తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Teacher Attacked By Parents : టీచర్​పై దాడి.. పరిగెత్తించి కొట్టిన తల్లిదండ్రులు

Teacher attacked by parents : టీచర్​పై దాడి.. పరిగెత్తించి కొట్టిన తల్లిదండ్రులు

Sharath Chitturi HT Telugu

22 March 2023, 17:07 IST

  • Teacher attacked by parents in Tamil Nadu : తమిళనాడులో ఓ టీచర్​పై దారుణమైన దాడి జరిగింది. బిడ్డను కొట్టాడన్న కారణంతోనే అతడిని పరిగెత్తించి కొట్టినట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. కానీ టీచర్​ ఆ విద్యార్థినిని కొట్టలేదని అధికారులు చెబుతున్నారు.

టీచర్​పై దాడి.. పరిగెత్తించి కొట్టిన తల్లిదండ్రులు
టీచర్​పై దాడి.. పరిగెత్తించి కొట్టిన తల్లిదండ్రులు

టీచర్​పై దాడి.. పరిగెత్తించి కొట్టిన తల్లిదండ్రులు

Teacher attacked by parents in Tamil Nadu : తమ బిడ్డను కొట్టాడన్న కారణంతో ఓ టీచర్​పై తల్లిదండ్రులు దాడికి దిగారు. తమిళనాడు టుటికోరన్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రులు.. టీచర్​ను పరిగెత్తించి మరీ కొట్టిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Unnatural intercourse: ‘‘భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం చేయడం రేప్ కిందకు రాదు’’ - ఎంపీ హైకోర్టు

NEET UG 2024: రేపే నీట్ యూజీ 2024 పరీక్ష; డ్రెస్ కోడ్ ఉంది, షూస్ వేసుకోవద్దు; గమనించండి..

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

ఇదీ జరిగింది..

సెల్వి, శివలింగం దంపతులకు ఓ 7ఏళ్ల కూతురు ఉంది. ఆమె 2వ తరగతి చదువుకుంటోంది. కాగా.. ఇటీవలే తల్లిదండ్రులు స్కూల్​కు వెళ్లారు. భరత్​ అనే టీచర్​పై దాడి చేశారు. అక్కడే ఉన్న వారు ఆ దృశ్యాలను వీడియో తీశారు.

Teacher attacked by parents : భరత్​ పరిగెడుతుండగా.. తనపై శివలింగం దాడి చేస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఓ సందర్భంలో.. రాయితోనూ దాడి చేశాడు శివలింగం. సెల్వి అన మహిళ.. టీచర్​ను తిట్టడం కూడా అందులో రికార్డ్​ అయ్యింది. "పిల్లలను కొట్టే హక్కు నీకెవ్వరు ఇచ్చారు? నీకు హక్కు లేదు. ఇప్పడు నేను నిన్ను చెప్పుతో కొడతాను," అని ఆ మహిళ గట్టిగా అరిచింది.

అక్కడే ఉన్న విద్యార్థులు, టీచర్లు.. ఈ ఘటనతో షాక్​కు గురయ్యారు. ఓ టీచర్​.. సాయం కోసం అరిచారు. కానీ ఫలితం దక్కలేదు.

Parents attacked teacher in Tamil Nadu : కొంతసేపటికి.. ఘటనాస్థలానికి పోలీసులు వెళ్లారు. అనంతరం సెల్వి, శివలింగంలను అరెస్ట్​ చేశారు. వీరితో పాటు చిన్నారి తాత మునుస్వాని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.

'టీచర్​.. బిడ్డను కొట్టలేదు!'

తమ బిడ్డపై టీచర్​ దాడి చేశాడన్న కోపంతో అతడిని కొట్టినట్టు తల్లిండ్రులు చెబుతున్నారు. అయితే.. టీచర్​ ఆ విద్యార్థినిని కొట్టలేదని అధికారులు చెబుతున్నారు.

Parents hit teacher for beating child : "7ఏళ్ల చిన్నారి క్లాస్​లో బాగా మాట్లాడుతోంది. అది గమనించిన టీచర్​.. ఆమెను వేరే చోట కూర్చోవాలని చెప్పాడు. ఆమె లేచి నడిచింది. ఈ క్రమంలోనే ఏదో తగిలి కిందపడిపోయింది. ఆ తర్వాత ఆమె ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లింది. టీచర్​ తనను కొట్టాడని తాతకు చెప్పింది. తాత, ఆ విషయాన్ని బిడ్డ తల్లిదండ్రులకు చెప్పాడు. వారిద్దరు స్కూల్​కు వచ్చి టీచర్​పై దాడి చేశారు," అని అధికారులు పేర్కొన్నారు.