుంది.
(1 / 7)
దేశాభివృద్ధి, రాజకీయాల్లో మరో కీలక ఘట్టం! ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీజేపీకి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్​ కానుంది.(Amlan Paliwal)
దేశ బడ్జెట్​ చరిత్రలో సుదీర్ఘ ప్రసంగాలు చేసిన ఆర్థికమంత్రిగా నిలిచారు నిర్మలా సీతారామన్​.
(2 / 7)
దేశ బడ్జెట్​ చరిత్రలో సుదీర్ఘ ప్రసంగాలు చేసిన ఆర్థికమంత్రిగా నిలిచారు నిర్మలా సీతారామన్​.(HT)
1977లో కేవలం 800 పదాలతో మధ్యంతర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు నాటి ఆర్థికమంత్రి హీరాభాయ్​ ములిజిభాయ్​ పటేల్​.
(3 / 7)
1977లో కేవలం 800 పదాలతో మధ్యంతర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు నాటి ఆర్థికమంత్రి హీరాభాయ్​ ములిజిభాయ్​ పటేల్​.
ఇక 2020లో 2 గంటల 42 నిమిషాల పాటు బడ్జెట్​ ప్రసంగం చేశారు నిర్మలా సీతారామన్​. ఇదొక రికార్డు.
(4 / 7)
ఇక 2020లో 2 గంటల 42 నిమిషాల పాటు బడ్జెట్​ ప్రసంగం చేశారు నిర్మలా సీతారామన్​. ఇదొక రికార్డు.(Shrikant Singh)
 బడ్జెట్​లో వినియోగించే పదాలను ప్రామాణికంగా తీసుకుంటే.. సుదీర్ఘమైన పద్దును డెలివరీ చేశారు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​. పీవీ నరసింహా రావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన.. 18,650 పదాలతో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు.
(5 / 7)
 బడ్జెట్​లో వినియోగించే పదాలను ప్రామాణికంగా తీసుకుంటే.. సుదీర్ఘమైన పద్దును డెలివరీ చేశారు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​. పీవీ నరసింహా రావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన.. 18,650 పదాలతో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు.(Rahul Singh)
అత్యధిక బడ్జెట్​ ప్రసంగాలు చేసిన వారిలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్​ మొదటి స్థానంలో ఉన్నారు. 1962-69లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మొత్తం మీద 10సార్లు బడ్జెట్​ను ప్రవేశపెట్టారు.
(6 / 7)
అత్యధిక బడ్జెట్​ ప్రసంగాలు చేసిన వారిలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్​ మొదటి స్థానంలో ఉన్నారు. 1962-69లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మొత్తం మీద 10సార్లు బడ్జెట్​ను ప్రవేశపెట్టారు.
బ్రిటీష్​ కాలం నుంచి ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్​ను ప్రవేశపెట్టడం ఆనవాయతీ. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫిబ్రవరి 1కి మారింది. అలా.. కొత్త డేట్​లో బడ్జెట్​ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థికమంత్రిగా అరుణ్​ జైట్లీ నిలిచారు.
(7 / 7)
బ్రిటీష్​ కాలం నుంచి ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్​ను ప్రవేశపెట్టడం ఆనవాయతీ. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫిబ్రవరి 1కి మారింది. అలా.. కొత్త డేట్​లో బడ్జెట్​ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థికమంత్రిగా అరుణ్​ జైట్లీ నిలిచారు.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి