Google Doodle | గూగుల్​ డూడుల్​తో గణిత శాస్త్రజ్ఞుడు బోస్​కు నివాళి.. -google pays tribute to mathematician with google doodle ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Google Doodle | గూగుల్​ డూడుల్​తో గణిత శాస్త్రజ్ఞుడు బోస్​కు నివాళి..

Google Doodle | గూగుల్​ డూడుల్​తో గణిత శాస్త్రజ్ఞుడు బోస్​కు నివాళి..

Geddam Vijaya Madhuri HT Telugu
Published Jun 04, 2022 02:02 PM IST

గూగుల్ డూడుల్​ గణిత శాస్త్రజ్ఞుడు సత్యేంద్ర నాథ్ బోస్​కు గూగుల్ నివాళులు అర్పించింది. గూగుల్​ డూడుల్​తో సత్యేంద్రనాథ్​ బోస్​కు నివాళులు తెలిపి.. ఆయన గొప్ప తనాన్ని మరోసారి గుర్తు చేశారు.

<p>డాక్టర్ సత్యేంద్ర నాథ్ బోస్</p>
డాక్టర్ సత్యేంద్ర నాథ్ బోస్

Google Doodle | భౌతిక శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు సత్యేంద్రనాథ్ బోస్​కు నివాళులు అర్పిస్తూ.. గూగుల్ డూడుల్​తో నివాళులు అర్పించింది. 1924లో ఇదే రోజున, బోస్ తన క్వాంటం సూత్రీకరణలను ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు పంపాడు. అతను దానిని క్వాంటం మెకానిక్స్‌లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణగా గుర్తించాడు. బోస్​ గణాంకాలకు కట్టుబడి.. కణాల తరగతికి బోస్​ పేరు పెట్టారు.

బోస్ ప్రారంభ జీవితం

1894లో కోల్‌కతాలో జన్మించిన బోస్‌కు భౌతిక శాస్త్రం, గణితం, తత్వశాస్త్రం, జీవశాస్త్రం, కళలు, సంగీతం వంటి అనేక రంగాలపై ఆసక్తిని కనబరిచారు. హిందూ పాఠశాలలో చదివిన తరువాత.. ఆయన ప్రెసిడెన్సీ కళాశాలలో విద్యను కొనసాగించాడు. జగదీష్ చంద్రబోస్, ప్రఫుల్ల చంద్ర నుంచి ప్రేరణ పొందిన బోస్.. కోల్​కత్తా విశ్వవిద్యాలయంలోని భౌతిక శాస్త్ర విభాగంలో కొన్ని సంవత్సరాలు అధ్యాపకునిగా పనిచేశారు. 1954లో ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది.

గురువుగా ఐన్‌స్టీన్

బోస్.. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను తన గురువుగా భావించాడని అందరూ నమ్ముతారు. ఢాకా విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు.. రేడియేషన్, అతినీలలోహిత విపత్తుపై సమకాలీన సిద్ధాంతం సరిపోదని బోస్ తన విద్యార్థులకు నిరూపించాలనుకున్నారు. అతను ఈ ఉపన్యాసాన్ని "ప్లాంక్ లా అండ్ ది హైపోథెసిస్ ఆఫ్ లైట్ క్వాంటా" అనే వ్యాసంగా మార్చి... దానిని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు లేఖతో పాటు పంపించారు.

బోస్-ఐన్స్టీన్

ఐన్‌స్టీన్ బోస్ సిద్ధాంతంతో ఏకీభవించారు. అతని పత్రాలను జర్మన్‌లోకి అనువదించారు. దానిని 1924లో బోస్ పేరుతో జైట్‌స్క్రిఫ్ట్ ఫర్ ఫిజిక్‌లో ప్రచురించారు. ఐన్‌స్టీన్ తరువాత ఈ ఆలోచనను స్వీకరించి.. దానిని పరమాణువులకు విస్తరించారు. ఇది చివరికి బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్ అని పిలువబడే దృగ్విషయం ఉనికిని అంచనా వేసింది. ఇది బోసాన్‌ల దట్టమైన సేకరణ. 1995లో ఒక ప్రయోగం ద్వారా ఇది ఉనికిలో ఉన్నట్లు నిరూపించారు.

ఇతర విజయాలు

బోస్ జాతీయ ప్రొఫెసర్‌గా కూడా నియమితులయ్యారు. ఇది భారతదేశంలో పండితులకు అత్యున్నత గౌరవం. ఐన్‌స్టీన్ సిఫార్సుతో, బోస్ ఢాకా యూనివర్సిటీలో ఫిజిక్స్ విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. అతను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఫిజికల్ సొసైటీ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వంటి అనేక శాస్త్రీయ సంస్థల అధ్యక్షుడిగా పనిచేశారు. బోస్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌కు కూడా సలహాలు ఇచ్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం