India Post GDS 2023 : పోస్టాఫీసుల్లో 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఏపీ, తెలంగాణలోని ఖాళీలు ఎన్నంటే?-indian post office department issued notification for gds jobs in telugu states details inside ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  India Post Gds 2023 : పోస్టాఫీసుల్లో 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఏపీ, తెలంగాణలోని ఖాళీలు ఎన్నంటే?

India Post GDS 2023 : పోస్టాఫీసుల్లో 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఏపీ, తెలంగాణలోని ఖాళీలు ఎన్నంటే?

HT Telugu Desk HT Telugu
Jan 29, 2023 02:03 PM IST

India Post Recruitment 2023: ఇండియా పోస్ట్ నుంచి మరోసారి అతిపెద్ద నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణ పరిధిలోని పోస్టుల వివరాలు చూస్తే...

ఏపీ తెలంగాణలోని పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు
ఏపీ తెలంగాణలోని పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు

India Post GDS 2023 Jobs in AP and Telangana: ఇండియా పోస్ట్... దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో 40,889 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో 2480, తెలంగాణ పరిధిలో 1266 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ 40,889 ఖాళీలకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి indiapostgdsonline.gov.in సందర్శించవచ్చు. మరోవైపు ఈ పోస్టులకు జనవరి 27 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.

మొత్తం ఖాళీల సంఖ్య: 40,889.

భర్తీ చేసే పోస్టులు - గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్/

డాక్ సేవక్ సర్కిల్ వారీగా ఖాళీల వివరాలు

తెలంగాణ- 1266

ఆంధ్రప్రదేశ్- 2480

అసోం- 407

బిహార్- 1461

ఢిల్లీ - 46

ఛత్తీస్‌గఢ్-1593

గుజరాత్- 2017

హర్యానా- 354

హిమాచల్‌ప్రదేశ్- 603

జమ్ము కశ్మీర్- 300

ఝార్ఖండ్- 1590

కర్ణాటక- 3036

కేరళ- 2462

మధ్యప్రదేశ్- 1841

మహారాష్ట్ర- 2508

నార్త్ ఈస్టర్న్- 923

ఒడిశా- 1382

పంజాబ్- 766

రాజస్థాన్- 1684

తమిళనాడు- 3167

ఉత్తర ప్రదేశ్- 7987

ఉత్తరాఖండ్- 889

పశ్చిమ్ బెంగాల్- 2127

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. సైకిల్ తొక్కటం రావాలి. వీటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 16.02.2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.01.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు తుది గడువు: 16.02.2023.

Whats_app_banner