తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stock Market Today: లాభాల్లో స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 311 అప్

Stock market today: లాభాల్లో స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 311 అప్

HT Telugu Desk HT Telugu

04 August 2022, 9:18 IST

    • Stock market today: స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.
బుధవారం నాటి స్టాక్ మార్కెట్ సూచీలు
బుధవారం నాటి స్టాక్ మార్కెట్ సూచీలు (PTI)

బుధవారం నాటి స్టాక్ మార్కెట్ సూచీలు

Stock market today: స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరు సెషన్లు లాభాలను చవిచూశాయి. గురువారం ఉదయం కూడా స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

karnataka sslc result 2024: 10వ తరగతి ఫలితాలను డైరెక్ట్ లింక్ ద్వారా తెలుసుకోండి

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

సెన్సెక్స్ 311 పాయింట్లు పెరిగి 58,657 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 84.20 పాయింట్లు పెరిగి 17,472 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

టాప్ గెయినర్స్ జాబితాలో హిందాల్కో, ఇన్ఫోసిస్, యూపీఎల్, విప్రో, సిప్లా, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, బీపీసీఎల్ తదితర స్టాక్స్ ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో టాటా కన్జ్యూమర్స్, బ్రిటానియా, ఎస్‌బీఐ లైఫ్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ తదితర స్టాక్స్ ఉన్నాయి.

నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ఫిన్ సర్వీస్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ మీడియా తదితర సెక్టోరియల్ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

మార్కెట్ ప్రి ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 220.75 పాయింట్లు పెరిగి58,571.28 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 74.95 పాయింట్లు పెరిగి 17,463.10 పాయింట్ల వద్ద స్థిరపడింది.

కాగా బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వరుసగా 6 రోజులపాటు మదుపరులకు లాభాలను తెచ్చిపెట్టాయి. బుధవారం సెన్సెక్స్ 20.86, నిఫ్టీ 42.70 పాయింట్లు లాభపడింది.

ఇక రూపాయి విలువ డాలరుతో పోల్చితే బుధవారం 79.16 వద్ద క్లోజ్ అయ్యింది. నాలుగు వరుస సెషన్లలో 78.71కి ఎగబాకిన రూపాయి విలువ బుధవారం పడిపోయింది.

టాపిక్