తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sonia Gandhi: ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

Sonia Gandhi: ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

HT Telugu Desk HT Telugu

03 March 2023, 15:19 IST

  • కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, సీనియర్ నేత సోనియాగాంధీ (Sonia Gandhi)ని గురువారం ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

సోనియా గాంధీ (ఫైల్ ఫొటో)
సోనియా గాంధీ (ఫైల్ ఫొటో) (HT_PRINT)

సోనియా గాంధీ (ఫైల్ ఫొటో)

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, సీనియర్ నేత సోనియాగాంధీ (Sonia Gandhi) శుక్రవారం స్వల్పంగా అస్వస్థతకు లోనయ్యారు. దాంతో, ఆమెను వెంటనే ఢిల్లీ లోని గంగారామ్ హాస్పిటల్ (Ganga Ram hospital) లో జాయిన్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

Sonia Gandhi admitted to hospital: జ్వరం రావడంతో..

జ్వరం రావడంతో సోనియాగాంధీని గురువారం ఆమె రెగ్యులర్ గా చికిత్స పొందే గంగారామ్ ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్యులు చికిత్స ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. సోనియాగాంధీ (Sonia Gandhi) ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ బులెటిన్ లో వెల్లడించారు. గంగారామ్ ఆసుపత్రిలోని ఛాతి వ్యాధుల విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఆరుప్ బసు నేతృత్వంలోని వైద్యుల బృందం సోనియా గాంధీకిి చికిత్స అందిస్తున్నారని సర్ గంగారామ్ హాస్పిటల్ ట్రస్ట్ సొసైటీ చైర్మన్ డీఎస్ రాణా వెల్లడించారు.