న్యూఢిల్లీ, జనవరి 13: లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి.
సెషన్ 27 పని దినాలు కలిగి ఉంటుంది. బడ్జెట్ పత్రాలను పరిశీలించడానికి నెల రోజుల విరామంతో కలిపి ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సెషన్ మొదటి భాగం ఫిబ్రవరి 14న ముగుస్తుందని తెలిపారు.
బడ్జెట్ సెషన్ రెండో విడత కోసం పార్లమెంట్ మార్చి 12న తిరిగి సమావేశమవుతుంది.
‘రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ, కేంద్ర బడ్జెట్, ఇతర అంశాలు బడ్జెట్ సమావేశాల్లో కీలకమైనవి..’ అని జోషి చెప్పారు.
టాపిక్