తెలుగు న్యూస్  /  National International  /  Watch: Pm Modi Unveils Logo, Theme And Website Of India's G20 Presidency

India's G20 presidency: డిసెంబర్ 1 నుంచి జీ 20కి భారత్ అధ్యక్షత

HT Telugu Desk HT Telugu

08 November 2022, 18:25 IST

  • India's G20 presidency: G20 కూటమి అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనుంది. డిసెంబర్ 1 నుంచి సంవత్సరం పాటు జీ 20 అధ్యక్ష దేశంగా భారత్ ఉంటుంది. 

ప్రధాని మోదీ
ప్రధాని మోదీ (HT_PRINT)

ప్రధాని మోదీ

India's G20 presidency: జీ 20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో, అందుకు సంబంధించిన లోగో, థీమ్, వెబ్ సైట్ లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచానికి భారత్ అందిస్తు్న్న సందేశాన్ని వీటిలో పొందుపర్చారు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

India's G20 presidency: విదేశాంగ శాఖ ప్రకటన

ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ప్రధాని మోదీ సమర్ధ నిర్దేశికత్వంలో అంతర్జాతీయ వేదికల నాయకత్వ బాధ్యతలను భారత్ చేపడుతోందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సమస్యలకు పరిష్కారం వెదికే దిశగా భారత్ కృషి చేస్తుందని తెలిపింది.

India's G20 presidency: భారత్ లో కార్యక్రమాలు

జీ 20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తరువాత దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను భారత్ చేపట్టనుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లో దాదాపు 32 వేర్వేరు రంగాలకు సంబంధించి సుమారు 200 సమావేశాలను నిర్వహించనుంది.

India's G20 presidency: 70 % జనాభా

జీ 20 సభ్య దేశాల జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు ఉంటుంది. అలాగే, మొత్తం ప్రపంచ జీడీపీలో 85%, మొత్తం గ్లోబల్ ట్రేడ్ లో 75% ఈ దేశాలనుంచే వస్తుంది. జీ 20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూఎస్ఏ, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. నవంబర్ 15, 16 తేదీల్లో ఇండోనేసియాలోని బాలిలో జీ 20 సదస్సు జరగనుంది.