Government Jobs: కేంద్ర ప్రభుత్వ స్కూళ్లు, యూనివర్సిటీల్లో 58,000 పోస్టులు ఖాళీ: పూర్తి వివరాలివే-around 58000 teaching non teaching post vacant in kendriya vidyalaya navodaya schools central universities iits nits and more ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Around 58000 Teaching Non Teaching Post Vacant In Kendriya Vidyalaya Navodaya Schools Central Universities Iits Nits And More

Government Jobs: కేంద్ర ప్రభుత్వ స్కూళ్లు, యూనివర్సిటీల్లో 58,000 పోస్టులు ఖాళీ: పూర్తి వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 06, 2023 10:20 PM IST

58,000 Teaching, Non-teaching post: కేంద్రీయ విద్యాలయ, నవోదయ స్కూళ్లు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వం నడిపే మిగిలిన విద్యాసంస్థల్లో ప్రస్తుతం 58,000కు పైగా ఉద్యోగ (Government Jobs) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

Government Jobs: కేంద్ర ప్రభుత్వ స్కూళ్లు, యూనివర్సిటీల్లో 58,000 పోస్టుల ఖాళీలు
Government Jobs: కేంద్ర ప్రభుత్వ స్కూళ్లు, యూనివర్సిటీల్లో 58,000 పోస్టుల ఖాళీలు (Mint)

Government Jobs vacancy: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, యూనివర్సిటీల్లో ప్రస్తుతం 58,000కుపైగా టీచింగ్ (Teaching Post), నాన్-టీచింగ్ (Non-Teaching Post) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయాలు (Kendriya Vidyalayas), జవహర్ నవోదయ విద్యాలయాలు (Jawahar Navodaya Vidyalayas), ఐఐటీలు (IITs), ఎన్‍ఐటీ(NITs)లతో పాటు మరిన్ని కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వెల్లడించింది. లోక్‍సభలో ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానంగా ఉద్యోగ ఖాళీల వివరాలను వెల్లడించారు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ (Subhash Sarkar). విద్యాసంస్థల వారీగా ఖాళీల వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Job vacancies: పాఠశాలలు, యూనివర్సిటీల్లో ఖాళీల వివరాలు

  • కేంద్రీయ విద్యాలయాల్లో 12,099 టీచింగ్, 1,312 నాన్-టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  • జవహర్ నవోదయ విద్యాలయాల్లో 3,271 టీచింగ్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. రెసిడెన్షియల్ స్కూళ్లలో 1,756 నాన్ టీచింగ్ పోస్టులు వేకెంట్‍గా ఉన్నాయి.
  • ఉన్నత విద్యాసంస్థలైన, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో (Central Universities)ల్లో 6,180 టీచింగ్, 15,780 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.
  • ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs)ల్లో 4,425 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5,052 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి సిద్దం ఉన్నాయి.
  • నేషనల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITs), ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీల్లో 2,089 టీచింగ్, 3,773 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా కొనసాగుతున్నాయి.
  • ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్& రీసెర్చ్ విద్యాసంస్థల్లో 353 టీచింగ్, 625 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  • ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‍మెంట్ (IIMs)ల్లో 1,050 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Government Job vacancies: పదవీ విరమణలు, పదోన్నతులు, అదనపు అవసరాల కారణంగా విద్యాసంస్థల్లో ఈ పోస్టుల ఖాళీలు ఏర్పడినట్టు కేంద్రమంత్రి సుభాష్ సర్కార్ చెప్పారు. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు.

త్వరలోనే విడతల వారీగా ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.

బోధనకు ఇబ్బంది లేకుండా కేంద్రీయ విద్యాలయాల్లో, నవోదయ విద్యాలయాల్లో కొందరు టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించినట్టు తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం