తెలుగు న్యూస్  /  National International  /  Upsc Cmse 2022 Final Results Out, Check List Of Recommended Candidates

UPSC CMSE results: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీస్ పరీక్ష ఫలితాల వెల్లడి

HT Telugu Desk HT Telugu

02 June 2023, 21:11 IST

    • కంబైన్డ్ మెడికల్ సర్వీస్ (CMS) 2022 పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ (UPSC) శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.upsc.gov.in. లో చెక్ చేసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కంబైన్డ్ మెడికల్ సర్వీస్ (CMS) 2022 పరీక్ష ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ (UPSC) శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.upsc.gov.in. లో చెక్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

మొత్తం 629 మందిని..

కంబైన్డ్ మెడికల్ సర్వీస్ రాత పరీక్ష (పార్ట్ 1) ను 2022 జులై 17న నిర్వహించారు. ఆ తరువాత ఏప్రిల్, మే నెలల్లో పార్ట్ 1 లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ (పార్ట్ 2) ని నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైన వారి జాబితాను శుక్రవారం యూపీఎస్సీ విడుదల చేసింది. రెండు కేటగిరీల్లో వారిని రిక్రూట్ చేసుకోవాలని సూచిస్తూ ఆ జాబితాను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో అప్ లోడ్ చేశారు. కేటగిరీ 1 లో 307 మందిని, కేటగిరీ 2 లో 322 మందిని వివిధ సర్వీసుల్లో నియామకాలకు యూపీఎస్సీ సిఫారసు చేసింది.

రిజల్ట్ చెక్ చేసుకోవడం ఎలా?

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఫైనల్ ఫలితాలను అభ్యర్థులు upsc.gov.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అందుకు గానూ వారు

  • ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in. ను ఓపెన్ చేయాలి.
  • హోంపేజీపై కనిపిస్తున్న “Final Result - Combined Medical Services Examination, 2022” పై క్లిక్ చేయాలి.
  • స్క్రీన్ పై కనిపిస్తున్న పీడీఎఫ్ ఫైల్ లో రోల్ నంబర్ ఆధారంగా రిజల్ట్ ను చూసుకోవచ్చు.
  • భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ పేజీని డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి.
  • Direct link to check Final Result - Combined Medical Services Examination, 2022