ట్రేడర్స్ లిస్ట్‌లో ఉండాల్సిన నేటి స్టాక్స్ ఇవే!
Stocks to Watch : ట్రేడర్స్ లిస్ట్‌లో ఉండాల్సిన నేటి స్టాక్స్ ఇవే!
Stocks to Watch : స్టాక్ మార్కెట్ ట్రేడర్లు.. తమ ట్రేడింగ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్స్ ఇవే.
Stocks to Watch : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు.. దేశీయంగా ఉన్న సంస్థల త్రైమాసిక ఫలితాలు.. సానుకూలతలకు కారణాలుగా నిలుస్తున్నాయి. ఇక ట్రేడర్లు.. శుక్రవారం తమ ట్రేడింగ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్స్‌ను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..
ట్రెండింగ్ వార్తలు
- జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ: త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ. నెట్ ప్రాఫిట్.. 179శాతం పెరిగి రూ. 560కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో పాట్ రూ . 201కోట్లుగా ఉంది. కాగా.. రెవెన్యూ మాత్రం 68శాతం వృద్ధి చెంది రూ. 3,115కోట్లకు చేరింది.
- బయోకాన్:- తెలంగాణలోని బయోకాన్ మేన్యూఫ్యాక్చరింగ్ ప్లాంట్‌పై తనిఖీలు నిర్వహించిన యూఎస్ హెల్త్ రెగ్యులేటరీ బృందం.. మూడు అబ్జర్వేషన్లను జారీ చేసింది. రానున్న రోజుల్లో వాటిని పరిష్కరిస్తామని బయోకాన్ వెల్లడించింది. ఔషధాల తయారీ, ప్లాంట్లలో లోపాలు ఉంటే అబ్జర్వేషన్లు ఇస్తారు.
- ఆర్బీఎల్ బ్యాంక్:- ఆర్బీఎల్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ రూ. 208.66కోట్లుగా ఉంది. గతేడాది అదే త్రైమాసికానికి అది రూ. 462.25కోట్లు! పాట్ రూ. 201.16కోట్లుగా ఉంది.
- ఐసీఐసీఐ సెక్యూరిటీస్:- ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నెట్ ప్రాఫిట్ 12శాతం పడిపోయి.. రూ. 273కోట్లు వద్ద నిలిచింది. రెవెన్యూ రూ. 795కోట్లుగా ఉంది. ఈక్విటీస్ నుంచి వచ్చే రెవెన్యూ.. 17శాతం పడిపోయింది.
- రిలయన్స్:- ఇటలీకు చెందిన వాలెంటీనో సంస్థతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం.. వాలెంటీనో బొటెక్ను ఢిల్లీలో ఏర్పాటు చేస్తుంది రిలయన్స్. అనంతరం దానిని ముంబైకు విస్తరిస్తుంది. మహిళల దుస్తుల నుంచి.. అన్ని రకాల బ్రాండ్లు ఆ షోరూమ్స్‌లో ఉంటాయి.
- ఇమానీ:- పెంపుడు జంతువుల సంరక్షణ స్టార్ట్అప్ కానిస్ లూపస్ సర్వీసెస్‌లో 30శాతం వాటాను కొనుగోలు చేసింది ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఇమానీ. 'ఫుల్ బాల్ స్టోరీ' బ్రాండ్ పేరుతో.. దేశవ్యాప్తంగా పెంపుడు జంతువులకు ఆయుర్వేద ఔషధాలు అందిస్తుంది ఆ సంస్థ.
- ఐడీబీఐ బ్యాంక్:- ఐడీబీఐ బ్యాంక్ స్టాండెలోన్ పాట్ 25శాతం వృద్ధి చెంది రూ. 756కోట్లకు చేరింది. అసెట్ క్వాలిటీ, రికవరీలు పెరిగాయి. అదే సమయంలో ప్రొవిజనింగ్ తగ్గింది. స్టాండెలోన్ నెట్ ప్రాఫిట్ రూ. 603కోట్లుగా ఉంది.
- ఎన్డీటీవీ:- ఎన్డీటీవీ ప్రోమోటర్లు ప్రనయ్ రాయ్, రాధిక రాయ్‌పై సెబీ వేసిన పెనాల్టీని రూ. 25కోట్ల నుంచి రూ. 5కోట్లకు తగ్గించింది సాట్(సెక్యూరిటీస్ అపిలెట్ ట్రిబ్యునల్). అప్పులపై జరిగిన ఒప్పందాన్ని బయట పెట్టలేదని ఎన్డీటీవీపై ఆరోపణలు ఉన్నాయి.
- ఎన్సీఎల్ ఇండియా:- తమిళనాడులో మైనింగ్, పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు రూ. 14,944.91కోట్ల పెట్టుబడికి బోర్డు ఆమోద ముద్ర వేసింది. బొగ్గుశాఖ పరిధిలోని ఈ సంస్థ.. వివిధ మైనింగ్, విద్యుత్ ప్రాజెక్టుల్లో రూ. 43వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
(గమనిక: ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ట్రేడింగ్ విషయంలో సొంత ఎనాలసిస్ ఉండటం ఉత్తమం.)
సంబంధిత కథనం