తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bachelor Trip | బ్యాచిలర్ లైఫ్ పరిపూర్ణంగా ఎంజాయ్ చేయాలంటే.. మీ పెళ్లి లోపు ఈ ప్రదేశాలు చుట్టేయండి!

Bachelor Trip | బ్యాచిలర్ లైఫ్ పరిపూర్ణంగా ఎంజాయ్ చేయాలంటే.. మీ పెళ్లి లోపు ఈ ప్రదేశాలు చుట్టేయండి!

15 November 2022, 17:53 IST

Bachelor Trip: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఒక అపురూప ఘట్టం. పెళ్లికి ముందు బ్యాచిలర్ జీవితం వేరు, పెళ్లి తర్వాత జీవితం వేరు. మీ పెళ్లయ్యేలోపు మీ బ్యాచిలర్ జీవితాన్ని వేడుక చేసుకోవడానికి టూర్ వెళ్లాలనుకుంటే ఏ ప్రదేశాలు ఉత్తమమో ఇక్కడ చూడండి.

Bachelor Trip: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఒక అపురూప ఘట్టం. పెళ్లికి ముందు బ్యాచిలర్ జీవితం వేరు, పెళ్లి తర్వాత జీవితం వేరు. మీ పెళ్లయ్యేలోపు మీ బ్యాచిలర్ జీవితాన్ని వేడుక చేసుకోవడానికి టూర్ వెళ్లాలనుకుంటే ఏ ప్రదేశాలు ఉత్తమమో ఇక్కడ చూడండి.
ప్రశాంతమైన బీచ్‌ల నుండి సుందరమైన ఎత్తైన కొండ ప్రాంతాల వరకు, మీ బ్యాచిలర్ జీవితానికి పరిపూర్ణత తెచ్చే అద్భుతమైన గమ్యస్థానాలు ఏవో తెలుసుకోండి.
(1 / 8)
ప్రశాంతమైన బీచ్‌ల నుండి సుందరమైన ఎత్తైన కొండ ప్రాంతాల వరకు, మీ బ్యాచిలర్ జీవితానికి పరిపూర్ణత తెచ్చే అద్భుతమైన గమ్యస్థానాలు ఏవో తెలుసుకోండి. (pexels)
గోవా: ఈ ప్రదేశం నిజంగా బ్యాచిలర్లుగా ఉన్నవారికి స్వర్గం. సింగిల్స్ గా ఉండి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నవారు  బ్యాచిలొరెట్ పార్టీ కోసం గోవా వెళ్లొచ్చు. ముఖ్యంగా ఉత్తర గోవాలో బ్యాచిలర్స్ ఎంజాయ్ చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. దక్షిణ గోవాలో విలాసవంతమైన హోటెల్స్, రిసార్టులు ఉన్నాయి.
(2 / 8)
గోవా: ఈ ప్రదేశం నిజంగా బ్యాచిలర్లుగా ఉన్నవారికి స్వర్గం. సింగిల్స్ గా ఉండి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నవారు బ్యాచిలొరెట్ పార్టీ కోసం గోవా వెళ్లొచ్చు. ముఖ్యంగా ఉత్తర గోవాలో బ్యాచిలర్స్ ఎంజాయ్ చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. దక్షిణ గోవాలో విలాసవంతమైన హోటెల్స్, రిసార్టులు ఉన్నాయి. (Unsplash)
పాండిచ్చేరి: భారతీయ సంప్రదాయాలు, ఫ్రెంచ్ సంస్కృతుల సమ్మేళనం పాండి.  బీచ్‌లను ఆస్వాదించే అమ్మాయిలకు అనువైన ప్రదేశం. ఇక్కడ ఎన్నో  అద్భుతమైన కేఫ్‌లు, స్టైలిష్ బోటిక్‌లు ఉన్నాయి. సైకిల్‌ను అద్దెకు తీసుకొని  సరదాగా రోడ్లపై తిరగుతుంటే ఎంతో ఆహ్లదంగా ఉంటుంది.
(3 / 8)
పాండిచ్చేరి: భారతీయ సంప్రదాయాలు, ఫ్రెంచ్ సంస్కృతుల సమ్మేళనం పాండి. బీచ్‌లను ఆస్వాదించే అమ్మాయిలకు అనువైన ప్రదేశం. ఇక్కడ ఎన్నో అద్భుతమైన కేఫ్‌లు, స్టైలిష్ బోటిక్‌లు ఉన్నాయి. సైకిల్‌ను అద్దెకు తీసుకొని సరదాగా రోడ్లపై తిరగుతుంటే ఎంతో ఆహ్లదంగా ఉంటుంది. (Unsplash)
ఉదయపూర్: ఈ సరస్సుల నగరంలో చూడటానికి అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. విశాలమైన పురాతన కోటలను అన్వేషించండి, నక్షత్రాల క్రింద నైట్ క్యాంపింగ్‌కు వెళ్లండి ,  అద్భుతమైన సరస్సులలో  పడవ ప్రయాణాలు చేయండి. ఒంటెలపై సవారీ చేస్తూ ఊరేగండి.
(4 / 8)
ఉదయపూర్: ఈ సరస్సుల నగరంలో చూడటానికి అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. విశాలమైన పురాతన కోటలను అన్వేషించండి, నక్షత్రాల క్రింద నైట్ క్యాంపింగ్‌కు వెళ్లండి , అద్భుతమైన సరస్సులలో పడవ ప్రయాణాలు చేయండి. ఒంటెలపై సవారీ చేస్తూ ఊరేగండి.(Unsplash)
లక్షద్వీప్:  ఒక ప్రైవేట్ పడవను తీసుకొని నేరుగా అరేబియా సముద్రం మధ్యలో ఉన్న లక్షద్వీప్ తీరప్రాంతానికి వెళ్లండి. ఈ ద్వీపం దాని అసాధారణ దృశ్యాలు, సూర్యాస్తమయాలకు ప్రసిద్ధి చెందింది.
(5 / 8)
లక్షద్వీప్: ఒక ప్రైవేట్ పడవను తీసుకొని నేరుగా అరేబియా సముద్రం మధ్యలో ఉన్న లక్షద్వీప్ తీరప్రాంతానికి వెళ్లండి. ఈ ద్వీపం దాని అసాధారణ దృశ్యాలు, సూర్యాస్తమయాలకు ప్రసిద్ధి చెందింది. (Unsplash)
డల్హౌసీ: యాత్రికులందరికీ హిమాచల్ ప్రదేశ్ స్వర్గం.  ఈ రాష్ట్రంలో బాగా ఇష్టపడే ప్రదేశాలలో డల్హౌసీ ఒకటి. స్వచ్ఛమైన గాలి, ఉత్కంఠభరితమైన దృశ్యాలు, అద్భుతమైన వాస్తుకళ మొదలనవి మీకు, మీ స్నేహితులకు  ఈ హిల్ స్టేషన్ సరైన విహారయాత్ర.
(6 / 8)
డల్హౌసీ: యాత్రికులందరికీ హిమాచల్ ప్రదేశ్ స్వర్గం. ఈ రాష్ట్రంలో బాగా ఇష్టపడే ప్రదేశాలలో డల్హౌసీ ఒకటి. స్వచ్ఛమైన గాలి, ఉత్కంఠభరితమైన దృశ్యాలు, అద్భుతమైన వాస్తుకళ మొదలనవి మీకు, మీ స్నేహితులకు ఈ హిల్ స్టేషన్ సరైన విహారయాత్ర.(Unsplash)
అండమాన్ & నికోబార్ దీవులు: స్వచ్ఛమైన సముద్ర తీరప్రాంతాలలో సేదతీరాలన్నా, కాక్‌టెయిల్‌లతో మునిగితేలాలన్నా, అద్భుతమైన డైవింగ్ స్థానాలలో అడ్వెంచర్లు చేయాలన్నా అందుకు అదిరిపోయే గమ్యస్థానం  అండమాన్ & నికోబార్ దీవులు.
(7 / 8)
అండమాన్ & నికోబార్ దీవులు: స్వచ్ఛమైన సముద్ర తీరప్రాంతాలలో సేదతీరాలన్నా, కాక్‌టెయిల్‌లతో మునిగితేలాలన్నా, అద్భుతమైన డైవింగ్ స్థానాలలో అడ్వెంచర్లు చేయాలన్నా అందుకు అదిరిపోయే గమ్యస్థానం అండమాన్ & నికోబార్ దీవులు.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి