తెలుగు న్యూస్  /  National International  /  'Why Afraid..' Pm Modi Asks About Nehru's Generation Not Using His Surname

PM Modi on Nehru surname: అంతంటారు.. ఇంతంటారు.. కానీ ఇంటిపేరు మాత్రం వద్దంటారు’

HT Telugu Desk HT Telugu

09 February 2023, 18:08 IST

  • PM Modi on Nehru surname: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై జరిగిన చర్చకు గురువారం రాజ్యసభలో ప్రధాని మోదీ సమాధానమిచ్చారు.

రాజ్యసభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
రాజ్యసభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ (PTI)

రాజ్యసభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

PM Modi on Nehru surname: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ప్రధాని మోదీ రాజ్యసభలో విపక్ష కాంగ్రెస్ పై చురుక్కులు, చమక్కులతో విరుచుకుపడ్డారు. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇంటిపేరైన నెహ్రూ (Nehru surname) ఆయన తరువాత తరాలు ఉపయోగించకపోవడంపై విమర్శలు గుప్పించారు. నెహ్రూ (Jawahar lal Nehru) పేరును దాదాపు 600 ప్రభుత్వ పథకాలకు పెట్టారని, తమ ప్రభుత్వం నెహ్రూ (Jawahar lal Nehru) పేరును ఏ పథకానికైనా పెట్టకపోతే, రచ్చ చేస్తారని ప్రధాని మోదీ విమర్శించారు. కానీ ఇంటిపేరుగా నెహ్రూ (Nehru surname) ను ఉపయోగించరని ఎద్దేవా చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ (Jawahar lal Nehru) ముత్తాత అవుతారన్న విషయం తెలిసిందే. రాహుల్ (Rahaul Gandhi), ప్రియాంక (Priyanka Gandhi) ల నానమ్మ ఇందిరా గాంధీ తండ్రి జవహర్ లాల్ నెహ్రూ.

ట్రెండింగ్ వార్తలు

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

PM Modi criticises Gandhi's for not using Nehru surname: కానీ ఇంటిపేరు మాత్రం వాడుకోరు

వందల సంఖ్యలో ప్రభుత్వ పథకాలకు ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ (Jawahar lal Nehru) పేరును కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టాయని, కానీ, ఆయన ఇంటిపేరైన ‘నెహ్రూ’ ను మాత్రం తమ ఇంటిపేరుగా (Nehru surname) ఉపయోగించరని ప్రధాని మోదీ విమర్శించారు. సొంత తాత అయిన నెహ్రూ ఇంటి పేరు (Nehru surname) ఉపయోగించడానికి వారెందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ అధిష్టానంలో భాగమైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. ఒక న్యూస్ రిపోర్ట్ ను ఉటంకిస్తూ, ‘నెహ్రూ (Jawahar lal Nehru) పేరును ప్రభుత్వ పథకాలకు ఉపయోగించకపోతే కాంగ్రెస్ గందరగోళం సృష్టింస్తుంది. ఉద్యమాలు చేస్తుంది. కానీ వారి అగ్ర నేతలు తమ తాతగారైన నెహ్రూ (Jawahar lal Nehru) ఇంటిపేరును ఉపయోగించడానికి మాత్రం భయపడ్తారు. తమ ఇంటిపేరు నెహ్రూ (Nehru surname) అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గు? ’’ అని ప్రధాని మోదీ సోనియా గాంధీ కుటుంబంపై వ్యంగ్య ప్రశ్నలు చేశారు.

PM Modi criticises Indira Gandhi: భారతదేశం ఒక కుటుంబ ఎస్టేట్ కాదు..

భారత దేశం ఒక కుటుంబ ఆస్తి కాదని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేస్తూ, దశాబ్దాలుగా సామాన్య ప్రజల కష్టంపై దేశం ఎదిగిందన్నారు. రాష్ట్రాలను కూల్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi)నేనన్నారు. రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చడానికి ఆమె ఆర్టికల్ 356 ను 50 సార్లు ఉపయోగించిందన్నారు. తమ ప్రభుత్వం మాత్రం సహకార, పోటీదాయక సమాఖ్య విధానాన్ని అవలంబిస్తోందని వివరించారు. విపక్షాలు విసురుతున్న బురదలోనే కమలం వికసిస్తుందన్నారు.