తెలుగు న్యూస్  /  National International  /  Rail Coach Factory Apprentice Recruitment 2023: Apply For 550 Posts

Rail Coach Factory Recruitment 2023: రైల్ కోచ్ ఫాక్టరీలో అప్రెంటిస్ ఉద్యోగాలు

HT Telugu Desk HT Telugu

07 February 2023, 21:40 IST

  • Rail Coach Factory Recruitment 2023: అప్రెంటిస్ ఉద్యోగాల కోసం రైల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 550 అప్రెంటిస్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్ కోచ్ ఫాక్టరీ భర్తీ చేయనున్నది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rail Coach Factory Recruitment 2023: కపుర్తల లోని రైల్ కోచ్ ఫాక్టరీ (Rail Coach Factory, RCF) లో అప్రెంటిస్ (Apprentice) ఉద్యోగాల (jobs) కోసం నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో rcf.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Rail Coach Factory Recruitment 2023: లాస్ట్ డేట్ మార్చ్ 4

ఈ అప్రెంటిస్ (Apprentice) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 4. ఆ లోపు అర్హత కలిగిన, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ rcf.indianrailways.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 550 పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వాటిలో

  • 215 ఫిట్టర్ (Fitter) పోస్ట్ లు
  • 230 వెల్డర్ (Welder) పోస్ట్ లు
  • 5 మెకానిక్ (Machinist) పోస్ట్ లు
  • 5 పెయింటర్ (Painter) పోస్ట్ లు
  • 5 కార్పెంటర్ (Carpenter) పోస్ట్ లు
  • 75 ఎలక్ట్రీషియన్ (Electrician) పోస్ట్ లు
  • 15 ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్ (AC & Ref. Mechanic) పోస్ట్ లు ఉన్నాయి.

Rail Coach Factory Recruitment 2023: విద్యార్హతలు

ఈ (Apprentice) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు rcf.indianrailways.gov.in వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు చెక్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ (metriculation) లేదా తత్సమాన పరీక్ష కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. అప్లై చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన ట్రేడ్ లో ఐటీఐ (ITI) పూర్తి చేసి ఉండాలి. వారి వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది. 10వ తరగతి, ఐటీఐ (ITI) లలో వచ్చిన మార్కుల ఆధారంగా, మెరిట్ ప్రాతిపదికన నియామకం ఉంటుంది. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును ఆన్ లైన్ మోడ్ లోనే చెల్లించాల్సి ఉంటుంది.

టాపిక్