తెలుగు న్యూస్  /  National International  /  Rupee Falls 11 Paise To Record Low Of 77.85 Against Us Dollar On 10th June 2022

Dollar to Inr : రూపాయి ఆల్‌టైమ్ రికార్డు.. 77.85కు పతనం

HT Telugu Desk HT Telugu

10 June 2022, 16:44 IST

  • డాలరుతో పోల్చితే రూపాయి జీవితకాలపు కనిష్టానికి పతనమైంది.

రూపాయి విలువ జీవితకాలపు కనిష్టానికి పతనం
రూపాయి విలువ జీవితకాలపు కనిష్టానికి పతనం (REUTERS)

రూపాయి విలువ జీవితకాలపు కనిష్టానికి పతనం

ముంబై, జూన్ 10: దేశీయ ఈక్విటీలలో అమ్మకాలు, డాలర్ బలోపేతం.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపడంతో శుక్రవారం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు పతనమై తాజాగా జీవితకాలపు కనిష్ట స్థాయి 77.85 వద్ద ముగిసింది.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Manipur news: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై కుకీ మిలిటెంట్ల దాడి; ఇద్దరు జవాన్లు మృతి

విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోవడం, పెరిగిన అంతర్జాతీయ ముడి చమురు ధరలు.. దేశీయ కరెన్సీపై ప్రభావం చూపాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు.

ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారకపు మార్కెట్‌లో స్థానిక కరెన్సీ రూపాయి 77.81 వద్ద ప్రారంభమైంది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే ఇంట్రా-డే గరిష్టంగా 77.79ని, కనిష్టంగా 77.87స్థాయిని తాకింది.

రూపాయి చివరకు క్రితం రోజు ముగింపు 77.74 కంటే 11 పైసలు తగ్గి 77.85 వద్ద ఆల్-టైమ్ కనిష్ట స్థాయి వద్ద స్థిరపడింది.

‘బలహీనమైన స్థూల గణాంకాలు, బలమైన డాలర్ ఇండెక్స్ మధ్య భారతీయ రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. విదేశీ పెట్టుబడిదారులు డాలర్‌ల కోసం పరుగెత్తుతున్న కొద్దీ రూపాయి కొత్త రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది..’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ చెప్పారు.

‘డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 77.50 నుండి 78.30 పరిధిలో కన్సాలిడేట్ అవుతుందని అంచనా వేస్తున్నారు’ అని ఆయన చెప్పారు. కాగా డాలర్ ఇండెక్స్ 0.20 శాతం పెరిగి 103.43కి చేరుకుంది.

ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.51 శాతం పెరిగి 123.70 డాలర్లకు చేరుకుంది.

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,016.84 పాయింట్లు (1.84 శాతం ) క్షీణించి 54,303.44 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 276.30 పాయింట్లు (1.68 శాతం) తగ్గి 16,201.80 వద్ద ముగిసింది.

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం క్యాపిటల్ మార్కెట్‌లో నికర అమ్మకందారులుగా ఉన్నారు. రూ. 1,512.64 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.