తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'Maa Bharati Ke Sapoot' : అమర జవాన్ల కుటుంబాలకు సాయం చేయడం కోసం ఒక వెబ్ సైట్

'Maa Bharati Ke Sapoot' : అమర జవాన్ల కుటుంబాలకు సాయం చేయడం కోసం ఒక వెబ్ సైట్

HT Telugu Desk HT Telugu

14 October 2022, 22:50 IST

    • website for citizens to contribute to martyrs' families: యుద్ధం, ఇతర పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన సాయుధ దళాల సైనికుల కుటుంబాలకు సాధారణ పౌరులు సాయం అందించాలనుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
‘మా భారత్ కే సపూత్’ పోర్టల్ ను ప్రారంభిస్తున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్
‘మా భారత్ కే సపూత్’ పోర్టల్ ను ప్రారంభిస్తున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ (source: Twitter/@rajnathsingh)

‘మా భారత్ కే సపూత్’ పోర్టల్ ను ప్రారంభిస్తున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్

సాయుధ పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన త్రివిధ దళాల సైనికులకు సాధారణ పౌరులు ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా ఒక వెబ్ సైట్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

website for citizens to contribute to martyrs' families: మా భారత్ కే సపూత్(Maa Bharati Ke Sapoot- MBKS)

మా భారత్ కే సపూత్ (Maa Bharati Ke Sapoot) పేరుతో ఈ పోర్టల్ ను రూపొందించారు. Armed Forces Battle Casualties Welfare Fund (AFBCWF)లో భాగంగా ఈ పోర్టల్ పని చేస్తుంది. త్రివిధ దళాల్లోని సైనికులు కార్యక్షేత్రంలో మరణిస్తే.. వారి కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు.

website for citizens to contribute to martyrs' families: సాధారణ పౌరులు కూడా..

ఈ Maa Bharati Ke Sapoot పోర్టల్ ను శుక్రవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ వెబ్ సైట్లోకి వెళ్లి సాధారణ పౌరులు కూడా సాయుధ దళాల్లోని అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించవచ్చు. AFBCWF త్రివిధ దళాల్లోని సైనికులు యుద్ధంలో మరణించినా, తీవ్రంగా గాయపడినా, వెంటనే వారికి ఆర్థిక సాయం అందించడం కోసం ఏర్పాటైంది. ఈ ఫండ్ కు ఆర్థిక సాయం అందించాలని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక వీడియో సందేశంలో కోరారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ గుడ్ విల్ అంబాసడర్ గా ఉన్నారు.