తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Student Dies At Lpu: ఎల్‌పీయూలో విద్యార్థి ఆత్మహత్య.. అట్టుడికిన వర్శిటీ

Student dies at LPU: ఎల్‌పీయూలో విద్యార్థి ఆత్మహత్య.. అట్టుడికిన వర్శిటీ

HT Telugu Desk HT Telugu

21 September 2022, 14:34 IST

    • ఫగ్వారా, సెప్టెంబర్ 21: పంజాబ్‌ రాష్ట్రంలో ఫగ్వారా ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈనేపథ్యంలో యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులు నిరసన తెలిపారు.
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ ముందు పోలీసుల బందోబస్తు
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ ముందు పోలీసుల బందోబస్తు (PTI)

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ ముందు పోలీసుల బందోబస్తు

కేరళకు చెందిన విద్యార్థి ఇక్కడి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పియు)లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ చదువుతున్నాడు. మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థి మృతి చెందినట్లు సివిల్ ఆసుపత్రి అధికారులు తెలిపారు. విద్యార్థి వదిలిపెట్టిన సూసైడ్ నోట్ ప్రకారం అతను కొన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నాడని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జస్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ కేసులో విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

‘మేం కేరళలోని విద్యార్థి కుటుంబానికి సమాచారం అందించాం. వారు ఇక్కడికి చేరుకున్న తర్వాత వారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసి తదుపరి చర్యను ప్రారంభిస్తాం..’ అని పోలీసు అధికారి తెలిపారు.

విద్యార్థి ఆత్మహత్య వార్త తెలియగానే ఇతర విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. విద్యార్థినీ విద్యార్థులు తమ హాస్టళ్ల నుండి బయటకు వచ్చి ‘మాకు న్యాయం కావాలి’ అని నినాదాలు చేయగా, యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. కాగా యూనివర్సిటీ క్యాంపస్‌లో పోలీసులను మోహరించారు.

ఎలాంటి వదంతులను నమ్మవద్దని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ లాల్ విశ్వాస్ బైన్స్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (జలంధర్ రేంజ్) ఎస్.భూపతి, కపుర్తలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నవనీత్ సింగ్ బెయిన్స్, ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే జర్నలిస్టులను యూనివర్సిటీ క్యాంపస్‌లోకి వెళ్లనివ్వలేదు.

జరిగిన సంఘటన దురదృష్టకరమైనదిగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ విచారం వ్యక్తం చేసింది.

‘పోలీసుల ప్రాథమిక దర్యాప్తు, ఆత్మహత్య నోట్‌లోని సారాంశం మృతుడి వ్యక్తిగత సమస్యలను ప్రస్తావిస్తోంది. తదుపరి విచారణ కోసం విశ్వవిద్యాలయం అధికారులకు పూర్తి సహాయాన్ని అందిస్తుంది..’ అని యూనివర్శిటీ తెలిపింది.

మొహాలీలోని చండీగఢ్ విశ్వవిద్యాలయంలో కామన్ వాష్‌రూమ్‌లో ఒక హాస్టలర్ మహిళా విద్యార్థినులకు సంబంధించి అభ్యంతరకర వీడియోలను రికార్డ్ చేశాడని విద్యార్థులు ఇటీవల నిరసనలకు దిగారు. ఇప్పుడు మరో యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగిన ఘటన చోటు చేసుకుంది.

టాపిక్