తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mamata Says, Wont Pay Gst To Centre: `ఇలా అయితే, కేంద్రానికి జీఎస్టీ చెల్లించం!`

Mamata says, wont pay GST to Centre: `ఇలా అయితే, కేంద్రానికి జీఎస్టీ చెల్లించం!`

HT Telugu Desk HT Telugu

15 November 2022, 21:50 IST

  • Mamata says, wont pay GST to Centre: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ మరోసారి కేంద్రంపై కాలు దువ్వారు.

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ

Mamata says, wont pay GST to Centre: రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను కేంద్రం తొక్కి పెడుతోందని మమత ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్రం ఇవ్వాల్సిన నిధులను రాబట్టుకోవడం ఎలాగో తమకు తెలుసన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

Mamata says, wont pay GST to Centre: కక్ష సాధింపు

బీజేపీపై ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కక్ష సాధింపు ప్రారంభించిందని మమత బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్రం న్యాయంగా ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇలాగే, నిధులను నిలిపివేస్తే, తాము కూడా కేంద్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ మొత్తాన్ని నిలిపేస్తామని హెచ్చరించారు.

Mamata says, wont pay GST to Centre: మేమూ ఆపగలం..

పశ్చిమబెంగాల్ లోని ఝర్గామ్ లో గిరిజన నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మంగళవారం ముఖ్యమంత్రి మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ’‘వారు నిధులను నిలిపేశారు. రాష్ట్రాభివృద్ధికి నిధులను ఇవ్వబోమని బెదిరిస్తున్నారు. వారే కాదు, మనమూ బెదిరించగలం. మనమూ నిలిపేయగలం. మనం కూడా జీఎస్టీ చెల్లించడం ఆపేస్తాం’ అని మమత హెచ్చరించారు. ‘ఇదే విషయంపై గత ఏడాది ప్రధానిని కలిసి అభ్యర్థించాను. తన కాళ్లు పట్టుకోవాలని ఆయన కోరుకుంటున్నారా? అది ఎన్నటికీ జరగదు. మా డబ్బు మాకివ్వండి లేదా జీఎస్టీ ని ఆపేయండి. మా నిధులు మాకు ఇవ్వలేకపోతే అధికారం నుంచి వైదొలగండి’ అని మమత ప్రధానిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, ఉపాధి హామీ.. తదితర పథకాలకు సంబంధించిన నిధులను కేంద్రం రాష్ట్రానికి ఇవ్వడం లేదని గత కొన్నాళ్లుగా మమత ఆరోపిస్తున్నారు.