తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Capital Punishment To Two For Minor Girl's Rape: ఇద్దరు రేపిస్ట్ లకు మరణశిక్ష

Capital punishment to two for minor girl's rape: ఇద్దరు రేపిస్ట్ లకు మరణశిక్ష

HT Telugu Desk HT Telugu

02 November 2022, 23:17 IST

  • Capital punishment to two for minor girl's rape: బాలికపై సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా హింసించిన ఇద్దరు రాక్షసులకు యూపీలోని ఒక కోర్టు మరణ శిక్ష విధించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Capital punishment to two for minor girl's rape: ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ లో ఉన్న POCSO Court అదనపు డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి బుధవారం ఈ తీర్పునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

Capital punishment to two for minor girl's rape: కేసు వివరాలు..

బాధిత బాలిక సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గత సంవత్సరం డిసెంబర్ 27న సాయంత్రం బాధిత బాలిక నవాబ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తమ ఇంటి నుంచి దగ్గర్లోని షాపునకు వెళ్లింది. అక్కడ ఆమెను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, దగ్గర్లోని రైల్వే ట్రాక్ పైకి తీసుకువెళ్లారు. అక్కడ ఆ పాపపై వారు సామూహిక అత్యాచారం చేసి, అనంతరం ఆమెను దారుణంగా హింసించారు. రాయితో ముఖంపై కొట్టి, తల పగలగొట్టారు. కంటిలో పదునైన చువ్వతో పొడిచారు. ఒక కాలును విరగ్గొట్టారు. ఆ తరువాత అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను అక్కడే వదిలేసి పారిపోయారు.

Capital punishment to two for minor girl's rape: ఆసుపత్రిలో చికిత్స

అనంతరం రైల్వే ట్రాక్ పక్కన ఆ బాలికను చూసిన స్థానికులు వెంటనే ఆమెను దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ బాలిక పరిస్థితి సీరియస్ గా ఉండడంతో అక్కడి వైద్యులు ఎస్ఆర్ఎన్ హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని సూచించారు.

Capital punishment to two for minor girl's rape: నిందితుల పేర్లు చెప్పిన బాలిక

కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆ బాలిక స్పృహలోకి వచ్చి తనపై అఘాయిత్యం చేసిన ముగ్గురి పేర్లను పోలీసులకు తెలిపింది. దాంతో, పోలీసులు నిందితులైన ఒయాసిమ్, రిజ్వాన్, హలీమ్ ఖర్బర్ లను అదుపులోకి తీసుకున్నారు. కేసు ను విచారించిన ప్రతాప్ గఢ్ POCSO Court న్యాయమూర్తి పంకజ్ కుమార్ శ్రీవాస్తవ్ బుధవారం తీర్పు వెలువరించారు. ఆ ముగ్గురిని దోషులుగా తేలుస్తూ, వారిలో రిజ్వాన్, హలీమ్ లకు మరణ శిక్ష విధించారు. మరో దోషి ఒయాసిమ్ మైనర్ కావడంతో ఆ కేసును జువైనైల్ కోర్టుకు బదిలీ చేశారు.