తెలుగు న్యూస్  /  National International  /  Prime Minister Narendra Modi Flags Off Vande Bharat Express From Una

Vande Bharat Express: నాలుగో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన ప్రధాని

HT Telugu Desk HT Telugu

13 October 2022, 10:45 IST

  • Vande Bharat Express: దేశంలో నాలుగో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ‌ను ప్రధాన మంత్రి ప్రారంభించారు.

హిమాచల్ ప్రదేశ్ - న్యూడిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన ప్రధాన మంత్రి (ప్రతీకాత్మక చిత్రం)
హిమాచల్ ప్రదేశ్ - న్యూడిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన ప్రధాన మంత్రి (ప్రతీకాత్మక చిత్రం) (HT_PRINT)

హిమాచల్ ప్రదేశ్ - న్యూడిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన ప్రధాన మంత్రి (ప్రతీకాత్మక చిత్రం)

సిమ్లా, అక్టోబర్ 13: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా రైల్వే స్టేషన్ నుండి దేశంలోని నాలుగో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని అంబ్ అందౌరా - న్యూఢిల్లీ మధ్య ఈ రైలు నడుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

‘కొత్త వందే భారత్ రైలు మునుపటి వాటితో పోలిస్తే అధునాతన వెర్షన్. చాలా తేలికైనది. తక్కువ వ్యవధిలో అధిక వేగాన్ని చేరుకోగలదు..’ అని అధికారులు తెలిపారు.

ఈ రైలు బుధవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. అంబాలా, చండీగఢ్, ఆనంద్‌పూర్ సాహిబ్, ఉనాలో ఆగుతుంది. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఈ రైలును అందుబాటులోకి తేవడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకం వృద్ధి చెందుతుంది. సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణం పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తుంది.

అంతకుముందు ఉనాలోని పెఖుబేలా హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ స్వాగతం పలికారు.

ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన అనంతరం ఉనా, చంబా జిల్లాల్లో జరిగే రెండు బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగిస్తారు.

గత ఐదేళ్లలో ప్రధాని హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించడం ఇది తొమ్మిదోసారి.

హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.

టాపిక్