తెలుగు న్యూస్  /  National International  /  Sania Mirza Will Be Countrys First Muslim Woman To Become A Fighter Pilot

first Muslim woman fighter pilot: తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌ సానియా మీర్జా

HT Telugu Desk HT Telugu

23 December 2022, 8:21 IST

    • first Muslim woman fighter pilot: తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌‌గా మీర్జాపూర్ యువతి సానియా మీర్జా ఎంపికైంది.
ఫైటర్ పైలెట్‌ శిక్షణకు ఎంపికైన సానియా మీర్జా
ఫైటర్ పైలెట్‌ శిక్షణకు ఎంపికైన సానియా మీర్జా

ఫైటర్ పైలెట్‌ శిక్షణకు ఎంపికైన సానియా మీర్జా

మీర్జాపూర్, డిసెంబర్ 23: మీర్జాపూర్‌కు చెందిన ఒక టీవీ మెకానిక్ కుమార్తె సానియా మీర్జా భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా ఎంపికైంది. ఇలా ఎంపికైన వారిలో ఈమె దేశంలోనే మొదటి ముస్లిం యువతి. అలాగే యూపీ నుంచి మొదటి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ కావడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

సానియా మీర్జా మిర్జాపూర్ దేహత్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జసోవర్ గ్రామ నివాసి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఆమె ఈ ఘనతను సాధ్యం చేసింది. ఆమె జిల్లాకే కాకుండా రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది.

హిందీ మీడియం విద్యార్థులు కూడా దృఢ సంకల్పంతో విజయం సాధిస్తారని హిందీ మీడియం స్కూల్‌లో చదివిన సానియా తెలిపింది. డిసెంబరు 27న ఆమె పూణెలోని ఎన్డీయే-ఖడక్వాస్లాలో చేరనున్నారు. తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కూడా ఆమెను చూసి గర్వపడుతున్నారు.

సానియా తండ్రి షాహిద్ అలీ మాట్లాడుతూ.. ‘దేశంలో తొలి ఫైటర్ పైలట్ అవనీ చతుర్వేదిని సానియా మీర్జా తన రోల్ మోడల్‌గా భావిస్తుంది.. మొదటి నుంచి తనలాగే ఉండాలనుకుంది.. ’ అని చెప్పారు.

ఆమె 10వ తరగతి వరకు గ్రామంలోనే పండిట్ చింతామణి దూబే ఇంటర్ కళాశాలలో చదివింది. ఆ తర్వాత నగరంలోని గురునానక్ బాలికల ఇంటర్ కాలేజీకి వెళ్లింది. ఆమె 12వ తరగతిలో జిల్లా టాపర్‌గా నిలిచింది.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2022 పరీక్షలో ఫైటర్ పైలట్‌లో మహిళలకు కేవలం రెండు సీట్లు మాత్రమే రిజర్వ్ అయ్యాయని ఆమె చెప్పారు. ‘నేను మొదటి ప్రయత్నంలో సీటు సాధించలేకపోయాను. కానీ నా రెండో ప్రయత్నంలో నాకు చోటు దొరికింది..’ అని సానియా మీర్జా చెప్పారు.

సానియా తల్లి తబస్సుమ్ మీర్జా మాట్లాడుతూ ‘మా కుమార్తె మమ్మల్ని, మొత్తం గ్రామాన్ని గర్వించేలా చేసింది. గ్రామంలోని ప్రతి అమ్మాయి వారి కలలను అనుసరించేలా ఆమె స్ఫూర్తినిచ్చింది…’ అని సంతోషం వ్యక్తంచేశారు.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2022 పరీక్షలో పురుషులు, మహిళలకు కలిపి మొత్తం 400 సీట్లు ఉన్నాయి. ఇందులో మహిళలకు 19 సీట్లు ఉండగా, ఫైటర్ పైలట్‌లకు రెండు సీట్లు రిజర్వు అయి ఉన్నాయి. ఈ రెండు సీట్లలో సానియా తన ప్రతిభతో స్థానం సంపాదించుకోగలిగింది.

టాపిక్