SSC Notification: 11వేల ఉద్యోగాల భర్తీకి ఎస్‍ఎస్‍సీ నోటిఫికేషన్.. అప్లికేషన్స్ కూడా మొదలు.. పదో తరగతి అర్హతతో..-ssc mts havaldar 2022 notification registration process started apply for over 11000 vacancies ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ssc Notification: 11వేల ఉద్యోగాల భర్తీకి ఎస్‍ఎస్‍సీ నోటిఫికేషన్.. అప్లికేషన్స్ కూడా మొదలు.. పదో తరగతి అర్హతతో..

SSC Notification: 11వేల ఉద్యోగాల భర్తీకి ఎస్‍ఎస్‍సీ నోటిఫికేషన్.. అప్లికేషన్స్ కూడా మొదలు.. పదో తరగతి అర్హతతో..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 19, 2023 03:47 PM IST

SSC MTS, Havildar Notification: ఎంటీఎస్ (నాన్ టెక్నికల్), హవాల్దార్ (సీబీఐసీ&సీబీఎన్) పోస్టుల భర్తీకి ఎస్‍ఎస్‍సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 11వేలకు పైగా పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. పూర్తి వివరాలు ఇవే.

SSC MTS, Havildar Notification: 11వేల ఉద్యోగాల భర్తీకి ఎస్‍ఎస్‍సీ నోటిఫికేషన్..
SSC MTS, Havildar Notification: 11వేల ఉద్యోగాల భర్తీకి ఎస్‍ఎస్‍సీ నోటిఫికేషన్..

SSC MTS, Havildar Notification: 11వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (Staff Selection Commission) నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం మల్టీ టాస్కింగ్‍ స్టాఫ్ (MTS - నాన్ టెక్నికల్)తో పాటు హవల్దార్ పరీక్షలకు నోటిఫికేషన్ (Multi-Tasking Staff, Havaldar Examination, 2022) వెల్లడించింది. 10,880 మల్టీటాస్కింగ్ స్టాఫ్ (Multi Tasking Staff) పోస్టులు, సీబీఐసీ, సీబీఎన్‍లో 529 హవల్దార్ పోస్టులు ఉన్నాయి. పదో తరగతి (మెట్రిక్యులేషన్) లేదా సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ దరఖాస్తులు కూడా మొదలయ్యాయి. అభ్యర్థులు ఎస్‍ఎస్‍సీ అధికారిక వెబ్‍సైట్ ssc.nic.in లో రిజిస్టర్ అయి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇవే.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: 18-01-2023
  • చివరి తేదీ: 17-02-2023
  • ఆన్‍లైన్ పేమెంట్ చివరి తేదీ: 19-02-2023
  • ఆఫ్‍లైన్ చలాన్ జనరేట్ చేసేందుకు చివరి తేదీ: 19-02-2023
  • చలాన్ల ద్వారా చెల్లింపులకు చివరి తేదీ: 20-02-2023 (బ్యాంకుల పనివేళల్లో)
  • అప్లికేషన్‍లో మార్పులు: 23-02-2023 నుంచి 24-02-2023 వరకు.. (కరెక్షన్ చార్జీలు ఉంటాయి)
  • కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ షెడ్యూల్: ఏప్రిల్ 2023

విద్యార్హత: పదో తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత

వయోపరిమితి: 01-01-2023 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు (02-01-1998 నుంచి 01-01-2005 మధ్య జన్మించి ఉండాలి) ఉండాలి. సీబీఐసీలో హవల్దార్లతో పాటు కొన్ని ఎంటీఎస్ పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 02-01-1996 నుంచి 01-01-2005 మధ్య జన్మించి ఉండాలి. ఎస్‍సీ, ఎస్‍టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితి మినహాయింపు ఉంటుంది. నిబంధన మేరకు వివిధ కేటగిరీల వారికి కూడా సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.100, ఎస్‍సీ, ఎస్‍టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‍మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం ఇలా..

SSC MTS, Havildar Notification: ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (CBE) ఉంటుంది. దీంట్లో అర్హత సాధించిన వారు ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్ష (PET)కు హాజరవ్వాలి. చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

రెండు సెషన్‍లలో పరీక్ష

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్.. రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్ 120 మార్కులకు, రెండో సెషన్ 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. అంటే మొత్తంగా 270 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

సబ్జెక్టులు ఇవే: మొదటి సెషన్‍లో న్యూమరికల్ అండ్ మ్యాథమ్యాటికల్ ఎబిలిటీ, రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లం సాల్వింగ్ సబ్జెక్టులపై క్వశ్చన్లు ఉంటాయి. రెండో సెషన్‍లో జనరల్ అవేర్‍నెస్, ఇంగ్లీష్, కాంప్రహెన్స్ పై ప్రశ్నలు ఉంటాయి. సెషన్-1లో నెగెటివ్ మార్కులు ఉండవు. సెషన్-2లో నెగెటివ్ మార్కులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. సెషన్-2లో ఒక్కో తప్పు సమాధానానికి ఒక్కో నెగెటివ్ మార్కు ఉంటుంది.

తెలుగు, సహా ప్రాంతీయ భాషల్లోనూ..

SSC MTS, Havildar Notification: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష 15 భాషల్లో ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళం, అసామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కొంకణి, మణిపురి, మరాఠి, ఒడియా, పంజాబీ, ఉర్దూ భాషల్లో పరీక్ష ఉంటుంది. దరఖాస్తు సమయంలో పరీక్ష భాషను అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి.

IPL_Entry_Point