New Parliament building inauguration : నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం- లైవ్ అప్డేట్స్
28 May 2023, 16:13 IST
- New Parliament building inauguration : నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ వేడుకల వివరాల కోసం ఈ హెచ్‌టీ తెలుగు లైవ్ పేజ్ని ఫాలో అవ్వండి..
రెజ్లర్లను అడ్డకున్న పోలీసులు
నూతన పార్లమెంటు భవనం ర్యాలీగా వద్దకు వచ్చేందుకు ప్రయత్నించిన భారత టాప్ రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, భజరంగ్ పునియా సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‍ను అరెస్ట్ చేయాలని నెల రోజులపైగా జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన చేస్తున్నారు.
ఆర్జేడీ ట్వీట్‍పై దుమారం
పార్లమెంటు నూతన భవనాన్ని శవపేటిక ఆకారంతో పోల్చుతూ రాష్ట్రీయ జనతా దళ్ (RJD) చేసిన ట్వీట్ దుమారాన్ని రేపుతోంది. బీజేపీ నేతలు ఆ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటును శవ పేటికతో పోల్చుతారా అంటూ ఆగ్రహించారు. ప్రజలే ఆర్జేడీకి బుద్ధి చెబుతారని అన్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆర్జేడీపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
నేతలను పలుకరించిన మోదీ
పార్లమెంటు నూతన భవనంలో ప్రసంగం ముగిసిన తర్వాత కార్యక్రమానికి హాజరైన కొందరు నేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. అందరికీ అభివాదం చేశారు.
నవ భారత ఆకాంక్షలకు ప్రతిబింబం: ప్రధాని మోదీ
140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు పార్లమెంటు నూతన భవనం ప్రతిబింబం అని ప్రధాని మోదీ అన్నారు. నూతన పార్లమెంటు భవనంలో ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రూ. 75 కాయిన్ లాంచ్..
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక రూ. 75 కాయిన్‌ను లాంచ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ఎంపీల సంఖ్య పెరగాలి..
“నూతన పార్లమెంట్ భవనం అత్యావశ్యకం. రానున్న కాలంలో ఎంపీల సంఖ్యను పెంచాలి. అందుకే ఈ భవనాన్ని నిర్మించాము,” అని ప్రధాని మోదీ అన్నారు.
రెజ్లర్ల అరెస్ట్..
తమ నిరసనల్లో భాగంగా నూతన పార్లమెంట్ వరకు మార్చ్ చేపట్టిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు. వినీశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజ్రంగ్ పునియాతో పాటు ఇతర రెజ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. రెజ్లర్లు ఇంతకాలం నిరసనలు చేసిన జంతర్‌మంతర్ ప్రాంగణాన్ని పోలీసులు ఖాళీ చేయించినట్టు తెలుస్తోంది.
మోదీ ప్రసంగం..
"ప్రజాస్వామ్య ప్రపంచంలో ఇండియాది తల్లి పాత్ర. రాజదండాన్ని ప్రతిష్టించడం మంచి విషయం. పార్లమెంట్లో అది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. నవ భారత ఆకాంక్షలకు ప్రతీక ఈ పార్లమెంట్ భవనం."
నూతన పార్లమెంట్లో మోదీ ప్రసంగం..
"ఇండియా ముందుకు వెళుతుంటే, ప్రపంచం ముందుకు వెళుతుంది. దేశాభివృద్ధికు పాటు పడే ఈ నూతన పార్లమెంట్.. ప్రపంచాభివృద్ధికి సైతం కృషి చేస్తుంది. దేశంతో పాటు దేశ పార్లమెంట్ కూడా ప్రపంచ పురోగతికి దోహదపడుతుంది."
మోదీకి ఘనస్వాగతం..
నూతన పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు ఎంపీలు. ఆయన లోక్‌సభలోకి ప్రవేశిస్తుండగా.. ‘మోదీ.. మోదీ’ అన్న నినాదంతో ఆ ప్రాంగణ మారుమోగిపోయింది. అనంతరం స్పీకర్ కూర్చీ వద్దకు వెళ్లారు మోదీ. ఆయనతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివన్ష్ ఉన్నారు. అనంతరం లోక్‌సభలో జాతీయ గీతాన్ని ఆలపించారు.
సావర్కర్‌కు నివాళి..
నేడు సావర్కర్ జయంతి. ఈ నేపథ్యంలో నూతన పార్లమెంట్ భవనంలో ఆయనకు నివాళులర్పించారు ప్రధాని మోదీ.
ఆర్జేడీ వ్యాఖ్యలు..
నూతన పార్లమెంట్ భవనంపై తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేసింది ఆర్జేడీ. పార్లమెంట్ భవనం శవపేటికలా ఉందని పేర్కొంది. దీనిపై బీజేపీ మండిపడింది.
మోదీపై ప్రశంసలు..
నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధాని మోదీపై మఠాధిపతులు ప్రశంసల వర్షం కూరిపిస్తున్నారు. మోదీకి అన్ని సద్గుణాలు ఉన్నాయని అవినాస్ మట్కి చెందిన కామత్చి దాసర్ స్వామి తెలిపారు.
విపక్షాలు దూరం..
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. కాగా దాదాపు 20కిపైగా విపక్ష పార్టీలు ఈ వేడుకలకు దూరంగా ఉన్నాయి.
భవన నిర్ణాణంలో..
నూతన పార్లమెంట్ భవనం నిర్ణాణంలో వినియోగించిన సాండ్స్టోన్ (ఇసుకరాయి)ని రాజస్థాన్ సర్మాథుర నుంచి తీసుకొచ్చారు. దిల్లీలోని హుమాయున్ టోంబ్, ఎర్ర కోటను కూడా ఇదే సాండ్‌స్టోన్‌తో నిర్మించడం విశేషం.
సర్వ ధర్మ ప్రార్థనలు..
పార్లమెంట్ ప్రాంగణంలో 'సర్వ ధర్మ' ప్రార్థనలు జరిగాయి. ఇందులో ప్రధాని, స్పీకర్‌తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
కార్మికులకు సత్కారం..
ఈ సందర్భంగా.. నూతన పార్లమెంట్ భవనాన్ని శరవేగంగా పూర్తి చేసిన కార్మికులను ప్రధాని మోదీ సత్కరించారు.
రాజదండంతో..
ప్రత్యేక పూజల అనంతరం రాజదండం వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు ప్రధానమంత్రి. అనంతరం అథీనం మఠాధిపతుల ఆశీర్వాదాలతో రాజదండాన్ని అందుకున్నారు. వేద మంత్రాల మధ్య లోక్‌సభలోకి అడుగుపెట్టి.. స్పీకర్ కుర్చీ వద్ద ఆ రాజదండాన్ని ప్రతిష్టించారు.
మోదీ పూజలు..
నూతన పార్లమెంట్ భవనం వద్దకు ఉదయాన్నే చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రారంభోత్స వేడుకలు..
దేశ చరిత్రలో మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది! ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్స వేడుకలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి.