తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Google Maps Offline | ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా మ్యాప్స్ ఉపయోగించవచ్చు, ఇలాగా!

Google Maps Offline | ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా మ్యాప్స్ ఉపయోగించవచ్చు, ఇలాగా!

13 June 2022, 9:52 IST

గూగుల్ యాప్స్ వినియోగదారులు ఇప్పుడు తమ కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఆఫ్‌లైన్‌ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం లేనపుడు కూడా Google Maps ఆఫ్‌లైన్‌లో ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

గూగుల్ యాప్స్ వినియోగదారులు ఇప్పుడు తమ కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఆఫ్‌లైన్‌ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం లేనపుడు కూడా Google Maps ఆఫ్‌లైన్‌లో ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

మీరు ఏదైనా తెలియని కొత్త ప్రదేశానికి ప్రయాణించాల్సి వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రాంతం, భవనం చిరునామా తెలుసుకోవాల్సి వచ్చినపుడు Google Maps ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎక్కువగా 'గూగుల్ మ్యాప్స్' పైనే ఆధారపడుతున్నారు.
(1 / 7)
మీరు ఏదైనా తెలియని కొత్త ప్రదేశానికి ప్రయాణించాల్సి వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రాంతం, భవనం చిరునామా తెలుసుకోవాల్సి వచ్చినపుడు Google Maps ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎక్కువగా 'గూగుల్ మ్యాప్స్' పైనే ఆధారపడుతున్నారు.(Reuters)
అయితే గూగుల్ మ్యాప్స్ ఉపయోగించటానికి ఇప్పటివరకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అయ్యేది. కానీ Google తాజగా అందిస్తున్న సమాచారం మేరకు ఇంటర్నెట్ సదుపాయం లేనపుడు కూడా మ్యాప్స్ ఉపయోగించవచ్చు. మీరు కారులో ప్రయాణిస్తున్నట్లయితే, మీ కారులో ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేనప్పుడు భద్రత, నావిగేషన్ కోసం మీరు Google Maps ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించవచ్చు.
(2 / 7)
అయితే గూగుల్ మ్యాప్స్ ఉపయోగించటానికి ఇప్పటివరకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అయ్యేది. కానీ Google తాజగా అందిస్తున్న సమాచారం మేరకు ఇంటర్నెట్ సదుపాయం లేనపుడు కూడా మ్యాప్స్ ఉపయోగించవచ్చు. మీరు కారులో ప్రయాణిస్తున్నట్లయితే, మీ కారులో ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేనప్పుడు భద్రత, నావిగేషన్ కోసం మీరు Google Maps ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించవచ్చు.(Pixabay)
వ్యక్తులు ఉంటున్న ఉంటున్న చోటు, చేసిన ప్రయాణాల ఆధారంగా Google Maps ఆఫ్‌లైన్ దానంతటదే అప్‌డేట్ చేసుకుంటుంది. ఈ ప్రకారంగా మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు లేదా ఇంటర్నెట్ సదుపాయం లేని సందర్భంలో కూడా గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ సమాచారాన్ని అందిస్తుంది. అయితే ఈ ఫీచర్ అన్ని భాషల్లో అందుబాటులో ఉండదు. ఇంగ్లీష్ లో మాత్రమ్
(3 / 7)
వ్యక్తులు ఉంటున్న ఉంటున్న చోటు, చేసిన ప్రయాణాల ఆధారంగా Google Maps ఆఫ్‌లైన్ దానంతటదే అప్‌డేట్ చేసుకుంటుంది. ఈ ప్రకారంగా మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు లేదా ఇంటర్నెట్ సదుపాయం లేని సందర్భంలో కూడా గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ సమాచారాన్ని అందిస్తుంది. అయితే ఈ ఫీచర్ అన్ని భాషల్లో అందుబాటులో ఉండదు. ఇంగ్లీష్ లో మాత్రమ్(Google Maps Twitter)
ప్రస్తుతానికి ఈ ఆఫ్‌లైన్ ఫీచర్ కారులో పొందుపరిచిన గూగుల్ యాప్ లో మాత్రమే వినియోగించగలరు. Google Maps వాహన మ్యాప్ సర్వీస్ (VMS) ద్వారా డేటాను అందజేస్తుంది. ఇది డ్రైవర్ సహాయ ఫీచర్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫీచర్లోని అంశాలు ఆఫ్‌లైన్ మ్యాప్ డేటాపై ఆధారపడి ఉంటాయి. మ్యాప్ డేటా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవడానికి మీ కారులోని ప్రైవసీ సెంటర్లో 'ఆటో-డౌన్‌లోడ్'ని ఆన్ చేసి ఉంచండి.
(4 / 7)
ప్రస్తుతానికి ఈ ఆఫ్‌లైన్ ఫీచర్ కారులో పొందుపరిచిన గూగుల్ యాప్ లో మాత్రమే వినియోగించగలరు. Google Maps వాహన మ్యాప్ సర్వీస్ (VMS) ద్వారా డేటాను అందజేస్తుంది. ఇది డ్రైవర్ సహాయ ఫీచర్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫీచర్లోని అంశాలు ఆఫ్‌లైన్ మ్యాప్ డేటాపై ఆధారపడి ఉంటాయి. మ్యాప్ డేటా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవడానికి మీ కారులోని ప్రైవసీ సెంటర్లో 'ఆటో-డౌన్‌లోడ్'ని ఆన్ చేసి ఉంచండి.(REUTERS)
ప్రైవసీ సెంటర్లో ఆటో-డౌన్‌లోడ్‌ని ఆన్ చేయడానికి Google Maps యాప్‌ని తెరవండి. దిగువన, సెట్టింగ్‌లను నొక్కండి, ఆపై ప్రైవసీ సెంటర్ పై క్లిక్ చేసి, ఆఫ్‌లైన్ మ్యాప్‌లపై క్లిక్ చేయండి. ఆఫ్‌లైన్ మ్యాప్‌లను ఆటోమేటిక్ గా డౌన్‌లోడ్ చేయడాన్ని ఎంచుకోండి. ఇందుకు మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.
(5 / 7)
ప్రైవసీ సెంటర్లో ఆటో-డౌన్‌లోడ్‌ని ఆన్ చేయడానికి Google Maps యాప్‌ని తెరవండి. దిగువన, సెట్టింగ్‌లను నొక్కండి, ఆపై ప్రైవసీ సెంటర్ పై క్లిక్ చేసి, ఆఫ్‌లైన్ మ్యాప్‌లపై క్లిక్ చేయండి. ఆఫ్‌లైన్ మ్యాప్‌లను ఆటోమేటిక్ గా డౌన్‌లోడ్ చేయడాన్ని ఎంచుకోండి. ఇందుకు మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.(Unsplash)
మీ ప్రొఫైల్ పిక్ > ఆఫ్‌లైన్ మ్యాప్‌లు > కొత్త ఆఫ్‌లైన్ మ్యాప్‌ను సృష్టించండి మీరు ఆఫ్‌లైన్‌లో సేవ్ చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంచుకోండి మీ మ్యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసిన ఆఫ్‌లైన్ మ్యాప్‌ల జాబితా కనిపిస్తుంది. అందులో మీరు ప్రయాణించే మ్యాప్‌ను సెలక్ట్ చేసుకుంటే మీకు ఇంటర్నెట్ లేకపోయినా మ్యాప్ ఉపయోగించవచ్చు.
(6 / 7)
మీ ప్రొఫైల్ పిక్ > ఆఫ్‌లైన్ మ్యాప్‌లు > కొత్త ఆఫ్‌లైన్ మ్యాప్‌ను సృష్టించండి మీరు ఆఫ్‌లైన్‌లో సేవ్ చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంచుకోండి మీ మ్యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసిన ఆఫ్‌లైన్ మ్యాప్‌ల జాబితా కనిపిస్తుంది. అందులో మీరు ప్రయాణించే మ్యాప్‌ను సెలక్ట్ చేసుకుంటే మీకు ఇంటర్నెట్ లేకపోయినా మ్యాప్ ఉపయోగించవచ్చు.(Google)

    ఆర్టికల్ షేర్ చేయండి