తెలుగు న్యూస్  /  National International  /  Stock Market Today June 27th, 2022 Latest Updates In Sensex And Nifty

Stock market today june 27th, 2022: స్టాక్ మార్కెట్ల దూకుడు..

27 June 2022, 9:17 IST

    • Stock market today june 27th, 2022: స్టాక్ మార్కెట్లు ఈనాడు సోమవారం దూకుడుగా ప్రారంభమయ్యాయి.
ఇండియన్ ఈక్విటీ మార్కెట్ సూచీలు (ఫైల్ ఫోటో)
ఇండియన్ ఈక్విటీ మార్కెట్ సూచీలు (ఫైల్ ఫోటో) (PTI)

ఇండియన్ ఈక్విటీ మార్కెట్ సూచీలు (ఫైల్ ఫోటో)

Stock market today june 27th, 2022: సోమవారం ఇండియన్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ (sensex today) నేడు ఉదయం మార్కెట్లు ప్రారంభంలో 599.41 పాయింట్లు పెరిగి 53,327 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే ఎన్‌ఎస్ఈ నిఫ్టీ (nifty today) నేడు 176 పాయింట్లు పెరిగి 15,883 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

సోమవారం టాప్ గెయినర్స్ (top gainers) జాబితాలో విప్రో, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ తదితర స్టాక్స్ నిలిచాయి. 

నేడు సోమవారం ఉదయం మార్కెట్ ప్రి ఓపెనింగ్ (pre market opening) సమయంలో సెన్సెక్స్ 740 పాయింట్లు 53468 పాయింట్ల వద్ద స్థిరపడింది. అదే సమయంలో నిఫ్టీ 226  పాయింట్లు పెరిగి 15,926 పాయింట్ల వద్ద స్థిరపడింది.

కాగా గత కొద్ది రోజులుగా వరుస నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్ గడిచిన వారంలో గురు, శుక్రవారం మదుపరులకు ఊరటనిచ్చాయి. శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ 1 శాతం లాభపడ్డాయి. ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్స్ అంతర్జాతీయ మార్కెట్లలో ట్రెండ్‌కు అనుగుణంగా ఉరకలెత్తాయి.

శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 462.26 పాయింట్లు ఎగబాకి 52,727.98 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 142.60 పాయింట్లు పెరిగి 15,699.25 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం రోజున మహీంద్రా అండ్ మహీంద్రా 4.28 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.59 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.58 శాతం, హిందుస్తాన్ యూనిలివర్ 2.3 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2 శాతం, భారతీ ఎయిర్ టెల్ 1.72 శాతం లాభపడ్డాయి.

శుక్రవారం రోజు నష్టపోయిన స్టాక్స్ జాబితాలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, విప్రో, సన్ ఫార్మా, తదితర స్టాక్స్ ఉన్నాయి.

టాపిక్