తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stock Market Live : లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్డేట్స్​
స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్డేట్స్​ (REUTERS)

Stock market live : లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

22 July 2022, 16:32 IST

  • Stock market live : శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

22 July 2022, 16:32 IST

ఫ్లాట్‌గా రూపాయి విలువ

సానుకూల దేశీయ ఈక్విటీలు, తాజా విదేశీ నిధుల ఇన్‌ఫ్లో కారణంగా రూపాయి శుక్రవారం ఫ్లాట్‌గా స్థిరపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి డాలరుతో పోలిస్తే 79.90 వద్ద ఓపెన్ అయి 79.86 వద్ద స్థిరపడింది. క్రితం ముగింపుతో పోలిస్తే 1 పైస పతనమైంది.

22 July 2022, 15:39 IST

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 390.28 పాయింట్లు లాభపడి 56,072.23 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 114.20 పాయింట్లు పెరిగి 16,719.45 పాయింట్ల వద్ద ముగిసింది.

22 July 2022, 15:39 IST

సెన్సెక్స్ 382 పాయింట్లు అప్..

శుక్రవారం మధ్యాహ్నం 2.52 సమయంలో సెన్సెక్స్ 382 పాయింట్లు లాభపడి 56,064 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 116 పాయింట్లు లాభపడి 16,721 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

22 July 2022, 14:27 IST

Coforge Q1 లాభం 21 శాతం

జూన్ 30, 2022తో ముగిసిన మొదటి త్రైమాసికంలో ఐటీ కంపెనీ కోఫోర్జ్ శుక్రవారం పన్ను తర్వాత ఏకీకృత లాభం 21.1 శాతం పెరిగి రూ.149.7 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 123.6 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. Coforge స్థూల ఆదాయం 25.2 శాతం పెరిగి రూ.1,829.4 కోట్లకు చేరుకుంది. గత ఏడాది జూన్ త్రైమాసికంలో రూ.1,461.6 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం ఆర్డర్ బుక్ తదుపరి 12 నెలల్లో సుమారు రూ. 5,953 కోట్లుగా ఉంది.  2022 మార్చి 31 చివరినాటికి 22,500గా ఉన్న కంపెనీ గ్లోబల్ హెడ్‌కౌంట్ జూన్ 30, 2022 నాటికి 22,742కి పెరిగింది. అయితే కంపెనీలో అట్రిషన్ 18 శాతంగా ఉంది.

22 July 2022, 11:28 IST

ద్రవ్యోల్భణం ఆధారంగా వడ్డీ రేట్లు

ద్రవ్యోల్భణం పెరుగుదల ప్రాతిపదిక వడ్డీ రేట్ల నిర్ణయంలో కీలకంగా ఉంటుందని, పాలసీ మానిటరింగ్ కమిటీ దీనిపై రీసెర్చ్ చేస్తోందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాం దాస ప్రకటించారు. ఆయన వార్షిక బ్యాంకింగ్ కాంక్లేవ్‌లో మాట్లాడారు.

22 July 2022, 11:25 IST

7 పైసల మేర బలహీనపడ్డ రూపాయి

శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో US డాలర్‌తో రూపాయి విలువ 7 పైసలు క్షీణించి 79.92 వద్దకు చేరుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ వద్ద రూపాయి 79.90 వద్ద ప్రారంభమైంది. క్రితం ముగింపులో 7 పైసల క్షీణతను నమోదు చేసింది.

22 July 2022, 11:01 IST

SENSEX: 73 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్న సెన్సెక్స్

ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 73.74 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టీ 50 27.30 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 0.83 శాతం లాభాల్లో ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

22 July 2022, 10:07 IST

Indus Ind Bank: నిన్న 8 శాతం పెరిగిన ఇండస్‌ఇండ్ బ్యాంక్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో ఏడాది ప్రాతిపదికన 61 శాతం వృద్ధిని నమోదు చేయడంతో ఇండస్‌ఇండ్ బ్యాంక్ గురువారం దాదాపు 8 శాతం పెరిగింది. బిఎస్‌ఇలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.88 శాతం పెరిగి రూ. 948.15కు చేరుకుంది. అయితే శుక్రవారం ఉదయం ఇండస్‌ఇండ్ స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 1,631 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 1,016 కోట్లతో పోలిస్తే, ఏడాది ప్రాతిపదికన 61 శాతం వృద్ధిని నమోదు చేసింది.

22 July 2022, 10:04 IST

JSW Energy q1 results: జేఎస్‌డబ్ల్యూ నికర లాభంలో పెరుగుదల

అధిక రాబడుల నేపథ్యంలో జూన్ త్రైమాసికంలో నికర లాభం 179 శాతం పెరిగి రూ. 560 కోట్లకు చేరిందని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తెలిపింది.  ‘పన్ను తర్వాత లాభం (PAT) రూ. 560 కోట్లుగా ఉంది. గత సంవత్సరం (ఏప్రిల్-జూన్ 2021) కాలంలో రూ. 201 కోట్ల PATతో పోల్చితే, ఇది 179 శాతం ఎక్కువ’ అని కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 68 శాతం పెరిగింది.

22 July 2022, 10:04 IST

IDBI Q1 results: ఐడీబీఐ నికర లాభం పెరుగుదల

ఐడీబీఐ క్యూ 1 లో మెరుగైన ఫలితాలు ప్రకటించింది. నికర లాభంలో పెరగుదల నమోదు చేసింది. ఈ నేపథ్యంలో స్టాక్ శుక్రవారం లాభాల్లో ట్రేడవుతోంది.

22 July 2022, 9:56 IST

Nifty finserve: లాభాల్లో నిఫ్టీ ఫిన్‌సర్వ్

సెక్టోరియల్ సూచీల్లో నిఫ్టీ ఫిన్‌సర్వ్ లాభాల్లో ఉంది. అలాగే నిఫ్టీ ఆటో, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ప్రయివేట్ బ్యాంక్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

22 July 2022, 9:56 IST

Nifty IT: నష్టాల్లో నిఫ్టీ ఐటీ సూచీ

నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 1 శాతం నష్టాల మధ్య ట్రేడవుతోంది. అలాగే నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఇన్‌ఫ్రా, నిఫ్టీ పీఎస్ఈ, నిఫ్టీ హెల్త్‌కేర్, నిఫ్టీ ఆయల్ గ్యాస్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

22 July 2022, 9:56 IST

Top Losers list: అత్యధిక నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్స్

Top Losers list: అత్యధిక నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్స్‌లో ఇన్ఫోసిస్, విప్రో, ఓఎన్జీసీ, హెచ్‌సీఎల్ టెక్, అపోలో హాస్పిటల్, టెక్ మహీంద్రా, టాటా కన్జ్యూమర్స ప్రొడక్ట్స్, లార్సెన్, ఎన్టీపీసీ, టీసీఎస్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, గ్రాసిమ్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఉన్నాయి.

22 July 2022, 9:56 IST

Top Gainers: అత్యధిక లాభాల్లో ట్రేడవుతున్న షేర్లు

Top Gainers: అత్యధిక లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్స్‌లో యూపీఎల్, బ్రిటానియా, కోటక్ మహీంద్రా, ఐచర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటన్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రా టెక్ సిమెంట్, నెస్లే, హెచ్‌యూఎల్, సిప్లా, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, టాటా మోటార్స్, రిలయన్స్, అదానీ పోర్ట్స్ తదితర స్టాక్స్ ఉన్నాయి.

22 July 2022, 9:22 IST

లాభాలు.. నష్టాలు..

బజాజ్​ఫిన్​సర్వ్​, టెక్​ఎం, హెచ్​సీఎల్​టెక్​, పవర్​ గ్రిడ్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఎల్​ అండ్​ టీ షేర్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

22 July 2022, 9:19 IST

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 217పాయింట్లు వృద్ధి చెంది 55,899 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 71పాయింట్ల లాభంతో 16,676 వద్ద ట్రేడ్​ అవుతోంది.

22 July 2022, 8:56 IST

త్రైమాసిక ఫలితాలు..

రానున్న మూడు రోజుల్లో కీలకమైన సంస్థలు తమ త్రైమాసిక ఫలితాలను వెలవడించనుంది. రిలయన్స్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, బందన్​ బ్యాంక్​, కోఫోర్జ్​, ఐసీఐసీ బ్యాంక్​, కొటాక్​ మహీంద్ర బ్యాంక్​, యెస్​ బ్యాంక్​ ఫలితాలు వెలువడనున్నాయి.

22 July 2022, 8:55 IST

ఆసియా మార్కెట్లు..

ఆసియా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. జపాన్​ ద్రవ్యోల్బణం డేటా వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లు ప్రతికూలంగా మారాయి. జపాన్​ నిక్కీ 0.36శాతం పతనమైంది. ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.12శాతం నష్టపోయింది. సౌత్​ కొరియా కాస్పి సైతం నష్టాల్లోనే ఉంది.

22 July 2022, 8:49 IST

అమెరికా మార్కెట్లు ఇలా..

అమెరికా స్టాక్​ మార్కెట్లు గురువారం కూడా లాభాల్లోనే ముగిశాయి. టెస్లాతో పాటు టెక్​ స్టాక్స్​ కూడా పుంజుకోవడంతో లాభాలు వచ్చాయి. నాస్​డాక్​ 1.4శాతం వృద్ధిచెందింది. ఎస్​ అండ్​ పీ 500 0.9శాతం, డౌ జోన్స్​ 0.5శాతం లాభాలను గడించాయి.

22 July 2022, 8:44 IST

గురువారం ఇలా..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో సెన్సెక్స్​.. 284పాయింట్ల లాభంతో 55,682 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 84.5పాయింట్లు వృద్ధి చెంది 16,605 వద్ద ముగిసింది.

22 July 2022, 8:12 IST

స్టాక్స్​ టు బై..

దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు.. దేశీయంగా ఉన్న సంస్థల త్రైమాసిక ఫలితాలు.. సానుకూలతలకు కారణాలుగా నిలుస్తున్నాయి. ఇక ట్రేడర్లు.. శుక్రవారం తమ ట్రేడింగ్​ లిస్ట్​లో పెట్టుకోవాల్సిన స్టాక్స్​ను నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

22 July 2022, 8:10 IST

పాజిటివ్​ ఓపెనింగ్​

దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ఆరంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. 41పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

    ఆర్టికల్ షేర్ చేయండి