తెలుగు న్యూస్ / ఫోటో /
Offbeat Honeymoon Destinations । కొత్త జంటలు కోరుకుంటే ఏకాంతం.. ఈ ప్రదేశాలు ఎంతో ప్రశాంతం!
(1 / 8)
పెళ్లి తర్వాత కొత్త జంటలు ఉత్సాహాంగా ఎదురుచూసేది హానీమూన్ యాత్ర. అయితే ఎక్కడికి వెళ్లాలన్నా ఇండియాలో రద్దీగానే ఉంటుంది. కానీ కొన్ని నిశబ్ద గమ్యస్థానాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
(2 / 8)
కూర్గ్, దక్షిణ భారతదేశంలోని ఈ అందమైన హనీమూన్ గమ్యస్థానాన్ని తరచుగా "స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు. ఈ చిన్న పట్టణం సరస్సులు, కాఫీ తోటలు, జలపాతాలు, సుందరమైన కొండలు, లోయలు వంటి ప్రాకృతిక అందాలతో పాటుగా మంచి మంచి దేవాలయాలను కలిగి ఉన్న ప్రాంతం.
(3 / 8)
పాండిచ్చేరి: ఇది కూడా సౌత్ ఇండియాలోనే ఉన్న మరొక అద్భుతమైన హనీమూన్ గమ్యస్థానం. దీనిని "ది లిటిల్ ప్యారిస్" అని కూడా పిలుస్తారు. ప్రశాంతమైన బీచ్, పచ్చని చెట్లు, నోరూరించే ఆహారాలు ఇక్కడ ఆస్వాదించవచ్చు. జంటలకు ఇంతకంటే ఇంకే కావాలి?
(4 / 8)
నైనిటాల్: బడ్జెట్‌లో అంతర్జాతీయ పర్యటన అనుభూతిని కలిగించే ప్రాంతం ఇది. ఎత్తైన హిమాలయాలు, దేవదారు చెట్లు, నదులు అన్నింటి మేళవింపుతో అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతం.
(5 / 8)
పూరీ: ఒడిషాలోని పూరి పట్టణం ప్రసిద్ధ హిందూ తీర్థయాత్ర స్థలం అనుకుంటే మీరు పొరపడినట్లే. ఈ ప్రాంతం నిర్మలమైన బీచ్‌లకు, ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.
(6 / 8)
మున్నార్: హనీమూన్ జంటలు ఎక్కువగా కేరళ రాష్ట్రాన్ని ఎంచుకుంటాయి. ఇక్కడి మున్నార్ ప్రాంతం రొమాంటిక్ హనీమూన్ కోసం ఉత్తమ ప్రదేశంచుట్టూ పచ్చని లోయలు, అందంగా ప్రవహించే బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. మీరు హనీమూన్ ట్రిప్ కోసం చూస్తున్నట్లయితే, మున్నార్ ఉత్తమ ఎంపిక.
(7 / 8)
డల్హౌసీ: హిమాచల్‌లోని అందమైన మైదానాలను కలిగి ఉన్న ఈ నగరానికి టూరిస్టుల తాకిడి ఎక్కువే, కానీ ఆఫ్-సీజన్‌లో తక్కువ రద్దీ ఉంటుంది, కాబట్టి మీరు మీ జాబితాలో దీన్ని కూడా చేర్చుకోవచ్చు.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు